అబ్బో జ‌గ‌న్‌కే తెలివితేట‌లు!

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి త‌న‌కు మాత్ర‌మే తెలివితేటలున్నాయ‌ని అనుకుంటున్నార‌నే అనుమానం. వైసీపీ కోసం ఇక మీద‌ట క‌ష్ట‌ప‌డి ప‌ని చేసేవారికి మంచి అవ‌కాశాలు, ప్ర‌మోష‌న్లు ఇస్తామ‌ని చెప్ప‌గానే… ఇంత‌కంటే మ‌హాభాగ్యం ఏముంద‌నుకుని పోలోమ‌ని…

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి త‌న‌కు మాత్ర‌మే తెలివితేటలున్నాయ‌ని అనుకుంటున్నార‌నే అనుమానం. వైసీపీ కోసం ఇక మీద‌ట క‌ష్ట‌ప‌డి ప‌ని చేసేవారికి మంచి అవ‌కాశాలు, ప్ర‌మోష‌న్లు ఇస్తామ‌ని చెప్ప‌గానే… ఇంత‌కంటే మ‌హాభాగ్యం ఏముంద‌నుకుని పోలోమ‌ని ముందుకు వ‌స్తార‌ని జ‌గ‌న్ ఓ మాట అనేశారు. ఈ సంద‌ర్భంగా వైసీపీ శ్రేణులు వేస్తున్న ప్ర‌శ్న‌ను ఆయ‌న ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా వుంది.

తాడేప‌ల్లిలో వైసీపీ కేంద్ర కార్యాల‌యంలో మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గ వైసీపీ నాయకుల స‌మావేశంలో జ‌గ‌న్ కీల‌క కామెంట్స్ చేశారు. ఆయ‌న ఏమ‌న్నారంటే… “పార్టీకి మంచి చేసిన వారిని, కష్ట‌ప‌డే వారి పేర్ల‌న్నీ రాసుకుంటున్నాం. వాళ్లంద‌రికీ త‌ప్ప‌కుండా అవ‌కాశాలు, మంచి ప్ర‌మోష‌న్లు వుంటాయి” అని చెప్పారు.

పార్టీ అధికారంలో ఉన్నా, లేక‌పోయినా ఏదైనా పిలుపు ఇస్తే త‌ర‌లి రావాలంటే కార్య‌క‌ర్త‌ల ఆద‌ర‌ణే కీల‌క‌మ‌ని ఇంత‌కాలానికి జ‌గ‌న్ గుర్తించ‌డం మంచి ప‌రిణామం. గ్రామ స్థాయి నుంచి పార్టీని బ‌లోపేతం చేయాల‌ని జ‌గ‌న్ త‌హ‌త‌హ‌లాడుతున్నారు. అందుకే పార్టీ కోసం క‌ష్ట‌ప‌డి ప‌ని చేస్తే , భ‌విష్య‌త్‌లో ప్ర‌మోష‌న్లు ఇస్తామ‌ని జ‌గ‌న్ ఓ పాచిక విసిరారు.

అయితే ఇంత వ‌ర‌కూ క‌ష్ట‌ప‌డిన వాళ్ల‌కు ఏం చేశారు? ఏం చేస్తార‌నే ప్ర‌శ్న కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల నుంచి వ‌స్తోంది. ఈ ప్ర‌శ్న కీల‌క‌మైంది. ఎందుకంటే, అధికారంలో లేని పార్టీ అధ్య‌క్షుడి భ‌రోసాకు విలువ వుండ‌దు. పార్టీ శ్రేణులు మాట‌ల‌కు విలువ వుంటుంది. వైసీపీని ఎలాగైనా అధికారంలోకి తెచ్చుకోవాల‌ని త‌పించిన వాళ్ల‌కి, జ‌గ‌న్ సీఎం అయిన త‌ర్వాత ద‌క్కిందేంటి? అనే ప్ర‌శ్న‌కు జ‌వాబు చెప్పాల్సిన అవ‌స‌రం వుంది.

సీఎంగా జ‌గ‌న్ ఉన్నంత కాలం పార్టీని ప‌ట్టించుకోక‌పోవ‌డంతోనే కార్య‌క‌ర్త‌ల విశ్వాసాన్ని కోల్పోయార‌న్న‌ది చేదు నిజం. అధికారంలో ఉన్న‌ప్పుడు, పార్టీ కోసం ప‌ని చేసిన వారికి ఏదైనా చేసి వుంటే క‌దా, ఇప్పుడు జ‌గ‌న్ మాట‌ల్ని విశ్వ‌సించ‌డానికి? నాడు అధికారంలో ఉన్న‌ప్పుడు క‌నీసం ఎమ్మెల్యేల‌కు కూడా అపాయింట్‌మెంట్ ఇవ్వ‌కుండా, ఇప్పుడేమో అది చేస్తా, ఇది చేస్తానంటే న‌మ్మేదెవ‌రు? ప‌ని చేయ‌డానికి ముందుకొచ్చేదెవ‌రు?

త‌న‌ను కేడ‌ర్ న‌మ్మాలంటే, గ‌తంలో ప‌ని చేసి న‌ష్ట‌పోయిన వారికి ఇప్ప‌టికైనా సాయం చేయాల్సిన అవ‌స‌రం వుంది. అందుకోసం ఏదైనా గుడ్‌బుక్ రాయ‌డం మొద‌లు పెడితే మంచిది. ఇప్ప‌టి నుంచి ప‌ని చేసేవాళ్ల పేర్లు రాసుకుంటా, భ‌విష్య‌త్‌లో ఏదో చేస్తానంటే, న‌మ్మి ముందుకొచ్చే వాళ్లెవ‌రూ లేర‌ని జ‌గ‌న్ గ్ర‌హించాలి. కూట‌మి వేధింపుల‌ను భ‌రించ‌డానికి వైసీపీ కార్య‌క‌ర్త‌లు , నాయ‌కులు సిద్ధంగా లేరు. 2029లో ఎన్నిక‌ల‌ప్పుడు… ఆ రోజు వాతావ‌ర‌ణాన్ని బ‌ట్టి చూసుకుందాం అనే వాళ్లే ఎక్కువ‌. కావున గ‌తంలో ప‌ని చేసిన వాళ్ల‌కు జ‌గ‌న్ సాయం చేస్తున్నార‌న్న సానుకూల టాక్ తెచ్చుకుంటే, ఎలాంటి పిలుపు అవ‌స‌రం లేకుండానే కేడ‌ర్ యాక్టీవ్ అవుతుంది.

33 Replies to “అబ్బో జ‌గ‌న్‌కే తెలివితేట‌లు!”

  1. ఇందుకేగా.. వైసీపీ జనాలను.. కొండ గొర్రెలు అని ముద్దుగా పిలుచుకొంటారు..

    గొర్రె ఎప్పుడూ కసాయి వాడినే నమ్ముకుంటుంది..ఈ కొండ గొర్రెలు జగన్ రెడ్డి నే నమ్ముకుంటారు..

    వాడు తల నరికేసి .. తలకాయ కూర వండేసుకొన్నా.. అదే మహా భాగ్యం అని బతుకుతారు..

    జగన్ రెడ్డి కి శవం దొరికితే గాని బెంగుళూరు నుండి ఆంధ్ర కి రాడు .. వాడిని రప్పించడం కోసం ఈ కొండ గొర్రెలు శవాలైపోతున్నారు..

    వాడు బుక్ రాసే సమయానికి.. పార్టీ స్మశానం గా మిగులుతుంది.. అంతే..

      1. ఇందుకేగా.. వైసీపీ జనాలను.. కొండ గొర్రెలు అని ముద్దుగా పిలుచుకొంటారు..

        గొర్రె ఎప్పుడూ కసాయి వాడినే నమ్ముకుంటుంది..ఈ కొండ గొర్రెలు జగన్ రెడ్డి నే నమ్ముకుంటారు..

        వాడు తల నరికేసి .. తలకాయ కూర వండేసుకొన్నా.. అదే మహా భాగ్యం అని బతుకుతారు..

        జగన్ రెడ్డి కి శవం దొరికితే గాని బెంగుళూరు నుండి ఆంధ్ర కి రాడు .. వాడిని రప్పించడం కోసం ఈ కొండ గొర్రెలు శవాలైపోతున్నారు..

        వాడు బుక్ రాసే సమయానికి.. పార్టీ స్మశానం గా మిగులుతుంది.. అంతే..

  2. ఏమిరా పేమెంట్ ఒక 10రోజులు లేట్ అవుతే తట్టుకోలేకున్నవా..మేము ysr అభిమానులు గా ఇదే చెప్తే మా కామెంట్స్ తేసేసావ్ కదా 3 ఇయర్స్ బాక్..

  3. నామినేటెడ్ పోస్ట్లు కొందరికి ఇచ్చారు కదా, అయినా క్యాడర్ ని కొంచెమైనా పట్టించుకునే పార్టీ ఒక్క టీడీపీ యే అనుకుంటాను, వాళ్ళు టీడీపీ మీద ఈగ వాలనివ్వరు, వైసీపీ వాళ్ళు అయితే కంటిన్యూ గా ఎవరూ సపోర్ట్ గా రాసేవాళ్ళు కనపడడం లేదు. బీజేపీ అధికారం లో ఉన్న చోట ఏమో కాని పట్టించు కోదు అన్నట్లే ఉంది. బీజేపీ సపోర్టింగ్ సోషల్ మీడియా చందా లు అడగడం చూస్తే!

  4. He is far better than the current IT minister, who can’t prove himself in his ministry nor he can run party without his father’s support. He simply wears school uniform and watches TV serials without giving access to cadre.

  5. Jagan given several nominated posts within no time soon after he came to power. Later almost all Mandal ZPchairpersonn posts, standing comitee posts went to YCP cadre. Thing is he implemented 50% reservation to reserved communities this does not gone well with OCs. Its not correct that Jagan did not do anything for cadre. Only thing is he did not benefit party cadre in larger scale like Babu in the Sand black market in the name of free sand and Liquor Shops allocation via privatization

  6. Well said. Jagan needs to start focusing on this and should reactivate the cadre for fighting against the atrocities that this government has started.

  7. Ori dirty greatandhra still thinking jagan is leader ?

    He don’t even respect to Hindus emotions at all .

    What is the problem giving declarion in tirumala as he is christian .

    If any wants to visit Tirumal should visit but cancelling means it bad to that person only.

    Dirty Jagan life end .

Comments are closed.