కూట‌మి అధికారానికి కౌంట్‌డౌన్ స్టార్ట్ అయ్యిందా?

కూట‌మి అధికారానికి కౌంట్‌డౌన్ స్టార్ట్ అయ్యిందా? అంటే… ఔన‌నే స‌మాధానం సంబంధిత నేత‌ల నుంచే రావ‌డం విశేషం. జ‌మిలి ఎన్నిక‌ల‌కు తాము సై అని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు చెప్ప‌డాన్ని కూట‌మి నేత‌లెవ‌రూ జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఐదేళ్ల…

కూట‌మి అధికారానికి కౌంట్‌డౌన్ స్టార్ట్ అయ్యిందా? అంటే… ఔన‌నే స‌మాధానం సంబంధిత నేత‌ల నుంచే రావ‌డం విశేషం. జ‌మిలి ఎన్నిక‌ల‌కు తాము సై అని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు చెప్ప‌డాన్ని కూట‌మి నేత‌లెవ‌రూ జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఐదేళ్ల కాలానికి ఏపీ ప్ర‌జలు ఓట్లు వేశార‌ని, జ‌మిలి ఎన్నిక‌లు వ‌స్తే, కూట‌మి అధికారం ఎంత‌కాల‌మ‌నేది ఎవ‌రూ చెప్ప‌లేని ప‌రిస్థితి అంటున్నారు.

మోదీ స‌ర్కార్ జ‌మిలి ఎన్నిక‌ల‌పై ప‌ట్టుద‌ల‌తో వుంది. వ‌చ్చే నెలలో జ‌ర‌గ‌నున్న పార్ల‌మెంట్ స‌మావేశాల్లో జ‌మిలి ఎన్నిక‌ల‌కు సంబంధించి బిల్లుల్ని ప్ర‌వేశ పెట్ట‌నున్నారు. ఆ త‌ర్వాత దేశ వ్యాప్తంగా రాష్ట్రాల తీర్మానాల్ని తీసుకోనున్నారు. తాజాగా జ‌మిలి ఎన్నిక‌ల‌ను వ్య‌తిరేకిస్తున్న‌ట్టు కేర‌ళ‌లో తీర్మానం చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఏపీ మాత్రం జ‌మిలి ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మంటోంది. జ‌మిలి ఎన్నిక‌లు 2026 లేదా 2027 సంవ‌త్స‌రాల్లో జ‌ర‌గొచ్చ‌ని ఢిల్లీలో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. కేంద్ర ప్ర‌భుత్వ అడుగులు కూడా ఆ దిశ‌గానే సాగుతున్నాయి.

ఈ నేప‌థ్యంలో సీఎం చంద్ర‌బాబునాయుడు ఢిల్లీ వెళ్లి వ‌చ్చిన త‌ర్వాత జ‌మిలి ఎన్నిక‌లపై సానుకూలంగా మాట్లాడ్డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. కేంద్ర పెద్ద‌లు జ‌మిలి ఎన్నిక‌ల‌పై చంద్ర‌బాబుకు సంకేతాలు ఇచ్చి వుంటార‌ని, అందుకే ఆయ‌న కూడా సిద్ధ‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌ని స‌రి ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని కూట‌మి నేత‌లు అంటున్నారు.

కూట‌మి ప్ర‌భుత్వం కొలువుదీరిన మ‌రుక్ష‌ణం నుంచి అధికార పార్టీల నేత‌లు దందాల‌పై ప‌డ్డారు. అందిన‌కాడికి దోచుకోడానికి వెనుకాడ‌డం లేదు. ఈ ప‌రిణామాలు కూట‌మి ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త‌కు దారి తీసింది. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా నాలుగు నెల‌ల్లోనే కావాల్సినంత నెగెటివిటీని సంపాదించుకుంది. దీంతో ఎన్నిక‌లు వ‌స్తే, మ‌ళ్లీ అధికారాన్ని ద‌క్కించుకుంటామ‌నే న‌మ్మ‌కం కూట‌మి నేత‌ల్లో ఎంత‌మాత్రం లేదు. అధికారం ద‌క్క‌క‌పోతే అనే ఆలోచ‌నే వారిని భ‌య‌పెడుతోంది. అందువ‌ల్లే జ‌మిలి ఎన్నిక‌లకు సిద్ధ‌మ‌ని చంద్ర‌బాబు చెప్ప‌డాన్ని, కూట‌మి నేత‌లంతా త‌ప్పు ప‌డుతున్నారు. మ‌రోవైపు ఎన్నిక‌లు క‌నుచూపు మేర‌లో క‌నిపిస్తున్నాయ‌ని, అధికారం త‌మ‌దే అని వైసీపీ నేత‌లు ధీమా వ్య‌క్తం చేస్తుండ‌డం విశేషం.

17 Replies to “కూట‌మి అధికారానికి కౌంట్‌డౌన్ స్టార్ట్ అయ్యిందా?”

  1. నీ అంతటి దేడ్ దిమాక్ గాడు జర్నలిస్టుగా ఎలా అయ్యాడో అర్థం కావడం లేదు..

    జమిలి ఎన్నికలు 2029 లో సార్వత్రిక ఎన్నికలతో పాటే జరుగుతాయి.. అప్పుడు అన్ని రాష్ట్రాల ఎన్నికలను సర్దుబాటు చేసి.. 2029 లో జరిగేలా చూస్తారు..

    ఈ మధ్యలో నియోజకవర్గాల పునర్విభజన కూడా ఉంటుంది.. ఆ ప్రాసెస్ 2026 లో మొదలవుతుంది..

    ఈ తతంగమంతా అవడానికి రెండేళ్లు పడుతుంది..

    ఈ మాత్రం బేసిక్ కామన్ సెన్స్ లేకుండా జర్నలిస్టుగా ఎలా అయ్యాడో అర్థం కావడం లేదు..

    జగన్ రెడ్డి ఎదో వాగుతాడు.. వాడిని లేపడానికి.. వీడికి కింద జారిపోయేలా ఎగురుతుంటాడు..

    ఈ మాత్రం దానికి.. “కౌంట్ డౌన్” అంటూ సొల్లు.. ఇంకో నాలుగున్నరేళ్ల గుద్దమూసుకుని ఉండు..

    నీ జగన్ రెడ్డి పార్టీ ని మూసేసాకే జమిలి ఎన్నికలు ఉంటాయి.. నిజానికి నీ జగన్ రెడ్డి కి కౌంట్ డౌన్.. రాసుకో..

  2. ఆ 10 మంది ఎమ్ ఎల్ ఏ లు ( జగన్ కాకుండా ) నిద్ర పోకుండా చేస్తున్నావు G A…

  3. ప్రమాణ స్వీకారం వైజాగ్ లోనే చేస్తాడా? లేక బెంగుళూరు లో చేస్తాడా?

Comments are closed.