డొక్కా, పవన్ లాంటోళ్లకి చాలా కోరికలున్నాయ్!

సరస్వతీ పవర్ సంస్థకు చెందిన షేర్ల వివాదం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా నడుస్తోంది. అంతే తప్ప ఆ సంస్థకు, సుమారు 1500 ఎకరాలకు పైగా ఉన్న భూములకు సంబంధించి ఎలాంటి వివాదమూ…

సరస్వతీ పవర్ సంస్థకు చెందిన షేర్ల వివాదం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా నడుస్తోంది. అంతే తప్ప ఆ సంస్థకు, సుమారు 1500 ఎకరాలకు పైగా ఉన్న భూములకు సంబంధించి ఎలాంటి వివాదమూ లేదు. కాకపోతే.. జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెండింగులో ఉన్నాయి గనుక.. ఆయనకు చెందిన తతిమ్మా అన్ని సంస్థల మాదిరిగానే సరస్వతీ పవర్ సంస్థ భూములు కూడా ఈడీ ఎటాచ్‌మెంట్‌లో ఉన్నాయి. వాటిని అనుభవించగలరు తప్ప ఇతర లావాదేవీలు చేయలేరు. కాబట్టే.. ఆ కంపెనీ షేర్లను బదిలీ చేయించడం అనేది కేవలం జగన్ ను అరెస్టు చేసేదిశగా జరిగిన ఒక కుట్రగా ఇప్పుడు అందరూ భావిస్తున్నారు.

ఇలాంటి సమయంలో- జగన్ కు ఈ ఎపిసోడ్ లో ఎనలేని నష్టం జరగాలని కోరుకుంటున్న కొందరు నాయకులు తమ ఆత్రుతను దాచుకోలేకపోతున్నారు. అలాంటి వారిలో గతంలో జగన్ దయ వలన ఎమ్మెల్సీ పదవిని కూడా అనుభవించి, ఆ తర్వాత తెలుగుదేశంలోకి ఫిరాయించిన డొక్కా మాణిక్యవరప్రసాద్, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వంటి వారున్నారు.

ముందు డొక్కా గారి కోరిక ఏమిటో చూద్దాం. సరస్వతీ పవర్ కు కేటాయించిన భూములను ఏపీ ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని డొక్కా కోరుతున్నారు. గతంలో మంత్రిగా కూడా పనిచేసిన విద్యావంతుడు డొక్కా.. ఇంత ఘోరమైన అవగాహన రాహిత్యంతో ఎలా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు.

సరస్వతీ పవర్ కు అసలు ప్రభుత్వం భూములు కేటాయించడం అనే పర్వమే జరగలేదు. అవన్నీ ఆ సంస్థ స్వయంగా రైతులనుంచి కొనుక్కొన్నటువంటి పట్టాభూములు. రైతులనుంచి వందల ఎకరాలను తీసుకుని 15 ఏళ్లు గడుస్తున్నప్పటికీ ఇంకా పరిశ్రమ స్థాపించలేదని ఆరోపిస్తున్న డొక్కా.. అది ఆ కంపెనీ ఇష్టం కదా అనే సంగతి మర్చిపోతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన భూమి అనేదే లేనప్పుడు.. వెనక్కు తీసుకోవడం మాత్రం ఎలా ఉంటుందనే లాజిక్ మిస్సవుతున్నారు.

ఒక సొసైటీ ఏర్పాటు చేసి ఆ భూముల్ని కౌలుకు ఇచ్చేదిశగా ఆలోచించాలని ఆయన సూచిస్తున్నారు. లీగల్ గా అది ఎలా కుదురుతుందో కూడా ఆయనే చెప్పాలి. లేదంటే నూతన పారిశ్రామక వేత్తలకు కేటాయించాలట. అసలు ఒక ప్రెవేటు సంస్థకు చెందిన భూమిని, ఇతర పరిశ్రమలకు కేటాయించడానికి ప్రభుత్వానికి ఏం హక్కు ఉన్నదని ఆయన అనుకుంటున్నారో అర్థం కావడం లేదు.

అలాగే పవన్ కల్యాణ్ వ్యవహారం మరొకటి. ఆ భూముల్లో అటవీశాఖ భూములు కూడా ఉంటాయేమోనని, ఉన్నట్లయితే.. అది తనకు సంబంధించిన శాఖ గనుక.. అటవీ భూములు ఉన్నాయనే నెపం చూపించి జగన్ ను ఇరుకున పెట్టడానికి పావులు కదపవచ్చునని ఆయన ఆశించారు. కానీ ఆయన ఆశలు ఫలించలేదు.

ఈ గొడవ బయటకు రాగానే.. అటవీ భూములు ఉన్నాయేమో చూడాలని ఆయన అధికారుల్ని పురమాయించారు. రెవెన్యూ అధికారులు స్వయంగా సర్వేలు నిర్వహించి.. మొత్తం సరస్వతీ పవర్ కు చెందిన భూముల్లో అటవీ భూములు ఒక్కటి కూడా లేవని నివేదిక ఇచ్చారు. దాంతో పాపం పవన కు ఆశాభంగం అయినట్లయింది.

27 Replies to “డొక్కా, పవన్ లాంటోళ్లకి చాలా కోరికలున్నాయ్!”

  1. “సరస్వతీ పవర్ కు అసలు ప్రభుత్వం భూములు కేటాయించడం అనే పర్వమే జరగలేదు”…

    yeah, cancel the mining rights…dont try to be smart ass GA

  2. “సరస్వతీ పవర్ కు అసలు ప్రభుత్వం భూములు కేటాయించడం అనే పర్వమే జరగలేదు”..

    cancel the mining rights..thats enough.

  3. Ha! Ha!! LoL!!

    News from 2012. 600 hectares were allocated!!

    timesofindia.indiatimes.com/india/ed-questions-jagan-on-allotment-of-quarries-worth-rs-3000-crore/articleshow/14873888.cms

  4. ఒరె తిక్క సన్నసి! ఒక వేల అక్కడ కొన్ని భూములు మీరు కొన్నా.. ఆ భూములలొ సున్నపు రాయిని తవ్వుకొని తీసుకొనె హక్కు మీకు ఉందదురా అయ్యా!

    ఈ దెశంలొ పొలం ఎవడిది అయినా, ఆ భూమి లొపల ఉన్న గనులు అన్ని భారత ప్రబుత్వానికె చెందుతాయి. అవి వాడుకొవాలి అంటె ప్రభుత్వం పర్మిషన్ కావాలి! నువ్వు 10 లక్షల విలువైన సున్నపు రాయిని ఉన్న 15 వెల ఎకరాలని లెజుకు తీసుకొని ఈ పరిశ్రమా మొదలు పెట్టకుండా ఉంటె ఆ లైసెన్స్ క్యన్సిల్ చెస్తారు!

    1. నిజానికి ఈ బుముల లీజు ఒక సారి జగన్ కంపనీకి క్యన్సిల్ చెసారు, అయితె అన్న CM అయ్యాక మళ్ళి ఆ లీజు అయన కంపనీకె ఇచ్చుకున్నాడు!

  5. తు*గ్లక్ గ్రే*ట్ ఆంద్ర,

    కోట్లు విలవ చేసే సున్నం గనులు వున్న పొలాలు నీ , రైతులు లని మో*సం చేసి, భ*యపెట్టి కేవలం 3 లక్ష*ల కే ఆక్ర*మించిన ప్యా*లెస్ పు*లకేశి గాడి కి ఆ రైతుల చేతనే ప*లుగు మీద కుచో*బెట్టాలి.

    రై*తుల లని మోసం చేసి లాక్కు*న్న బూ*ములు అవి.

  6. అప్పట్లో అధికారాన్ని అడ్డం పెట్టుకొని రైతులని బెదిరించి హింసించి వాళ్ళ కి అతి తక్కువ డబ్బు ఇచ్చి ఆక్రమించుకున్న భూములు అవి.

  7. మన అన్నయ్య కష్టార్జితం తో కొన్న వేల ఎకరాల భూములు కదా GA అవి….అందుకే కుళ్ళు వాళ్ళకి…. ఐనా అన్ని వేల ఎకరాల భూమిని రైతులు దగ్గర నుంచి బెదిరించి ఎలా లాక్కుంటారో పాపం యే సినిమా లోనూ చూడలేదేమో GA వాళ్ళు….

  8. అంటే ఎంకటీ…మన మహా మేత అడవుల్లో పోయాడుకదా..

    అడవులు మింగెయ్యటం వల్లే అలా అడవుల్లో పోయాడోమో అని..

    ఎదోలే హిందువులు కాదా కర్మ సిద్ధాంతం ప్రకారం అలా ఏమన్నా జరిగుండొచ్చని చిన్న డౌటానుమానమేమో…

  9. వాగులు, వంకలు, గుట్టలు, సున్నపు బట్టీ అని వార్తలు వచ్చాయి కదా గూ/ ట్లే, అప్పుడు పర్యావరణానికి ముప్పు కాదని నువ్వెలా డిసైడ్ చేస్తావ్. ఒక కొండ చుట్టూ వున్నా భూములు కొనేసి, ఆ కొండా కూడా మాదే అనే దౌరాగ్యపు తెలివితేటలు వీళ్ళ సొత్తు. ఈ జగన్ బ్యాచ్ గుడిని కాదు, గుడిలో లింగాన్ని మింగేసే అపార అసుర గణం. ఏ మాత్రం అవకతవకులున్న ప్రభుత్వం ఈ భూమిని వశబరుచుకోవాలి.

  10. 2008 లో మహా మేత గాడు రైతులని బెదిరించి రాయించుకున్న భూములు, G O నెంబర్ 420 తో అందులో ఉన్న గనులు నీచుడు జగన్ రెడ్డి కాజేసాడు , గనుల లీజ్ ప్రభుత్వం కాన్సుల్ చేసి , ఆ భూములని రైతులకి వెనక్కి ఇవ్వాలి మూడు పంటలు పండే భూములు అవి

  11. మహా మేత చచ్చి బతికిపోయాడు లేక పోతే చిప్ప కుడే !! తెల్లటి పంచ తెల్లటి జుబ్బా కట్టుకోనిడికల్లా తెల్లటి మనసు ఉండదని తెలియక ఈ కుక్కలని సింహాసనం ఎక్కించాము చివరికి ప్రజల కంచాల్లో షిట్ చేశారు గాడిద కొడుకులు !!

  12. మ*హా మే*త చ*చ్చి బతికిపోయాడు లేక పోతే చి*ప్ప*కు*డే !! తెల్లటి పంచ తెల్లటి జుబ్బా కట్టుకోనిడికల్లా తెల్లటి మనసు ఉండదని తెలియక ఈ కు*క్క*ల*ని సింహాసనం ఎక్కించాము చివరికి ప్రజల కం*చాల్లో షి*ట్ చేశారు గా*డి*ద కొ*డు*కు*లు !!

  13. దోపిడీ దోపిడీ దోపిడీ.

    టిడిపి దోపిడీ

    బాబు దోపిడి 

    కార్యకర్తలతో దోపిడి

    ఎమ్మెల్యేల దోపిడి

    ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చా కా జరిగిం ది ఏమిటి? తెలుగుదేశం కార్యకర్తలకు చేతి నిండా సంపద! ఎమ్మె ల్యే లకు వాటాలు, ఎక్క డిక్క డ వసూళ్లు! ఇసుక, మట్టి తేడా లేకుండా.. అన్నీ తెలుగుదేశం పార్టీ కార్య కర్తలకు సంపాదన మార్గాలుగా మారడం ! ఇక కాం ట్రాక్టులు,

    అప్ప టికే ఉన్న రకరకాల సం పాదన మార్గాలకు పూర్తిగా ద్వా రాలు తెరిచడు.

    చం ద్రబాబు అధికారంలోకి రాక ముం దు నుం చి తన పార్టీ కార్యకర్తలకు చెబుతూ వచ్చా రు. ఒక్క సారి అధికారం దక్క గానే కార్యకర్తలు చెప్పిం దే రాజ్యం అని చం ద్రబాబు నాయుడు బాహాటం గానే చెప్పా రు. ప్రజలు కూడా అది విన్నా రు. ఓటేశారు. ఇప్పు డు సం క్షేమ పథకాలు కావాలన్నా , ప్రభుత్వం నుం చి ఏం పని జరగాలన్నా తెలుగుదేశం కార్యకర్తల ఆమోదముద్ర తప్ప నిసరి. ఆ ఆమోదముద్రకు ఖర్చు అవుతుం ది. దాన్ని చెల్లిం చుకుం టూ ప్రజలు తమ పనులు చేసుకుం టూ ఉన్నా రు.

  14. కాకినాడ సెజ్ కి కొన్నారు కానీ పోలీస్ లతో రైతులను తన్నించి కేసులు పెట్టించి ఇక్కడ అంతే పవన్ కళ్యాణ్ సరైనోడు ఎలాగా తిరిగి తీసుకోవాలో తెలిసినోడు వీళ్ళు కూడా అతనొస్తే చేతులు కట్టుకొని ఇచ్చేస్తారు అంతా చట్టప్రకారమే నడుస్తుంది

Comments are closed.