చివరిసారిగా 1990లో కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఏక పార్టీ ప్రభుత్వం అదే చివరిది. ఆ తర్వాత అన్నీ కూటమి ప్రభుత్వాలే. కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీగా చీలడంతో ఆ తర్వాత కాంగ్రెస్ అనుకూల గాలులు వీచినప్పుడు కూడా ఎన్సీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి కొనసాగింది. ఇక శివసేన-బీజేపీల కూటమి ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. ఇప్పుడు శివసేన రెండు ముక్కలు అయ్యింది. ఎన్సీపీ కూడా రెండు మక్కలు అయ్యింది. బీజేపీ మాత్రమే ఇప్పుడు వీలైనన్ని ఎక్కువ సీట్లలో పోటీ చేయగలుగుతూ ఉంది!
288 సీట్లున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో .. బీజేపీ సుమారు 150 స్థానాల్లో తన అభ్యర్థులను బరిలో ఉంచుతూ ఉంది. అయితే కమలం పార్టీ ఎలాగూ వందకు వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించే అవకాశాలు లేవు కాబట్టి.. ఈ సారి కూడా మహారాష్ట్రలో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా కూటమి ప్రభుత్వమే కానుంది!
అసలు బీజేపీ తన సీఎం అభ్యర్థిగా శివసేన నేత పేరును ప్రకటించింది. ఈ సారి తమ కూటమి అధికారంలోకి వస్తే ఏక్ నాథ్ షిండేనే సీఎం అవుతాడని ఫడ్నవీస్ ప్రకటించుకున్నారు. తద్వారా బీజేపీ ఆశలు కూటమి ప్రభుత్వం మీదే ఉన్నాయి తప్ప సోలో షో మీద కాదని స్పష్టం అవుతోంది.
ఇక వీరి ప్రత్యర్థి కూడా పార్టీ కాదు, కూటమే. ఆ కూటమిలో మూడు పార్టీలూ దాదాపు సమాన స్థాయి సీట్లలో పోటీ చేస్తూ ఉన్నాయి. ప్రాథమికంగా తలా 85 సీట్లలో పోటీ చేసే ఒప్పందం కుదర్చుకున్నాయి ఆ పార్టీలు. మిగిలిన సీట్లను మళ్లీ భాగాలేసుకున్నాయి. ప్రభుత్వం ఏర్పడాలంటే ఈ మూడు పార్టీలూ సోలోగా కూడా సత్తా చూపాలి, కూటమిగా సాగాలి!
దశాబ్దాలుగా కూటమి ప్రభుత్వాలకే మరాఠా ప్రజల మద్దతు దక్కుతూ ఉంది. దేశవ్యాప్తంగా రాజకీయ గాలులు ఎలా ఉన్నా.. ఒక పార్టీని పూర్తిగా చిత్తు చేయడం కానీ, ఒక పార్టీనే పూర్తిగా నెత్తుకెత్తుకోవడం కానీ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల విషయంలో జరగకపోవడం గమనార్హం.
మహారాష్ట్రలో NDA కూటమి ముఖ్యమంత్రి ఏక్‍నాధ్ షిండే అని ఎప్పుడు ప్రకటించింది ?
ఫడ్నవీస్ షిండే పాల్గొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో మీలో ముఖ్యమంత్రి ఎవరు అని అడిగితే, ఫడ్నవిస్ అన్నది ఇదిగో ముఖ్యమంత్రి ఈయనే కదా అని షిండేను చూపించాడు. అంటే కూటమి అభ్యర్ధి షిండే అని ప్రకటించినట్లా ?
బీజేపీ 150, షిండే శివసేన 80 ఆజిత్ పవార్ 50 నిలబడుతున్నప్పుడు, ముఖ్యమంత్రి ఎవరు అవుతారో తెలియదా ? మోసం చేసిన ఉద్ధవ్ ఠాకరే ను చావు దెబ్బ తీయటానికి, అసంతృప్తితో ఉన్న షిండేను లాగేసి, అతడిని ముఖ్యమంత్రిని చేసింది ? ఇది ఎల్లప్పుడూ జరగదు
1995 నుంచి మాత్రమే మహారాష్ట్ర లో అలా జరుగుతుంది, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే! కేరళ, పశ్చిమ బెంగాల్ ల లో 1977 నుంచి కూటమి ప్రభుత్వాలు ఉంటున్నాయి!
టీఎంసీ రాక తో బెంగాల్ లో ఒకే పార్టీ ప్రభుత్వం వచ్చింది!
మా జగన్ రెడ్డన్న కి ఈ దేశం లో ఏ పార్టీలు కూటమి గా పోటీ పడటం నచ్చదు కాబట్టి..
మా సింగల్ సింహం ప్రాణం పోయేవరకు నిరాహార దీక్ష చేసి.. అన్ని పార్టీలు సింగల్ గా పోటీ చేయాలని .. పొత్తులు పెట్టుకోకూడదని .. చట్టాలు చేసి.. ప్రాణ త్యాగం చేయాల్సిందిగా ఆంధ్ర ప్రజలు కోరుకొంటున్నారు..
Call boy works 9989793850
Maha goes 2 -> NDA