బాబుకు ప‌వ‌న్ బెదిరింపు!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ కూట‌మి స‌ర్కార్‌లో ఏదో జ‌రుగుతోంద‌న్న చ‌ర్చ విస్తృత‌మవుతోంది. రెండు రోజుల క్రితం పిఠాపురంలో ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఆడ‌వాళ్ల‌పై అఘాయిత్యాలు విచ్చ‌ల‌విడిగా జ‌రుగుతున్నాయ‌ని వాపోయారు. గ‌తంలో వారికి ర‌క్ష‌ణ క‌ల్పిస్తామ‌ని…

ఆంధ్ర‌ప్ర‌దేశ్ కూట‌మి స‌ర్కార్‌లో ఏదో జ‌రుగుతోంద‌న్న చ‌ర్చ విస్తృత‌మవుతోంది. రెండు రోజుల క్రితం పిఠాపురంలో ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఆడ‌వాళ్ల‌పై అఘాయిత్యాలు విచ్చ‌ల‌విడిగా జ‌రుగుతున్నాయ‌ని వాపోయారు. గ‌తంలో వారికి ర‌క్ష‌ణ క‌ల్పిస్తామ‌ని హామీ ఇచ్చామ‌ని గుర్తు చేశారు. హోంశాఖ మంత్రి అనితే వీటికి బాధ్య‌త వ‌హించాల‌న్నారు. ఆమె చ‌ల‌నం లేకుండా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని , ఇలాగైతే తానే ఆ మంత్రిత్వ‌శాఖ‌ను తీసుకోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు.

మ‌రీ ముఖ్యంగా త‌మ‌ను జ‌నం తిడుతున్నారంటూ ప‌వ‌న్ చేసిన కామెంట్స్ రాజ‌కీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. మ‌రోవైపు ఇవాళ ప‌వ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న ప్రాధాన్యం సంత‌రించుకుంది. కేంద్ర‌హోంశాఖ అమిత్‌షాతో ఆయ‌న భేటీ కానున్నారు. రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌లు క‌రువ‌వుతున్నాయ‌ని ప‌వ‌న్ ఆందోళ‌న వ్య‌క్తం చేయ‌డం, ఆ వెంట‌నే కేంద్ర హోంశాఖ మంత్రి, ఎన్డీఏలో అత్యంత కీల‌క నాయ‌కుడు అమిత్‌షాతో భేటీ కావాల‌ని నిర్ణ‌యించుకోవ‌డం వెనుక ఏదో బ‌ల‌మైన కార‌ణం వుంద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడిని బ్లాక్‌మెయిల్ చేయ‌డానికి ప‌వ‌న్ ఇలాంటి వ్యూహానికి తెర‌లేపారా? అనే చ‌ర్చ జ‌రుగుతోంది. ఇప్ప‌టికిప్పుడు అమిత్‌షాను ప‌వ‌న్ క‌ల‌వాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని టీడీపీ నాయ‌కులు ప్ర‌శ్నిస్తున్నారు. అమిత్‌షాతో భేటీ కావ‌డం ద్వారా ముఖ్యంగా చంద్ర‌బాబు, టీడీపీ నేత‌ల‌కు ఏదో సంకేతం ఇవ్వాల‌ని ప‌వ‌న్ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. ఇంత‌కూ ప‌వ‌న్ మ‌న‌సులో ఏముంది? అనే ఆరా తీయ‌డం ఎక్కువైంది.

ప‌వ‌న్ మాట‌ల్లో, ఆలోచ‌న‌ల్లో ఏదో తేడా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు. అందుకే ఆయ‌న రాజ‌కీయ పంథాలో మార్పు చోటు చేసుకుంద‌నే వాళ్లు లేక‌పోలేదు. ప‌వ‌న్ అడుగుల్ని టీడీపీ జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తోంది. ఎందుకంటే ప‌వ‌న్ ఏమంత న‌మ్మ‌ద‌గ్గ నాయ‌కుడు కాద‌నే అభిప్రాయం టీడీపీ నేత‌ల్లో వుంది.

10 Replies to “బాబుకు ప‌వ‌న్ బెదిరింపు!”

  1. హనుమంతుడి(CBN) ముందు కుప్పిగoతులా… .. కాదు కూడదంటే ఏవో మాట్లాడటం… అసంబద్దం అప్రస్తుత ప్రేలాపనలు… ఏమిటో….

Comments are closed.