టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడితో పాటు మరో 16 మంది సభ్యులు బుధవారం కలియుగ దైవం శ్రీవారి సన్నిధిలో ప్రమాణ స్వీకారం చేశారు. వీళ్లందరితో టీటీడీ ఈవో శ్యామలారావు ప్రమాణ స్వీకారం చేయించారు. ఒక టీవీ ఛానెల్ అధిపతి అయిన బీఆర్ నాయుడిని టీటీడీ చైర్మన్‌గా చంద్రబాబు సర్కార్ నియమించిన సంగతి తెలిసిందే.
ముఖ్యంగా మంత్రి లోకేశ్ చొరవతోనే సదరు ఛానెల్ అధిపతికి టీటీడీ చైర్మన్ పదవి దక్కినట్టు టీడీపీ నేతలు చెబుతున్నారు. స్వామి దర్శనం కోసం రోజుల తరబడి ఎదురు చూడకుండా సాధ్యమైనంత త్వరగా అయ్యేలా చర్యలు తీసుకుంటానని బీఆర్ నాయుడు ఇప్పటికే ప్రకటించారు. రెండు మూడు గంటల్లోనే స్వామి దర్శనం చేసుకుని ఆలయం వెలుపలికి వచ్చేలా చూస్తానన్న ఆయన మాటలు ఏ మాత్రం అమలుకు నోచుకుంటాయని చూడాలి.
అలాగే శ్రీవాణి ట్రస్ట్ రద్దు చేస్తామని ఆయన ఇప్పటికే సంచలన ప్రకటన చేశారు. ఇంకా తిరుమలలో చాలా అద్భుతాలు చేయాలనే ఆలోచన ఉన్నట్టు బీఆర్ నాయుడు ఇప్పటికే ప్రకటించారు. టీటీడీ సభ్యులతో పాటు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌తో చర్చించి టీటీడీలో సంస్కరణలు తీసుకొస్తామన్నారు.
టీటీడీలో భక్తులకు ఉపయోగపడేలా ఏ నిర్ణయం తీసుకున్నా అభ్యంతరం లేదు. అయితే భక్తులకు కోపం తెప్పిస్తే మాత్రం, అంతమంగా ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుందని బీఆర్ నాయుడు గ్రహించి, ఆ మేరకు అడుగులు వేస్తే మంచిది.
vc available 9380537747
ఈ ప్లాట్ఫారంలో కొంతమంది అసభ్య పదజాలం వాడుతూ, చర్చల్లో కుటుంబ సభ్యులను లాగడం తీవ్రంగా నిరాశ కలిగిస్తోంది. ఇది పూర్తిగా అసహనానికి గురిచేసే విషయం మరియు ఇకపై సహించబడదు. ఈ హెచ్చరికను గుండెపోటుగా తీసుకోండి: ఈ ప్రవర్తన కొనసాగితే, తక్షణ మరియు కఠినమైన చర్యలు తీసుకోబడతాయి.
ప్రతి ఒక్కరికీ ఏ పార్టీని మద్దతు ఇవ్వాలన్నా, ఇతరులతో విభేదించాలన్నా హక్కు ఉంది. కానీ గౌరవం, మర్యాద అనేవి తప్పనిసరి. అసభ్య పదజాలం, వ్యక్తిగత దూషణలు వాడే వారు తక్షణమే నివేదించబడతారు మరియు ఫోరమ్‌లో తమ స్థానం కోల్పోతారు.
పంచ్ ప్రభాకర్ వంటి వ్యక్తులు తమ ప్రసారాల్లో అసభ్యంగా ప్రవర్తిస్తూ, అందరికీ ఒక చెడు ఉదాహరణగా నిలుస్తున్నారు. ఇలాంటి ప్రవర్తనకు ఇక్కడ ఎలాంటి స్థానం లేదు. మనం ఈ స్థాయి నాణ్యతను కాపాడాలంటే, ప్రతి ఒక్కరూ ఉన్నత ప్రమాణాలను పాటించాల్సిన అవసరం ఉంది.
గ్రేట్ ఆంధ్ర పరిపాలనా బాధ్యత వహించాలి మరియు ఈ విషయం పై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇది కేవలం ఒక సామాజిక వేదిక మాత్రమే కాదు, మానవీయ గౌరవాన్ని కాపాడే వేదిక కావాలి. భారత ప్రభుత్వం మరియు ఇతర జాతీయ సంస్థలు కూడా ఇటువంటి ఆన్లైన్ దుర్వినియోగాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాయి. అసభ్య పదజాలం వాడేవారు లేదా వ్యక్తిగత దూషణలు చేసేవారు చట్టపరమైన చర్యలు ఎదుర్కోవలసి ఉంటుంది, మరియు అది మీ జీవితంపై శాశ్వత ప్రభావం చూపవచ్చు.
మీ జీవిత విలువను, గౌరవాన్ని, మీ భవిష్యత్తును అర్థం చేసుకోండి. రాజకీయ ద్వేషం కోసం ఇలాంటి పనులు చేయడం మీకే నష్టకరం. ఇకపై ప్రతి వ్యాఖ్యకు ఎత్తుగడలు ఉంటాయి – ఈ ప్రవర్తనకు తక్షణంగా ముగింపు పలకండి, లేకపోతే మీరు తీవ్రమైన, శాశ్వత పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది