అల్లు అర్జున్ కు హైకోర్టులో ఊరట లభించింది. అతడిపై నంధ్యాల పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను హైకోర్టు కొట్టేసింది. గత ఎన్నికల్లో అల్లు అర్జున్, ఎలాంటి ఎన్నికల నిబంధనల్ని అతిక్రమించలేదని కోర్టు అభిప్రాయపడింది.
గత ఎన్నికల్లో తన స్నేహితుడు శిల్పా రవిచంద్రకు మద్దతిచ్చేందుకు నంధ్యాల వెళ్లాడు బన్నీ. ఆ టైమ్ లో అల్లు అర్జున్ ను చూసేందుకు భారీగా జనం గుమిగూడారు. ఇది ఎన్నికల కోడ్ ను అతిక్రమించడమేనని భావించిన పోలీసులు, అతడిపై కేసు పెట్టారు.
ఈ కేసుపై హైకోర్టుకు వెళ్లిన అల్లు అర్జున్, తను ఎలాంటి ర్యాలీ తీయలేదని కోర్టుకు విన్నవించారు. తను కేవలం ఓ స్నేహితుడ్ని కలిసేందుకు వెళ్లానని, తను వస్తున్నట్టు ముందు రోజు ఎలాంటి ప్రకటనలు ఇవ్వలేదని, రోడ్డు షో కూడా చేయలేదని కోర్టుకు విన్నవించుకున్నారు.
దీనిపై స్పందించిన కోర్టు, బన్నీపై ఎలాంటి చర్యలకు దిగకూడదని పోలీసుల్ని ఇదివరకే ఆదేశించింది. ఇప్పుడు ఏకంగా ఆ కేసును కొట్టేసింది. దీంతో అల్లు అర్జున్ కు ఊరట లభించింది.
ఈ ఘటన తర్వాతే అల్లు అర్జున్ కు, మెగా కుటుంబ సభ్యులకు మధ్య దూరం మరింత పెరిగింది. ఓవైపు టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తుంటే, మరోవైపు అల్లు అర్జున్ రాజకీయ ప్రత్యర్థి ఇంటికెళ్లి అతడికి నైతిక మద్దతు తెలపడాన్ని నాగబాబు లాంటి వాళ్లు బాహాటంగా వ్యతిరేకించారు. ఆ తర్వాత ఓ సందర్భంలో పవన్ కూడా అల్లు అర్జున్ పై, అతడి పుష్ప సినిమాపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు.
ఆ ఘటన జరిగిన రోజు నుంచి ఇప్పటివరకు బన్నీ, మెగా కాంపౌండ్ మధ్య సంబంధాలు మెరుగుపడలేదు. ఈ గ్యాప్ లో అల్లు అరవింద్, పవన్ మాత్రం ఒకట్రెండు సందర్భాల్లో కలుసుకున్నారు.
మరోసారి పవన్, అల్లు అర్జున్ ను కలిపేందుకు పెద్దాయన చిరంజీవి చొరవ తీసుకుంటారని అంతా భావించినప్పటికీ, అలాంటి సందర్భమేదీ కుటుంబంలో ఇప్పటివరకు ఎదురుపడలేదు. అలాంటి ఓ సందర్భం వస్తే మళ్లీ అంతా కలిసిపోతారని బన్నీ వాస్ లాంటి వాళ్లు ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఇలాంటి తప్పుడు casex పెట్టిన police ని, పెట్టమన్న తహశీల్ దార్ ను, దీనిని పర్యవేక్షించిన ఎన్నికల సంఘాన్ని కూడా తీవ్రంహా మందలిస్తే గానీ వ్యవస్థలాలు బుద్ధి రాదు.
Call boy jobs available 9989793850
vc estanu 9380537747