సమగ్ర సర్వే.. దొంగలతో జాగ్రత్త

తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే మొదలైంది. 75 ప్రశ్నల జాబితాతో ఎన్యుమరేటర్లు క్షేత్రస్థాయిలో అడుగుపెట్టారు. వీళ్లతో పాటు దొంగలు కూడా రెడీ అయిపోయారు. ఎన్యుమరేటర్ల ముసుగులో కొంతమంది దొంగలు వచ్చే ప్రమాదముందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.…

తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే మొదలైంది. 75 ప్రశ్నల జాబితాతో ఎన్యుమరేటర్లు క్షేత్రస్థాయిలో అడుగుపెట్టారు. వీళ్లతో పాటు దొంగలు కూడా రెడీ అయిపోయారు. ఎన్యుమరేటర్ల ముసుగులో కొంతమంది దొంగలు వచ్చే ప్రమాదముందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. వీళ్లు ఇళ్లు దోచుకునే దొంగలు కాదు, స్మార్ట్ గా దోచుకుపోయే సైబర్ నేరగాళ్లు.

ఇలాంటి సైబర్ నేరగాళ్ల పట్ల తెలంగాణ వాసులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు. దీనికి సంబంధించి పలు కీలక సూచనలు చేస్తున్నారు.

వేలి ముద్ర అడిగితే పోలీసులకు చెప్పండి..

75 ప్రశ్నలతో అధికారులు సిద్ధమయ్యారు. వాటికి సమాధానాలు చెబితే సరిపోతుంది. అంతేతప్ప, వాటికి ఆధారాలుగా ఎలాంటి పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదు. మరీ ముఖ్యంగా ఆధార్ కార్డు, పాన్ కార్డు అడిగితే అస్సలు ఇవ్వొద్దని సూచిస్తున్నారు. వీటికంటే ముఖ్యమైనది వేలి ముద్ర.

సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా వచ్చిన అధికారులెవ్వరూ వేలి ముద్రలు సేకరించరు. ఎవరైనా మెషీన్ తీసుకొచ్చి వేలిముద్రలు కోరితే అస్సలు ఇవ్వొద్దు. అంతేకాదు, వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెబుతున్నారు. ఇలా పత్రాలు, వేలిముద్రలు ఇవ్వడం వల్ల బ్యాంక్ ఎకౌంట్లు ఖాళీ అవుతాయని హెచ్చరిస్తున్నారు.

సమగ్ర సర్వేలో ఆధార్ నంబర్ అడుగుతారు. అయితే అది ఐచ్ఛికం మాత్రమే. నంబర్ ఇవ్వాలనుకుంటే ఇవ్వొచ్చు లేదంటే నిరభ్యంతరంగా నో చెప్పొచ్చు. ఎన్యుమరేటర్లు ఎవ్వరూ బ్యాంక్ ఖాతా నంబర్ అడగరు. ఇక కుల-మత వివరాలతో పాటు.. ఆస్తులు-అప్పుల వివరాలు కూడా తెలియజేయాల్సి ఉంటుంది. వీటితో పాటు ఫోన్ నంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది.

6 Replies to “సమగ్ర సర్వే.. దొంగలతో జాగ్రత్త”

Comments are closed.