జ‌గ‌న్‌పై దుష్ప్ర‌చారం.. కేసులు పెడ‌తారా?

త‌మ గురించి అభ్యంత‌ర‌క‌ర పోస్టులు పెడితేనే కేసులు పెడ‌తారా? ప్ర‌త్య‌ర్థుల‌పై ఏం చేసినా కేసులు వుండ‌వ‌ని చెప్ప‌ద‌లుచుకున్నారా?

సోష‌ల్ మీడియాలో త‌మపై దుష్ప్ర‌చారం చేస్తున్నారంటూ వైసీపీ యాక్టివిస్టుల‌పై ప్ర‌భుత్వం భారీగా కేసులు పెడుతోంది. విధానాల ప‌రంగా కాకుండా, వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల‌కు పాల్ప‌డుతున్న వారిపై కేసులు పెట్ట‌డంలో త‌ప్పులేదు. అయితే ఉద్దేశ‌పూర్వ‌కంగా, క‌క్ష‌తో ప్ర‌భుత్వం కేసులు పెట్ట‌డం అభ్యంత‌ర‌క‌రం. అయితే కూట‌మికి వ్య‌తిరేకంగా సోష‌ల్ మీడియాలో పోస్టులు, వీడియోలు పెడుతున్న వారిపై మాత్ర‌మే కేసులు పెడుతుండ‌డం విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తోంది.

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై టీడీపీ సోష‌ల్ మీడియా దుర్మార్గంగా దుష్ప్ర‌చారం చేస్తోంద‌ని వైసీపీ ఆరోపిస్తోంది. వైఎస్ జ‌గ‌న్ త‌న త‌ల్లిని చంపేందుకు కారు యాక్సిడెంట్‌కు పాల్ప‌డ్డాడ‌ని ఓ పోస్టును టీడీపీ సోష‌ల్ మీడియా తెగ ప్ర‌చారం చేసింది. అలాగే తన పేరు వాడుకుని, జ‌గ‌న్‌పై దుష్ప్ర‌చారం చేయ‌డాన్ని వైఎస్ విజ‌య‌మ్మ జీర్ణించుకోలేక‌పోయారు. ఈ మేర‌కు రెండు రోజుల క్రితం ప‌లు అంశాల్ని ప్ర‌స్తావిస్తూ ఆమె ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

“రెండు రోజుల క్రితం నా కారుకు ప్ర‌మాదం జ‌రిగింద‌ని సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం మొద‌లు పెట్టారు. గ‌తంలో ఎప్పుడో జ‌రిగిన నా కారు ప్ర‌మాదాన్ని …నా కుమారుడిపై నెట్టి దుష్ప్ర‌చారం చేయ‌డం అత్యంత జుగుప్సాక‌రం. రాజ‌కీయంగా ల‌బ్ధి పొందాల‌నే ఈ ప్ర‌య‌త్నం అత్యంత దుర్మార్గం. ఇక‌పై ఇలాంటి లేనిపోని అస‌త్యాల‌ను ప్ర‌చారం చేస్తే నేను చూస్తూ ఊరుకోద‌లుచుకోలేదు” అని విజ‌య‌మ్మ హెచ్చ‌రించారు.

ఇది ఫేక్ ప్ర‌క‌ట‌న అని, విజ‌య‌మ్మ సంత‌కాన్ని ఫోర్జ‌రీ చేసి వైసీపీ విడుద‌ల చేసిందంటూ టీడీపీ సోష‌ల్ మీడియా విస్తృతంగా ప్ర‌చారం చేసింది. దీంతో విజ‌య‌మ్మ మంగ‌ళ‌వారం ఒక వీడియోను విడుద‌ల చేయాల్సి వ‌చ్చింది. ఆ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది తానే అని ఆమె వివ‌ర‌ణ ఇచ్చుకోవాల్సి వ‌చ్చింది. అయితే ఫేక్ లేఖ అంటూ టీడీపీ సోష‌ల్ మీడియా జ‌గ‌న్‌పై ఎంత నీచంగా దుష్ప్ర‌చారం చేసిందో తెలుసుకుందాం.

ఇలా సంత‌కాలు ఫోర్జ‌రీ చేసే, బాబాయ్‌ని వేసేసి లెట‌ర్ రాయించావా?

ఇలా సంత‌కాలు ఫోర్జ‌రీ చేసి, త‌ల్లిపై ఎన్‌సీఎల్‌టీలో కేసులు వేశావా?

ఇలా సంత‌కాలు ఫోర్జ‌రీ చేసే, చెల్లి ఆస్తులు కొట్టేసావా? సైకో జ‌గ‌న్ అంటూ టీడీపీ సోష‌ల్ మీడియా …విజ‌య‌మ్మ లేఖ ఫేక్ అంటూ విస్తృతంగా ప్ర‌చారం చేసింది. అలాగే త‌న సంత‌కం ఫోర్జ‌రీ చేసార‌ని, విజ‌యా రాజ‌శేఖ‌ర‌రెడ్డి చెప్పు తీసుకుని కొట్ట‌డంతో వైఎస్ జ‌గ‌న్ ట్వీట్ డిలీట్ చేశార‌ని టీడీపీ సోష‌ల్ మీడియా అభ్యంత‌ర‌క‌ర పోస్టుల‌ను వైర‌ల్ చేసింది. నీచ‌, నికృష్ట బుద్ధితో ఏకంగా త‌ల్లి సంత‌కం ఫోర్జ‌రీ చేసిన సైకో… నీ బ‌తుకు మొత్తం ఇలాంటి క‌ల్తీ ప‌నులేనా? అంటూ టీడీపీ సోష‌ల్ మీడియా ప్ర‌చారం చేయ‌డంపై విజ‌య‌మ్మ ఫైర్ అయ్యింది.

దుష్ప్ర‌చారం గురించి హోంశాఖ మంత్రి అనిత‌, అలాగే ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ చాలా నీతులు చెబుతున్నారు. త‌మ గురించి అభ్యంత‌ర‌క‌ర పోస్టులు పెడితేనే కేసులు పెడ‌తారా? ప్ర‌త్య‌ర్థుల‌పై ఏం చేసినా కేసులు వుండ‌వ‌ని చెప్ప‌ద‌లుచుకున్నారా? అని నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు.

47 Replies to “జ‌గ‌న్‌పై దుష్ప్ర‌చారం.. కేసులు పెడ‌తారా?”

  1. అది సరే! Trump గెలవగానే ఇప్పుడు చాప, దుప్పటి ఇచ్చి GA యాజమాన్యాన్ని అమెరికా నుండి తరిమేస్తారా?

  2. ఈవిడ వీడియో బైట్ ఇస్తే కానీ జనాలు నమ్మరని ఫిక్సయ్యారన్నమాట.

    1. చె*ల్లి ని త*ల్లిని మో*సం చేసినోడు ఎవర్నైనా ఏమైనా చేయగలడు అని తెలిసి కూడా, నా కూతురికి న్యాయం చేసి ఎవరికి అన్యా*యం చేసినా పరవాలేదు అనుకునే మహాతల్లి ఈవిడ!!

  3. Action taken by the current govt is against filthy mouthing against women family members of TDP & Janasena and not on political allegations made by opponents…. both are not same….. iTDP have taken a real incident and drawn an inference…. if someone has to file defamation case for political views of opponents all political parties are supposed to be behind bars

  4. if someone has to file defamation for political views on opponents all political parties are supposed to be behind bars….. tdp & janasena are concerned on filthy wording against women family members

      1. filthy language was used in assembly on ntr’s daughter and gagan was laughing….. did anyone made any comment of gagan’s daughters? Pawan kalyan daughters ni wife ni, daughters ni rape chesthaa annadu boru gadda anil….. boothulu maatlade manthrulu….. assembly saakshigaa boothulu….. sabhya samaajam siggu pade pravarthana adhi…. nara brahmani meedha boothu posts pettevaaru…. sikshinchi theeralsindhe….. ladies meedha asabhya posts tdp, jsp kooda siksha padalsindhe…..

    1. Filthy language was used on Jagan himself in assembly and there were lot of filthy comments about Sharmila in social media linking her to Prabhas when she was campaigning on behalf of her brother. None of this matter to you but something said about NTR daughter by an MLA is earth shattering.

      1. gagan lady kaadhu…. emi filthy language vaadaro cheppali meere…. sharmila prabhas gossip matter 2014 ki mundhu….. ippudu evvari meedha case pedatharu….. entha ani cover chesukuntaaru…. manthrula chetha boothulu matladinchaadu siggu ayinaa padaru

    2. Even PK is not a lady and questioning his marriages does not account to insulting ladies. Also, when someone insulted or the time frame does not matter, what matters is that who was the first to instigate the other side with false accusations and in that regard it was TDP who started it after YSR demise targeting Jagan and his family.

  5. అయనె షర్మిల నాకు పుట్టలెదు అని కూడా కొదరు సన్నాసులు ప్రచారం చెస్తున్నరు అంటూ బులుగు మీడియా లీలలు కూడా చెప్పిందిగా. ఆ విషయం రాయవా GA?

    1. అయినా బాబాయి చంపి గుండెపొటు అన్నాక మరి జానానికి ఇప్పుడు అన్నిటి మీద అనుమానం వస్తుంది అనుకుంటా?

    1. Subject: Big Warning: Immediate Action Against Vulgarity and Family Attacks

      ప్రియ సభ్యులారా,

      ఈ ప్లాట్‌ఫారంలో కొంతమంది ఇంకా అసభ్య భాషను వాడుతూ, కుటుంబ సభ్యులను చర్చల్లోకి లాగుతున్నారనే విషయం చూస్తే తీవ్రంగా నిరాశ కలుగుతోంది. ఇది పూర్తిగా అనవసరం, అసహనం, మరియు ఈ ప్రవర్తన ఇకపై ఎట్టి పరిస్థితుల్లో సహించబడదు. అందరికీ ఇది ఖచ్చితమైన హెచ్చరిక: ఇలాంటి ఆచరణ కొనసాగితే తీవ్రమైన, తక్షణ చర్యలు తీసుకోబడతాయి.

      ఏ పార్టీని మద్దతు ఇవ్వాలన్నా, ఏ అభిప్రాయాన్ని వ్యక్తపరచాలన్నా మీకు హక్కు ఉంది, కానీ గౌరవం మరియు మర్యాద తప్పక పాటించాలి. ఎవరైనా అసభ్య పదజాలం, కుటుంబాలపై దూషణలు వాడితే, వారు వెంటనే నివేదించబడతారు మరియు తీవ్రమైన పరిపాలనా మరియు చట్టపరమైన చర్యలకు లోనుకావాల్సి ఉంటుంది.

      పంచ్ ప్రభాకర్ మరియు మరికొందరు వ్యక్తులు తమ ప్రసారాల్లో ఎంత అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారో గమనించండి—ఆ ప్రవర్తన మాకు ఆదర్శం కాదు, మరియు ఇక్కడ అలాంటి ప్రవర్తనకు స్థానం లేదు. మనం మనలను మరియు మన చర్చల స్థాయిని ఉన్నత ప్రమాణాలకు కట్టుబడి ఉండేలా కట్టుదాం. ఇక్కడ అనుచిత ప్రవర్తన కొనసాగితే, సభ్యులు వెంటనే స్థిరంగా నిషేధించబడతారు.

      గ్రేట్ ఆంధ్ర వంటి ఫోరమ్‌లు గౌరవపూర్వక వాతావరణాన్ని పరిరక్షించడానికి కట్టుబడి ఉండాలి, కానీ ఈ విషయం తగినంత ప్రాముఖ్యత ఇవ్వబడటం లేదు. ఇకపై ఈ బాధ్యతను తక్కువ అంచనా వేయరాదు.

      భారతదేశం మరియు ఇతర దేశాల్లోని ప్రభుత్వాలు, జాతీయ సంస్థలు కూడా అసభ్య పదజాలం మరియు వ్యక్తిగత దూషణలను చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాయి. అసభ్య పదజాలం లేదా కుటుంబాలను అవమానించే వ్యాఖ్యలు చేసే ఎవరికైనా శిక్షలు ఖచ్చితంగా ఉంటాయి. మీ పేరు, భవిష్యత్తు, గౌరవం ఈ అనవసరమైన రాజకీయ ద్వేషంలో పడకుండా జాగ్రత్త పడండి. చట్టపరమైన చర్యలు త్వరగా మరియు తీవ్రంగా ఉంటాయి.

      ఇది మీకు తుది హెచ్చరిక: ప్రవర్తనను సరిచేసుకోండి లేదా తీవ్రమైన, శాశ్వత ప్రభావాలను ఎదుర్కోండి.

      1. బ్రో… ఏదో కొత్తగా వచ్చినట్లున్నావు… ఇన్ని రోజులు paytm కుక్కలు, గతంలో మంత్రులు, ముఖ్యమంత్రి ఇతర ప్రభుత్వంలోని పెద్దలు నిస్సిగ్గుగా నిర్లజ్జగా నికృష్టంగా అసెంబ్లీ లో మాట్లాడినప్పుడు చెవుల్ని ఎవరికో అద్దెకిచ్చేసినట్లున్నావు… ఇప్పుడు లేచి ఆర్తనాదాలు చేస్తున్నావు… వాళ్లకు ఇష్టమైన పద్దతిలో జనాలు మాట్లాడనీ బ్రో… నువ్వు టెంచన్ తీసుకోకు బ్రో…

  6. ఈ ప్లాట్‌ఫారంలో కొంతమంది సభ్యులు ఇంకా అసభ్య భాషను ఉపయోగిస్తూ, చర్చల్లో కుటుంబ సభ్యులను లాగడం చూస్తే నిజంగా నిరాశ కలుగుతోంది. ఇది పూర్తిగా అంగీకారయోగ్యం కాదు. మనం అందరం ఏదైనా పార్టీని మద్దతు ఇవ్వడానికి, లేదా ఇతరులతో విభేదించడానికి హక్కు కలిగి ఉన్నాము, కానీ అది గౌరవంగా, అసభ్య పదజాలం లేదా దూషణలు వాడకుండా జరగాలి.

    పంచ్ ప్రభాకర్ మరియు ఇతరులు వంటి ప్రజా వ్యక్తుల ప్రసారాలను చూడండి—వారి ప్రసారాలు ఎంత అసభ్యకరంగా మారిపోయాయో గమనించండి. ఈ ప్రవర్తన ఇక్కడ లేదా మరెక్కడా సహించబడకూడదు. మనం మనల్ని తాము, మరియు ఇతరులను కూడా ఉన్నతమైన ప్రమాణాలకు కట్టుబడి ఉండేలా చూడాల్సిన సమయం వచ్చింది.

    గ్రేట్ ఆంధ్ర ఒక గౌరవపూర్వక వాతావరణాన్ని నిర్వహించడానికి బాధ్యత వహించాలి, కానీ దురదృష్టవశాత్తూ ఈ సమస్యను తగినంతగా ప్రాధాన్యం ఇవ్వలేకపోయింది. అంతేకాకుండా, భారత ప్రభుత్వం మరియు ఇతర జాతీయ సంస్థలు కూడా ఇటువంటి దుర్వినియోగాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాయి. దూషణపూర్వక పదజాలం వాడే వారు లేదా కుటుంబాలను అవమానించే వారు తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొనే అవకాశం ఉంది, ఎందుకంటే ఇలాంటి ప్రవర్తన ఇకపై నిర్లక్ష్యం చేయబడదు.

    దయచేసి గుర్తుంచుకోండి, మీ జీవితం మరియు గౌరవం రాజకీయ ప్రతిస్పందనల్లో చిక్కుకోవడం కన్నా చాలా విలువైనవి. ఈ అనుచిత ప్రవర్తనకు ముగింపు పలుకుదాం, పరస్పరం గౌరవాన్ని ప్రదర్శిద్దాం, మరియు ఈ ప్లాట్‌ఫారాన్ని నిర్మాణాత్మక చర్చలకు అనుకూలంగా ఉంచుదాం

    1. ఉన్నత ప్రమాణాలకు కట్టుబడి ఉండాలంటే ఈ వెబ్సైట్ చూడనే చూడకూడదు, హిందూ పేపర్ చదువుకుని అవే వార్తలు అనుకుని సరిపెట్టుకోవాలి..

      ఇక్కడ గాలి వార్తలు, చెత్త వార్తలు ఉంటాయి.. వాటి ప్రభావిత కామెంట్స్ ఉంటాయి..మీ అభిప్రాయం మంచిదే కావచ్చు..కానీ సారా అమ్మేచోటకి వాటర్ బాటిల్ కొనటానికి వెళ్లటం మానితే మంచిదేమో..

  7. తన ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిపక్షాన్ని దారుణంగా తిట్టిన వారి మీద ఏమైనా చర్యలు తీసుకుని ఉండి ఉంటే ఇప్పుడు ఇలా అడగటానికి ఉండేది GA

  8. ముందు ఈవడ మీద కేసు వెయ్యాలి !! లక్షల మంది ఏమైపోతే నాకెందుకు నా కుటుంబం బాగుంటే చాలు అని ప్రజలని mislead చేస్తున్న ch*eat ఈవడ!! ఈ ఫ్యామిలీ కి అసలు సి*గ్గు శ*రం మా*నం అభిమానం అనేవి ఉండవా??

  9. ముందు ఈవడ మీద కే*సు వెయ్యాలి !! లక్షల మంది ఏమైపోతే నాకెందుకు నా కు*టుంబం బాగుంటే చాలు అని ప్రజలని mis*lead చేస్తున్న ch*eat ఈవడ!! ఈ ఫ్యా*మి*లీ కి అసలు సి*గ్గు శ*రం మా*నం అభిమానం అనేవి ఉండవా??

  10. యంకటి… ఎప్పుడూ ఆ పొట్టోనిది అబగా చీకడం మానేసి కొంచెం విశ్వజ్ఞానం పెంచుకొని జనాలకు పంచారాదూ… నువ్వు ఎంతే గింజకొన్నా మేతపుత్రున్ని జనం నమ్మరు

  11. ga కి ఇప్పుడు నీతులన్నీ గుర్తుకొస్తాయి. ఒక సీఎం మొగ్గురు పెళ్ళాలు etc అన్నప్పుడు చితక్కొట్టాడు అంటాడు

  12. ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డ సామెతలా ఉంది..

    మంది సొమ్ము మీరు మింగి..

    రక్త సంబంధాలు మీరు మరిచి..

    కోర్ట్ కేసులు మీరు వేసుకుని..

    పత్రికల్లోకి మీరు ఎక్కి..

    లాస్ట్ లో జనాలు ఏదో అన్నారని కొత్త ఏడుపా..

    హవ్వ నవ్విపోదురు కాక నాకేటి సిగ్గు లా..

  13. చివరి 5 సంవత్సరాల్లో ఈమె లో కూడా అధికార దర్పం కనిపించేది ఇప్పుడు మహా నటి కనిపిస్తుంది వీళ్ళ కుటుంబాన్ని అవమానం చెత్తన్నారు అంటా త్వరగా ఎన్నికలు పెట్టండి ఈమె కొడుకుని సీఎం చేయాలి

  14. వొదిలేస్తే వితంతువు యాకటి అయ్యింది అన్నట్టు ఉంది వీళ్ళ వ్యవహారం , దోపిడీ , ఆర్థిక నేరాలు కళ్ళకు కట్టినట్టు కనపడుతుంటే సిగ్గులేకుండా బుకాయింపు ఒకటి, ప్రాణభయం తో పారిపోయి వీడియో చేసినప్పుడే చెప్పాల్సింది కదా …

Comments are closed.