అనిత తీరు మార్చుకోకుంటే ప్రమాదఘంటికలే

హోం మంత్రి అనిత రాజకీయ విమర్శల్లో కనబరుస్తున్న జోరు.. పోలీసు యంత్రాంగాన్ని నడిపించడంలో కనిపించడం లేదా? ప్రతిపక్ష వైసీపీ నాయకుల మీద విరుచుకుపడడంలో ఆమె చూపిస్తున్న శ్రద్ధ.. తన శాఖకు చెందిన పోలీసులు సరిగ్గా…

హోం మంత్రి అనిత రాజకీయ విమర్శల్లో కనబరుస్తున్న జోరు.. పోలీసు యంత్రాంగాన్ని నడిపించడంలో కనిపించడం లేదా? ప్రతిపక్ష వైసీపీ నాయకుల మీద విరుచుకుపడడంలో ఆమె చూపిస్తున్న శ్రద్ధ.. తన శాఖకు చెందిన పోలీసులు సరిగ్గా విధులు నిర్వర్తించేలా పర్యవేక్షించడంలో చూపించలేకపోతున్నారా? అనే అనుమానాలు ఇప్పుడు ప్రజల్లో కలుగుతున్నాయి.

పోలీసు వ్యవస్థ పట్ల వ్యవహారాలకంటె.. ఆమె వైసీపీని, జగన్ ను విమర్శించడం ద్వారా మాత్రమే ఎక్కువగా వార్తల్లో కనిపిస్తూ ఉంటారు. ఒకవైపు.. హోం మంత్రి అచేతనత్వాన్ని పవన్ కల్యాణ్ బహిరంగ వేదిక మీది నుంచి చాలా స్పష్టంగా ఎత్తిచూపించిన నేపథ్యంలో అనిత తన తీరు మార్చుకోకుంటే ఆమె పదవికి ముప్పు తప్పదని పలువురు విశ్లేషిస్తున్నారు.

వంగలపూడి అనిత ఇప్పుడు హోం శాఖ మంత్రి. ఆ స్థాయికి తగ్గట్టుగానే ఆమె వ్యవహరించాలి, మాట్లాడాలి. కానీ అనిత ధోరణి గమనిస్తే.. ఇంకా బేలపలుకులు వీడిపోవడం లేదు. ఇంకా తాను ప్రతిపక్షంలో ఉంటూ పాలకపక్షం మీద, వారి ఆధీనంలో పనిచేసే పోలీసుల మీద విమర్శలు చేస్తున్న నాటి వాతావరణంలోనే ఆమె కనిపిస్తున్నారు. ఆమె హోంశాఖకు మంత్రి అయ్యారుగానీ.. ఆ శాఖను పటిష్టంగా నడపడం కంటె.. ఇంకా జగన్ మీద విమర్శలతో రోజులు వెళ్లబుచ్చడానికే సమయం పెడుతున్నారు.

రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ స్థాయిలో అదుపుతప్పిపోయాయో.. పరిస్థితులు ఎంత నీచంగా ఉంటున్నాయో విపక్షాలు చెప్పక్కర్లేదు. కూటమి పార్టీల నాయకులే చెబుతున్నారు. పవన్ కల్యాణ్ మాటలు చెంపపెట్టులాగా లోపాలను ఎత్తిచూపించాయి. హోంమంత్రి అవేతనత్వాన్ని అవి తెలియజెప్పాయి. కాగా, హోంమంత్రి అనిత స్పందిస్తూ.. సోషల్ మీడియా ట్రోలింగులకు తాన కూడా బాధితురాలినే అంటూ ఆవేదన వ్యక్తం చేయడమే తమాషా. ఆమె కూడా బాధితురాలు అయినంత మాత్రాన.. ఆమె సమర్థురాలైన మంత్రి అయిపోదు కదా..! నేను కూడా బాధితురాలినే అని చెప్పుకోవడం కూడా ఆమె చేతగానితనం. హోంమంత్రిగా ఉంటూ.. ఇలాంటి ట్రోలింగులు చేసేవాళ్ల భరతం పట్టించకుండా ఎమోషనల్ అయితే ఉపయోగం ఉండదు.

తాను హోంశాఖ మంత్రిగా ఉన్నంతకాలమూ.. శాఖ గురించి పట్టించుకోవడం అనవసరం.. జగన్ ను తిడుతూ ఉంటే చాలు అని ఆమె అనుకున్నారేమో. కానీ, అదే ధోరణిలో ముందుకు వెళితే.. పదవి కూడా ఊడుతుందని ఆమె తెలుసుకోవాలి.

7 Replies to “అనిత తీరు మార్చుకోకుంటే ప్రమాదఘంటికలే”

  1. ఈ వేదికలో కొంతమంది అసభ్య పదజాలాన్ని ఉపయోగించి, కుటుంబ సభ్యులను చర్చల్లోకి లాగుతున్నారని తెలుసుకోవడం చాలా నిరాశ కలిగించే విషయం. ఇది పూర్తిగా అననుసరణీయం, అసహనీయమైనది, ఇకపై దీన్ని ఏ విధంగానూ సహించబోము. ఈ మెసేజ్‌ను గంభీరంగా పరిగణించండి: ఇలాంటి ప్రవర్తన కొనసాగిస్తే, తక్షణంగా మరియు కఠినంగా చర్యలు తీసుకోబడతాయి.

    ప్రతి వ్యక్తికీ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చే హక్కు ఉంది; ఏ పార్టీని మద్దతు ఇవ్వాలో, ఏ అభిప్రాయాన్ని వ్యతిరేకించాలో చెప్పుకునే స్వేచ్ఛ ఉంది. కానీ ఇది గౌరవం మరియు మర్యాదలను పాటిస్తూ జరగాలి. అసభ్య పదజాలం వాడేవారు లేదా వ్యక్తిగత దూషణలకే దిగే వారు తక్షణమే నివేదించబడి, ఈ వేదిక నుంచి శాశ్వతంగా తొలగించబడతారు.

    పంచ్ ప్రభాకర్ వంటి కొందరు ప్రజా వ్యక్తుల ప్రవర్తన అసభ్యంగా మారింది. కానీ అది మనకెందుకు ఆదర్శం అవ్వాలి? ఇలాంటి అనాగరిక ప్రవర్తనకు మన వేదికపై ఎలాంటి స్థానం లేదు. మన సంభాషణల నాణ్యతను కాపాడుకోవడం మనందరి బాధ్యత, అందరూ ఉన్నత ప్రమాణాలను పాటించాలని ఆవశ్యకత ఉంది.

    గ్రేట్ ఆంధ్ర గౌరవపూర్వక వాతావరణాన్ని పరిరక్షించే బాధ్యత వహించాలి. అభిప్రాయాలను వెలిబుచ్చే స్థలంగా మాత్రమే కాకుండా, మనిషి గౌరవాన్ని, పరస్పర ఆమోదాన్ని నిలబెట్టే వేదికగా మన వేదిక ఉండాలి. భారత ప్రభుత్వం మరియు ఇతర జాతీయ సంస్థలు ఈ ఆన్‌లైన్ దుర్వినియోగాన్ని అత్యంత గంభీరంగా పరిగణిస్తున్నాయి. ఇలాంటి అసభ్య పదజాలాన్ని, కుటుంబాలపై దూషణలని ఎవరు కొనసాగించినా, వారు తీవ్ర చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది, ఇవి మీ జీవితంపై శాశ్వత ప్రభావాలు చూపగలవు.

  2. ఇలాంటి సొల్లు రాయకుండా గ్రేట్ ఆంధ్ర వెంకట్ రె డ్డి గాడిని నీ కూడా అ రె స్టు చేసి కు త్తా చెక్కేయాలి

Comments are closed.