ఆదిపై నోరు మెద‌ప‌ని సీఎం ర‌మేశ్‌!

వైఎస్సార్ జిల్లా జ‌మ్మ‌ల‌మ‌డుగు ఎమ్మెల్యే ఆదినారాయ‌ణ‌రెడ్డి, ఆయ‌న అనుచ‌రుల‌పై ప్ర‌భుత్వ ప‌రంగా చ‌ర్య‌లు తీసుకునే ద‌మ్ముందా? అనే చ‌ర్చకు తెర‌లేచింది. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో సొంత పార్టీకి చెందిన ఎంపీ సీఎం ర‌మేశ్‌నాయుడి కంపెనీ రిత్విక్…

వైఎస్సార్ జిల్లా జ‌మ్మ‌ల‌మ‌డుగు ఎమ్మెల్యే ఆదినారాయ‌ణ‌రెడ్డి, ఆయ‌న అనుచ‌రుల‌పై ప్ర‌భుత్వ ప‌రంగా చ‌ర్య‌లు తీసుకునే ద‌మ్ముందా? అనే చ‌ర్చకు తెర‌లేచింది. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో సొంత పార్టీకి చెందిన ఎంపీ సీఎం ర‌మేశ్‌నాయుడి కంపెనీ రిత్విక్ నేతృత్వంలో గండికోట ప్రాజెక్ట్ ఆధారంగా వెయ్యి మెగావాట్ల సామ‌ర్థ్యంతో హైడ్రో ప‌వ‌ర్ ప్రాజెక్ట్ ప‌నులు చేప‌ట్టింది. నిజానికి ఈ టెండ‌ర్‌ను అదానీ కంపెనీ ద‌క్కించుకోగా, రిత్విక్ కంపెనీ లీజుకు తీసుకుని ప‌నులు చేస్తోంది. ఈ ప‌నుల విలువ రూ.1800 కోట్లు.

త‌మ నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే అనుమ‌తి లేకుండా ప‌నులు చేయ‌డానికి మీరెవ‌రంటూ రిత్విక్ కంపెనీని అడ్డుకున్నారు. అడ్డుకున్న‌ది మ‌రెవ‌రో కాదు. స్వ‌యంగా ఎమ్మెల్యే సోద‌రుడైన శివ‌నాథ‌రెడ్డి, మ‌రో సోద‌రుడి కుమారుడు డాక్ట‌ర్ రాజేష్‌రెడ్డి. ఒక మాట‌లో చెప్పాలంటే జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గంలో ప‌నులు చేయ‌కుండా త‌న్ని త‌రిమేశారని జ‌నం చెప్పుకుంటున్నారు.

అయిన‌ప్ప‌టికీ ఇంత వ‌ర‌కూ సీఎం ర‌మేశ్‌, ఆయ‌న సోద‌రుడు సురేష్‌నాయుడు నోరు మెదప‌డం లేదు. ఇదే వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి సీఎంగా ఉన్న‌ప్పుడు సీఎం ర‌మేశ్ హెచ్చ‌రిక‌లు ఏ రేంజ్‌లో ఉన్నాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. చంద్ర‌బాబు, ఆయ‌న పార్టీ నాయ‌కుల‌కు ధైర్యం చెప్పేందుకు కేంద్రంలోని బీజేపీ నాయ‌కుడిగా సీఎం ర‌మేశ్ చాలా కీల‌క పాత్ర పోషించారు.

ఇప్పుడు సొంత పార్టీకి చెందిన నాయ‌కుల నుంచే స‌మ‌స్య ఎదురైంది. జ‌గ‌న్ స‌ర్కార్‌ను గ‌తంలో హెచ్చ‌రించిన రీతిలోనే, ఇప్పుడు ఆదినారాయ‌ణ‌రెడ్డి, ఆయ‌న అనుచ‌రుల్ని బెదిరించే, హెచ్చ‌రించే ధైర్యం కూట‌మి పెద్ద‌లెవ‌రైనా చేయ‌గ‌ల‌రా? అంటే… చేయ‌లేర‌నే స‌మాధానం వ‌స్తోంది. ఇలాంటి వాళ్ల‌ను ఆదినారాయ‌ణ‌రెడ్డి ఖాత‌రు చేసే ప‌రిస్థితి వుండ‌దు. ఒక‌వేళ ఆదినారాయ‌ణ‌రెడ్డితో పెట్టుకుంటే, జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గంలో అడుగు పెట్ట‌లేమ‌ని ఆ నాయుడు బ్ర‌ద‌ర్స్‌కు బాగా తెలుస‌ని ఆ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు అంటున్నారు. అందుకే కిమ్మ‌న‌ర‌ని వారు చెబుతున్నారు. దేవునికైనా దెబ్బే గురువు అంటే ఇదే కాబోలు.

4 Replies to “ఆదిపై నోరు మెద‌ప‌ని సీఎం ర‌మేశ్‌!”

  1. దొంగలు దొంగలు మధ్య గొడవ వస్తే inside సెటిల్ చేసుకుంటారు. దోచికొని పంచుకోవటంలో ముదుర్లు కదా ఇద్దరు

Comments are closed.