త‌ప్పులు చేయ‌డానికి కూట‌మికి ఎందుకంత ఉత్సాహం?

త‌ప్పులు చేయ‌డానికి కూట‌మి స‌ర్కార్ తెగ ఉత్సాహ‌ప‌డుతోంది. స‌హ‌జంగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు చాలా జాగ్ర‌త్త‌గా వుంటార‌ని అంటుంటారు. ఈ ద‌ఫా కూట‌మి పాల‌న‌లో చంద్ర‌బాబు మార్క్ క‌నిపించ‌డం లేద‌నే మాట స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. తాజాగా…

త‌ప్పులు చేయ‌డానికి కూట‌మి స‌ర్కార్ తెగ ఉత్సాహ‌ప‌డుతోంది. స‌హ‌జంగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు చాలా జాగ్ర‌త్త‌గా వుంటార‌ని అంటుంటారు. ఈ ద‌ఫా కూట‌మి పాల‌న‌లో చంద్ర‌బాబు మార్క్ క‌నిపించ‌డం లేద‌నే మాట స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. తాజాగా మ‌రో త‌ప్పట‌డుగు వేయ‌డానికి కూట‌మి ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది.

మేయర్‌, పుర‌పాల‌క చైర్మ‌న్ల ప‌ద‌వీ కాలం రెండున్న‌రేళ్లు పూర్త‌య్యాక అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు అనువుగా పుర‌పాల‌క చ‌ట్టానికి స‌వ‌రణ చేయ‌డానికి ప్ర‌భుత్వం ఆస‌క్తి చూపుతోంది. ఇలాంటి చ‌ట్టం గ‌తంలో వుండేది. అయితే 2008లో వైఎస్సార్ హ‌యాంలో నాలుగేళ్లు దాటే వ‌ర‌కూ అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు వీల్లేకుండా చ‌ట్ట స‌వ‌ర‌ణ చేశారు. దీంతో సుస్థిర పాల‌న నెల‌కునేలా చేయొచ్చ‌నేది నాటి పాల‌కుల ఆశ‌యం.

కానీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిప‌ల్ కార్పొరేష‌న్లు, పుర‌పాల‌క సంఘాల్లో వైసీపీ మేయ‌ర్లు, చైర్మ‌న్లు ఎక్కువ వున్నారు. కొంద‌రు కార్పొరేట‌ర్లు, వార్డు స‌భ్యులు అధికార కూట‌మిలో చేరిన‌ప్ప‌టికీ, మేయ‌ర్లు, చైర్మ‌న్లుగా ప్ర‌తిప‌క్ష నాయ‌కులే వుండ‌డాన్ని కూట‌మి జీర్ణించుకోలేక‌పోతోంది. దీంతో ఇప్ప‌టికిప్పుడే వాళ్ల‌ను ఆ సీట్ల నుంచి దించేయాల‌నే ప‌ట్టుద‌ల‌తో కూట‌మి స‌ర్కార్ వుంది.

ఒక‌వేళ పుర‌పాల‌క చ‌ట్టానికి స‌వ‌ర‌ణ తెచ్చినంత మాత్రాన‌, వెంట‌నే గ‌ద్దె దించే ప‌రిస్థితి వుండ‌ద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. పుర‌పాల‌క చ‌ట్ట స‌వ‌ర‌ణ తెస్తే, త‌ప్ప‌కుండా న్యాయ పోరాటం చేస్తామ‌ని వైసీపీ నేత‌లు చెబుతున్నారు. అప్పుడు కూట‌మి నేత‌లు అనుకున‌ట్టుగా వైసీపీ మేయ‌ర్లు, చైర్మ‌న్ల‌ను అధికారం నుంచి తొల‌గించ‌లేరు. ఎందుకంటే, కేసు వ్య‌వ‌హారం మొద‌లైతే, ఎటూ వారి ప‌ద‌వీ కాలం నాలుగేళ్లు పూర్తి అవుతుంది.

ఈ సంబ‌రానికి అన‌వ‌స‌రంగా ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేయ‌డానికి ఏకంగా పుర‌పాల‌క చ‌ట్టాన్ని స‌వ‌రించింద‌న్న అప‌ఖ్యాతి కూట‌మి స‌ర్కార్‌కు వ‌స్తుంది. పైగా తాను అనుకున్న‌ట్టుగా ప‌ని జ‌ర‌గ‌దు. 2026లో ఎటూ స్థానిక సంస్థ‌ల‌కు ఎన్నిక‌లు జ‌రుగుతాయి. అప్పుడు స‌త్తా ఏంటో కూట‌మి నేత‌లు చూపించుకోవ‌చ్చు. చెడ్డ పేరు వ‌చ్చినా ఫ‌ర్వాలేదు, చ‌ట్ట స‌వ‌ర‌ణ చేస్తామంటే చేయ‌గ‌లిగేదేమీ వుండదు.

13 Replies to “త‌ప్పులు చేయ‌డానికి కూట‌మికి ఎందుకంత ఉత్సాహం?”

  1. అందరు కూటమిలోki స్వయముగా చేరిపోతున్నారు ..దీని అర్ధం జఫ్ఫా జగన్ పార్టీ expired అయ్యిందని లెక్క..

  2. ఎందుకు అసెంబ్లీ నడుపుతున్నారో, ఎందుకు ప్రభుత్వం నడుపుతున్నారో తెలియడం లేదన్నారు.

    ఇంకా ఎందుకు అర్థం కాకపోతె సర్దుకోక?

  3. అప్పటిదాకా ఆగలేక దోచుకో వాలి పదవులు పంచుకోవాలి అని చేస్తున్నారు. Babu Surity బాదుడు గ్యారంటీ…

Comments are closed.