పీఏసీ ఛైర్మన్ కు ఎన్నిక! సాంప్రదాయానికి విఘాతం!

ఎన్నికలో నెగ్గాలంటే కనీసం పది శాతం ఎమ్మెల్యేలు ఉండాలి. ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అంత బలం లేదు.

అసెంబ్లీలో ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) పదవిని ప్రతిపక్షానికి చెందిన ఎమ్మెల్యేకు కేటాయించడం అనేది అనాదిగా వస్తున్న సాంప్రదాయం. కానీ సాంప్రదాయాలను గౌరవించే ధోరణిలో ఏపీలోని రాజకీయ పార్టీలు ఇప్పుడు లేవు. రాజకీయ పార్టీలు అంటే యుద్ధరంగంలో ఉన్న శత్రుకూటముల్లాగా బతికేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పీఏసీ ఛైర్మన్ పదవి దక్కకుండా చేయడానికి ఉన్న చిన్న అవకాశాన్ని ఎన్డీయే కూటమి ఎడ్వాంటేజీగా వాడుకుంటోంది. శాసనసభ చరిత్రలో తొలిసారిగా పీఏసీ కమిటీకి నేను ఎన్నిక జరగబోతోంది.

వివరాల్లోకి వెళితే.. ప్రజాపద్దుల కమిటీ అనేది ప్రభుత్వ నిర్ణయాలకు చెక్ పాయింట్ లాగా ఉండవలసిన శాసనసభా కమిటీ. ఈ కమిటీలో మొత్తం 12 మంది సభ్యులు ఉంటారు. అసెంబ్లీ నుంచి తొమ్మిది మంది, మండలి నుంచి ముగ్గురు ఉంటారు. వీరిలో ఒకరు పీఏసీ ఛైర్మన్ అవుతారు. ఎమ్మెల్యేను మాత్రమే ఛైర్మన్ చేస్తారు. సాధారణంగా ప్రతిపక్షానికి చెందిన ఎమ్మెల్యేకు పీఏసీ ఛైర్మన్ పదవి ఇవ్వడం సాంప్రదాయం. ప్రతిపక్షం ఎంత బలహీనంగా ఉన్నప్పటికీ కూడా.. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేకే పదవి కేటాయించడం అనేది ఇప్పటిదాకా ఏపీ చరిత్రలో ప్రతిపాలకపక్షమూ పాటిస్తున్న సంగతి.

అయితే ఇప్పుడు చంద్రబాబునాయుడు ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. సాంప్రదాయాన్ని తుంగలో తొక్కి.. ప్రజాపద్దుల కమిటీ సారథ్యం పాలకపక్షం ఎమ్మెల్యే కట్టబెట్టే ఆలోచనతో ఉంది. తొమ్మిది మంది ఎమ్మెల్యేలకు కమిటీలో అవకాశం ఉండగా.. తమ కూటమి తరఫునే తొమ్మిది మందితో నామినేషన్లు వేయించారు. ఏడుగురు తెలుగుదేశం, జనసేన, బిజెపి తరఫున చెరొక ఎమ్మెల్యే నామినేషన్లు వేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా నామినేషన్ వేశారు. 9 స్థానాలకు 10 నామినేషన్లు రావడంతో ఇవాళ ఎన్నిక జరగోబోతోంది.

ఎన్నికలో నెగ్గాలంటే కనీసం పది శాతం ఎమ్మెల్యేలు ఉండాలి. ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అంత బలం లేదు. దీనిని అధికార కూటమి ఎడ్వాంటేజీగా మార్చుకుంది. సాంప్రదాయాన్ని తుంగలో తొక్కింది. ప్రభుత్వం ఎలా విచ్చలవిడిగా, ఇష్టారాజ్యంగా వ్యవహరించినా కూడా అడిగేవాడే లేకుండా ఉండేలా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అదే వైసీపీ సర్కారు కాలంలో తెలుగుదేశం పార్టీకి కేవలం 23 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు.

ఒక్క పీఏసీ సభ్యుడు నెగ్గడానికి మాత్రమే అవకాశం ఉండగా.. పయ్యావుల కేశవ్ సభ్యుడు అయ్యారు. కమిటీలో ఉన్నది ఒక్కరే అయినప్పటికీ.. ఆయనకే ఛైర్మన్ పదవి కట్టబెట్టి వైసీపీ సర్కారు సాంప్రదాయం పాటించింది. అయితే ఇప్పుడు సంప్రదాయాన్ని తుంగలో తొక్కడానికే చంద్రబాబు నిర్ణయించుకున్నారు.

47 Replies to “పీఏసీ ఛైర్మన్ కు ఎన్నిక! సాంప్రదాయానికి విఘాతం!”

  1. వైసీపీ కి పది శాతం బలంలేకపోటాన్ని కూటమి అడ్వాంటేజ్ గా మార్చుకుందట..బలం లేకపోయినా బలిసిన ఆశ లాగా మాత్రం అనిపించట్లేద్దా..

    ఒకవేళ ఆ పదవి ఇస్తే ఇంట్లో మాక్ అసెంబ్లీ లో మాట్లాడతాడా..?

  2. అసలు అసెంబ్లీ కే వేళ్ళని వాళ్ళ గురించి డిస్కషన్ ఎందుకు… జాగా బొక్క… సంప్రదాయాలు.. సింతకాయ అంటూ

  3. ఒరేయ్ గూట్లే…అక్క పయ్యావుల గెలిచాడు కాబట్టి సంప్రదాయం ప్రకారం చైర్మన్ అయ్యాడు. ఇప్పుడు ఒక్కడు కూడా గెలిచే ఛాన్స్ లేదు, సో సాంప్రదాయం అనే అవకాశమే లేదు

  4. అసెంబ్లీ కి వెళ్లకుండా.. ఆడుకుంటున్న జగన్..! అని ఆర్టికల్ రాసావు గుర్తుందా..?

    అసెంబ్లీ ఎగ్గొట్టి.. ఆడుకొనేవాళ్లకోసం “సంప్రదాయాలు” పాటించాలంటావా..?

    పాలస్ లో కూర్చుని.. తీరిగ్గా ఆడుకోమను.. ప్రజలకు కావాల్సింది కూడా అదే..

    ఇలా చేస్తాడు కాబట్టే జనాలు కూడా 11 ముష్టి మొఖాన కొట్టారు.. 11 అయినా ఇచ్చినందుకు పండగ చేసుకోమను..

    గతం లో నీ జగన్ రెడ్డి చేసిన ఎక్సట్రాలు.. నువ్వు మర్చిపోయినా.. ప్రజలు మర్చిపోరు..

    1. అసలు ఆడుకోవడం ఏంటి నా సింతకాయ. హోదా కావాలి అని అడుక్కుంటున్నాడు

    1. గత ఆరు నెలలుగా చూస్తూన్నంగా…ఎంత బాగా తీరుస్తుందో…అభి సినిమా బాకీ హాయ్

    2. అదే కాలం మీ జగన్ రెడ్డి దూల తీర్చేసింది కదా..

      కొన్ని రోజులు రెస్ట్ తీసుకోండి.. కుదిరితే శాశ్వత రెస్ట్ తీసుకోండి..

      ఇంకా తీర్చుకోవాల్సిన దూల మిగిలితే.. మేము తీర్చేస్తాం.. దీనికి కాలం అవసరం లేదు..

  5. Charitralu..sampradaayalu..ani peddha peddha matlade GA.. AP charithralo 11seats ki padipoyina party chusava?? Sampradaayaniki eligibility leni party ni chusava??assembly lo thallula gurinchi matlade egathaali chesina vallani chusava?? prathipaksha kutumbam lo unna aadavallani thittadam chusava ??

    ivanni chesivallaki idhe gathi paduthundi..you better stop preaching and crying..!

  6. స్పీకర్ గ ఎన్నికైన తరువాత .. ఆయనని గౌరవంగా సీట్ లో కూర్చో పెట్టడము అప్పుడు ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఉండడము సంప్రదాయము కదా GA .. శ్రీ జగన్ గారు ఆపని చేసారా ? సంప్రదాయము అప్పుడు కృష్ణాలో కలిపారా ?

    1. 2019 లో చంద్రబాబు చేసాడా? చెప్పు తమ్మినేని సీతారాం గారి విషయంలో

      1. సరే బాబు చేయలేదు అనుకుందాము (చేసాడో లేదో నాకు తెలియదు) .. అప్పుడు ఇద్దరు సంప్రదాయాన్ని తుంగ కృష్ణ గోదారి లో కలిపినట్టే కదా .. మరి మన న్యూట్రల్ GA అన్న ఎందుకు ఒకరి వల్లే సంప్రదాయం విఘాతం అయింది అని రాస్తున్నాడు ..??

        1. ఇదే ప్రశ్న మేము న్యూట్రల్ అని చెప్పుకునే ఒక వర్గం మీడియాని అడగగలవా,ప్రతి ఒక్కరు అవుతలోడి తప్పులే వేతుకుతారు , లేకపోయినా వున్నాయని పదిసార్లు ఊదరగొడతారు ఇందులో ఆ వర్గం మీడియా తర్వాతనే ఎవరైనా

          1. భలె మార్చారు మాట.. అన్నీ మీడియా సంస్థలు అలాగే ఉన్నాయి స్వామి .. మీకు నచ్చే వాళ్ళని తక్కువ చేసుకుంటారు అంతే.. ఏదైనా ప్రజలు నిర్ణయాలు మీడియా సంస్థలు మార్చ లేవు .. అందుకే 2014 తరువాత .. బాబు జగన్ ఇద్దరు రెండు సార్లు ఓడారు..

  7. పిల్ల నిచ్చిన మామ పైనే చెప్పులు వేయించిన ఘనుడు..తరువాత దండలు దండాలు.shoes వేసుకొని కొబ్బరి కాయలు కొట్టిన ఉల్లంఘనుడు.సంప్రదాయాలు పాటించటం అనేది dictionary లో నే లేదు.

    1. తమరు 1996 లోనే ఉండిపోయారు .. లేటెస్ట్ గ ఒక కొడుకు తల్లికి ఇచ్చిన ఆస్తి వెన్నకి ఇవ్వండి అని ఎదో కోర్ట్ కి వెళ్లారు ..

    2. గొడ్డలి వాడటం బాగా వచ్చులే బాబు కి ..నారాసుర రక్తచరిత్ర గురించి రాయలేదే..

  8. అసెంబ్లీకి వెళ్లి తమ ప్రజల తరుపున ప్రాతినిధ్యం వహిస్తేనే ఏమన్న గౌరవం ఇచ్చేది.

    స్కూలు ఎగ్గొట్టిన పిల్లలకు ప్రిన్సిపాల్ ఏ పనిష్మెంట్ ఇస్తారో వీళ్ళకు అదే పనిష్మెంట్ ఇవ్వాలి.

  9. గేలిచిన ఎంఎల్ఏ లు కూడా అసెంబ్లీ వెళ్ళటం అనేది సంప్రదాయమే మరి!

    అసెంబ్లీ కే వెళ్లి భాధ్యత నిర్వహించరు కానీ పదవులు కావాలి మళ్ళీ!

    హక్కులు వున్నచోట భాద్యతలు కూడా వుంటాయి.

  10. అన్నయ్య సభకి వెళ్తే ర్యాగింగ్ చేస్తారేమో కానీ చంద్రబాబు కుటుంబాన్ని అవమానపరచినట్లు గా మాత్రం కూటమి ప్రభుత్వం చేయదని ఖచ్చితం గా చెప్పగలను.

    అయినా అన్నయ్యని ఇంటా బయటా అందరూ చేస్తున్నదేగా ఇప్పుడు, అంతకుమించి సభలో మాత్రం ఏమి ఎక్కువ చేస్తారు?

    He should show some spine now atleast…

  11. పెద్ది రె*డ్డి కాకుండా ఇంకెవరైనా కాంటెస్ట్ చేస్తే అవకాశం ఇచ్చేవాళ్లేమో ఎందుకంటే 2024 ముందు కుప్పం లో చేసిన అరాచకం బాబు ఎలా మరచిపోతారు

Comments are closed.