‘జీబ్రా’తో థియేటర్లలోకొచ్చాడు సత్యదేవ్. ఈరోజు మరోసారి మీడియా ముందుకొచ్చాడు. సినిమాకు నెగెటివ్ టాక్ వస్తుందనే విషయాన్ని అంగీకరించిన ఈ నటుడు.. నచ్చని వాళ్లంతా తన కోసం మరొక్కసారి సినిమా చూడాలని రిక్వెస్ట్ చేస్తున్నాడు.
“నేను ఎప్పుడూ రివ్యూస్ కు కౌంటర్ ఇవ్వలేదు. కానీ జీబ్రా విషయంలో నేను లైవ్ లో జనాల నుంచి చూస్తున్న స్పందన వేరుగా ఉంది. సమీక్షల నుంచి స్పందన వేరుగా ఉంది. ఇంత తేడా నాకు అర్థం కాలేదు. మా సినిమాకు 80 శాతం పాజిటివ్ టాక్ వచ్చింది. 20 శాతం నెగెటివ్ టాక్ వచ్చింది. ఆ 20 శాతం చాలా నెగెటివ్ గా ఉంది. నేను కోరుకునేది ఒక్కటే, ఆ 20 శాతం మంది ఇంకొక్కసారి సినిమా చూడండి.”
జీబ్రాలో లాజిక్స్, లింకులు ఎక్కువగా ఉంటాయని.. ఏ చిన్న పాయింట్ మిస్సయినా, వేరో చోట కనెక్షన్ తెగిపోతుందని, బహుశా అలాంటి కొన్ని పాయింట్స్/లాజిక్స్ మిస్ అయి ఉంటారని అభిప్రాయపడ్డాడు సత్యదేవ్.
ఈ సినిమా ఓటీటీలో బాగా ఆడుతుందనే కామెంట్స్ ను అంగీకరించడం లేదు సత్య. తన సినిమా ఓటీటీలో ఆడుతుందా ఆడదా అనేది సెకెండరీ అని, ముందుగా థియేటర్లలో ఆడడం ముఖ్యమని అన్నారు. థియేటర్లలో ఆడకుండా ఓటీటీలో హిట్టయితే, తన సినిమా పూజకు పనికిరాని పువ్వు కింద లెక్క అని అభిప్రాయపడ్డాడు. ఈరోజు చిరంజీవి, జీబ్రా సినిమా చూస్తున్నారు.
Call boy jobs available 7997531004
vc available 9380537747
ఓటిటిలో చుస్తాంలే