పుష్ప 2 బిజినెస్ కు హద్దులు కనిపించడం లేదు. విడుదల తరువాత సంగతి పక్కన పెడితే విడుదల ముందు కొత్త రికార్డులు సృష్టిస్తోంది. సాధారణంగా టాలీవుడ్ బిజినెస్ లో ఆంధ్ర ఎక్కువ, తరువాత నైజాం, ఆ తరువాత సీడెడ్ అన్నట్లు వుంటుంది. కానీ ఇప్పుడు నైజాం ఫస్ట్ ప్లేస్ లోకి, ఏపీ సెకెండ్ ప్లేస్ లోకి చేరింది. ఆంధ్ర బిజినెస్ 85-90 కోట్ల మేరకు చేసారు. కానీ నైజాం బిజినెస్ 100 కోట్ల మేరకు క్లోజ్ చేసారు.
నైజాం ఏరియా హక్కులను మైత్రీ నిర్మాణ సంస్థ, మైత్రీ డిస్ట్రిబ్యూషన్ సంస్థకు 100 కోట్లకు విక్రయించేసారు. మైత్రీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ కు వేరే భాగస్వాములు వున్నారు. వారిలో మైత్రీ నిర్మాణ సంస్థ కూడా వుంది. అది వేరే సంగతి. మొత్తానికి నైజాం పుష్ప 2 దాదాపు 210 కోట్లు వసూలు చేస్తే, ఖర్చులతో అసలు కిట్టుబాటు అవుతుంది.
ఇప్పుడు ఈ రేట్లు కిట్టు కావడం కోసం వీలయినంత మంచి టికెట్ రేట్లు తెచ్చే ప్రయత్నం, దాంతో పాటే వీలయినంత త్వరగా బుకింగ్ ఓపెన్ చేసే ప్రయత్నం ప్రారంభించారు. అలాగే వీలైతే లేట్ సెకెండ్ షో అంటే 4 వ తేదీ 11 గంటలు లేదా 11.30 కే షో లు ప్రారంభమయ్యేలా ప్రయత్నిస్తున్నారు. దాని వల్ల ఇరవై నాలుగు గంటల్లో వీలయినన్ని ఎక్కువ షో లు వేసుకోవచ్చు.
ఇదిలా వుంటే, ఏపీ, సీడెడ్ ల్లో థియేటర్ల వారీ, ఊళ్ల వారీ అమ్మకాలు మొదలైపోయాయి. తమకు పడిన రేటుకు కాస్త కలిపి బయ్యర్లు థియేటర్ల వారీగా, ఊళ్ల వారీగా అమ్మకాలు ప్రారంభించేసారు.
Call boy works 7997531004
vc estanu 9380537747