ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటా!

ఇక మీదట రుషికేశ్ లో తపస్సు చేసుకుంటూ అక్కడే ఎక్కువ సమయం గడుపుతాను అని స్వరూపానందేంద్ర పేర్కొన్నారు.

అన్ని దశలను దాటిన తరువాతనే ఆధ్యాత్మికం వస్తుంది. వేదాంతంతో జీవితానికి ఆది నుంచి అంతం ఏమిటో తెలుస్తుంది. బిజీ జీవితంలో ఉన్న వారు ఆ వైపు తొంగి చూడలేరు. ఇహం మీద మోజు పెరిగి అహం పెంచుకున్న వారు పరం వైపుగా అడుగులు వేయలేరు. అటువంటి అదృష్టం కొందరికే వస్తుంది. స్వామీజీలు ఆ కోవలోకి చెందినవారే. వారికి ఇహాలూ భేషజాలు అన్నవి అసలు ఉండకూడదు. లౌకిక ప్రపంచంతో వారికి ఏ మాత్రం సంబంధం ఉండకూడదు.

కానీ స్వాములు చాలా మంది మాత్రం మఠాలు పీఠాలు అంటూ గడుపుతున్నారు. అక్కడికి వచ్చిన రాజకీయ నేతలను కలుస్తున్నారు. చివరికి ఈ రాజకీయ రొచ్చు వారికి కూడా అంటుకుంటుంది. అది ఆధ్యాత్మిక తత్వం పట్ల ఆసక్తి ఉన్న ఆస్తిక జనులకు కూడా ఇబ్బందిగా ఉంటోంది. అయితే అన్నీ పూర్తి అయ్యాక ఇక చాలు ఇవన్నీ అని వైరాగ్యం పెంచుకోవడం వేరు. వేదాంతంలో మునిగితేలుతూ ఉండే స్వామీజీలు ఇక చాలు మళ్లీ ముక్కు మూసుకుంటాను అని అనడం వేరు.

విశాఖ శ్రీ శారదాపీఠం స్వామీజీ ఇపుడు అదే అంటున్నారు. ఆయన రాజకీయంగా వైసీపీకి అనుకూలమని ప్రచారం జరిగింది. దానికి తగినట్లుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే భీమిలీలో ఆయనకు కేటాయించిన పదిహేను ఎకరాల భూముల జీవో రద్దు చేశారు. తిరుపతిలో కూడా శారదాపీఠం కట్టిన భవనాలను కూల్చాలని నిర్ణయం తీసుకున్నారు.

ఇలా రాజకీయ సెగ ఎడా పెడా పీఠానికి తగిలింది. ఏపీలో ఉండలేక తెలంగాణకు వెళ్లాలని స్వామి అనుకున్నట్లుగా ప్రచారం సాగింది. అయితే తాను తెలుగు రాష్ట్రాలను విడిచి వెళ్తున్నట్లుగా శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి తాజాగా ప్రకటించారు.

తాను ఇక మీదట రుషికేశ్ లో తపస్సు చేసుకుంటూ అక్కడే ఎక్కువ సమయం గడుపుతాను అని స్వరూపానందేంద్ర పేర్కొన్నారు. అందువల్ల తన్నకు ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం కల్పిస్తున్న ఎక్స్ కేటగిరీ భద్రతను వెనక్కి తీసుకోవాలని పీఠం తరఫున డీజీపీకి లేఖ రాశారు. అదే విధంగా విశాఖ పోలీస్ కమిషనర్ కి లేఖ రాశారు.

తనకు ఇప్పటి దాకా భద్రత కల్పించిన వైసీపీ ప్రభుత్వానికి ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలియచేశారు. ఇక మీదట విశాఖ పీఠాధిపతి రుషికేశ్ లో ఉంటారన్న మాట. ఆయన ఉత్తరాదిన ఆధ్యాత్మిక భావనలో పూర్తి కాలం గడుపుతారు అని అంటున్నారు. స్వాములకు కావాల్సింది అదే. అందుకోసమే శారదా పీఠాధిపతి కూడా ఇపుడు పూర్తిగా ముక్కు మూసుకుని తపస్సులోనే ఉంటారని పీఠం వర్గాలు చెబుతున్నాయి.

16 Replies to “ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటా!”

  1. వీడు ఏ కోసానా స్వామీజీ కాదు

    జగ్గడు హిందువుల ఓట్స్ కోసం ఈ బఫూన్ ని వాడుకున్నాడు

    వీడు కూడా చంద్రబాబు అధికారం లో ఉన్నంత కాలం తిడుతూ జగ్గడి కాళ్ళు నాకాడు

  2. దీనికి సంబంధం లేనిది!

    Anshul Saxena Facebook post!

    Now, Supreme Court rejected a PIL seeking the use of paper ballots in elections and said that “If you win, E*V*Ms are not tampered; if you lose, they are tampered”.

    Who filed the PIL?

    Evangelist K.A. Paul, who is also the founder of the U.S.-based organizations Gospel to the Unreached Millions (GUM) and Global Peace Initiative (GPI).

  3. దొ0గ స్వాములు గురించి డిస్కషన్ అనవసరం. ఈయన ప్రజలు దగ్గర డబ్బు తీసుకోకుండా వాళ్ళకి చేసిన మంచి పనులు ఎమన్నా ఉన్నాయా ?

  4. This guy had a green channel and Y security during Christians by faith government, now he want to leave the state, what about all the sollu kaburlu about the State, yaagam etc?

  5. ప్యాలస్ పులకేశి హవాలా ఏజెంట్ అని బహిరంగ రహస్యం.

    ఆశ్రమం హుండీ లో వేసిన డబ్బు కట్ట లు వాటితో పాటు ఎవరు ఇచ్చారు, ఎందుకోసం అని రాసిన స్లిప్

    నేరుగా ప్యాలస్ కి చేరేది అని అనేవారు. అందుకే అప్పట్లో ప్యాలస్ పులకేశి తో పనులు కావాల్సిన వాళ్ళు బరువైన సూట్ కేసులతో ఇతని ఆశ్రమం కి వెళ్లి అక్కడి హుండీ లో ఆ డబ్బు చేసేవాళ్ళు. అక్కడ ప్యాలస్ లో ఆ డబ్బు వచ్చి పడేది. ఇతనికి ఎంతో కొంత ముష్టి పడేసి వాటికన్ గొర్రె బిడ్డ అయిన ప్యాలస్ పులకేశి నీ హిం*దువు అని దొం*గ స*ర్టిఫికెట్ ఇచ్చే*వాడు ఈ. సా*ధువు వేషం వేసుకున్న దొం*గ.

Comments are closed.