విజ‌య్‌పాల్‌ అరెస్ట్‌పై ర‌ఘురామ హ్యాపీ

తనను హింసించిన వారికి న్యాయ‌స్థానంలో శిక్షపడుతుందనే నమ్మకం ఉందని ఆయ‌న అన్నారు.

ఏపీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు ఖుషీగా ఉన్నారు. ఢిల్లీలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ త‌న సంతోషాన్ని పంచుకున్నారు. త‌న‌ను క‌స్టోడియ‌ల్ టార్చ‌ర్ చేసిన సీఐడీ మాజీ ఏఎస్పీ విజ‌య్‌పాల్ అరెస్ట్ కావ‌డం సంతోషాన్ని ఇచ్చింద‌న్నారు. విజ‌య్‌పాల్ ఎన్నో దందాలు చేశాడ‌ని ర‌ఘురామ ఆరోపించారు. ఇప్ప‌టికి ఆయ‌న పాపం పండింద‌ని ర‌ఘురామ చెప్పుకొచ్చారు.

త‌న‌ను అరెస్ట్ చేయ‌కుండా ఆదేశాలు ఇవ్వాల‌ని విజ‌య్‌పాల్ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించిన సంగ‌తి తెలిసిందే. అయితే అందుకు కోర్టు నిరాక‌రించింది. దీంతో విచార‌ణ అనంత‌రం ఒంగోలులో మంగ‌ళ‌వారం ఆయ‌న్ను అరెస్ట్ చేసిన సంతి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ర‌ఘురామ మాట్లాడుతూ క‌స్టోడియ‌ల్ టార్చ‌ర్‌లో అస‌లు కుట్ర‌దారు సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్‌కుమార్ అని ఆరోపించారు.

త‌న‌ను హింసించిన వారిని శిక్షించడంలో ఇప్పటికే చాలా ఆలస్యమైందని ఆయ‌న వాపోయారు. పీవీ సునీల్ కుమార్ తులసి వనంలో గంజాయి మొక్కలాంటి వ్యక్తని అభివ‌ర్ణించారు. పీవీ సునీల్ కుమార్ దేశం విడిచి వెళ్ల‌కుండా, లుక్‌ ఔట్ నోటీసులు ఇవ్వాలని రఘురామ కోరారు. సునీల్ కుమార్, విజయ్ పాల్ అంతా ఓ ముఠా అని ర‌ఘురామ ధ్వ‌జ‌మెత్తారు. తనను హింసించిన వారికి న్యాయ‌స్థానంలో శిక్షపడుతుందనే నమ్మకం ఉందని ఆయ‌న అన్నారు.

10 Replies to “విజ‌య్‌పాల్‌ అరెస్ట్‌పై ర‌ఘురామ హ్యాపీ”

  1. గుర్తు ఉంచు కోవాల్సింది RRR ను కొట్టిన విషయం గాని, షర్మిల ను బూతులు తిట్టినా విషయం గాని, సునీత తండ్రి హత్య విషయం గాని, లేటెస్ట్ గా అదానీ విశయం గాని జగన్ సొంత వ్యక్తిగత పార్టీ విషయాలు కావు, అవి రాష్ట్ర సమస్యలు పరువు గా అయ్యి కూర్చున్నాయి ఇపుడు.ఇంకా సీబీఎన్, పవన్ లను వేధించిన వాటికి కూడా చాలా మంది ప్రజలను హ్యాపీ చెయ్యాల్సి ఉంది. సీరియల్ కంటిన్యూస్…

  2. గుర్తు ఉంచు కోవాల్సింది RRR ను కొట్టిన విషయం గాని, షర్మిల ను_బూతులు_తిట్టినా విషయం గాని, సునీత తండ్రి హత్య విషయం గాని, లేటెస్ట్ గా అదానీ విశయం గాని జగన్ సొంత వ్యక్తిగత పార్టీ విషయాలు కావు, అవి రాష్ట్ర సమస్యలు పరువు గా అయ్యి కూర్చున్నాయి ఇపుడు.ఇంకా సీబీఎన్, పవన్ లను వేధించిన వాటికి కూడా చాలా మంది ప్రజలను హ్యాపీ చెయ్యాల్సి ఉంది. సీరియల్ కంటిన్యూస్…

  3. పాపం పాల్..అసలు అరెస్ట్ అయినట్టు తెలుసోలేదో..

    .

    ఈయన్ని ఇప్పుడు కస్టోడియల్ టార్చర్ చేసినా పర్లేదు, కోర్ట్ లో చెప్పలేడు, ఆయనకు ఎలాగూ తెలీదు-గుర్తులేదు-మర్చిపోయా కదా..

  4. అప్పట్లో రఘురామ జగనన్నపై చేసిన విమర్శల మాటలను రికార్డు చేసి, విజయ్ పాల్ ను ఒక గదిలో పెట్టి, ఓ 4 గంటల పాటు ఆ విమర్శలన్నీ వినిపిస్తే blood pressure పెరిగిపోతుంది. అప్పుడు ప్రశ్నలడిగితే ఠక్కున సమాధానాలు చెబుతాడు.

Comments are closed.