నా భ‌ర్త‌పై కేసులు ఎవ‌రు, ఎందుకు పెడుతున్నారో?

వైసీపీ సోష‌ల్ మీడియా యాక్టివిస్టు ఇంటూరి ర‌వికిర‌ణ్‌పై వ‌రుస కేసులు న‌మోద‌వుతున్నాయి. ఒక కేసుపై బెయిల్ వ‌స్తే, మ‌రో కేసు రెడీగా వుంటోంది. ఈ నేప‌థ్యంలో ఇంటూరి ర‌వికిర‌ణ్ భార్య సుజ‌న బుధ‌వారం విశాఖ‌లో…

వైసీపీ సోష‌ల్ మీడియా యాక్టివిస్టు ఇంటూరి ర‌వికిర‌ణ్‌పై వ‌రుస కేసులు న‌మోద‌వుతున్నాయి. ఒక కేసుపై బెయిల్ వ‌స్తే, మ‌రో కేసు రెడీగా వుంటోంది. ఈ నేప‌థ్యంలో ఇంటూరి ర‌వికిర‌ణ్ భార్య సుజ‌న బుధ‌వారం విశాఖ‌లో మీడియా ముందుకొచ్చారు. త‌న భ‌ర్త‌పై ఆగస్టు నెలాఖ‌రులో కేసు న‌మోదైన‌ట్టు చెప్పారు. అయితే త‌న భ‌ర్త‌పై ఎవ‌రు, ఎందుకు కేసులు పెడుతున్నారో తెలియ‌డం లేద‌ని ఆమె వాపోయారు.

అడిగినా పోలీసులు చెప్ప‌డం లేదన్నారు. కేసుకు సంబంధించి ఎలాంటి వివ‌రాలు త‌మ‌కు ఇవ్వ‌డం లేద‌న్నారు. ఉన్న‌తాధికారుల ఆదేశాల మేర‌కు స్టేట్‌మెంట్స్ రాసుకొచ్చి, త‌న భ‌ర్త‌తో పోలీసులు సంత‌కాలు చేయించుకుంటున్న‌ట్టు సుజ‌న వెల్ల‌డించారు. త‌న భ‌ర్త అడుగుతున్నా పోలీసులు ఏమీ చెప్ప‌డం లేద‌న్నారు. ఏదైనా వుంటే కోర్టులో చెప్పుకోవాల‌ని పోలీసులు స‌మాధానం ఇస్తున్న‌ట్టు ఆమె చెప్పారు.

త‌న భ‌ర్త ఆరోగ్యం బాగాలేద‌న్నారు. గుండె సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డుతున్నార‌న్నారు. స్టంట్ వేశార‌న్నారు. క‌నీసం 8 గంట‌ల విశ్రాంతి త‌న భ‌ర్త‌కు అవ‌స‌ర‌మ‌న్నారు. రాజ‌మండ్రి జైలు నుంచి మాచ‌ర్ల‌కు తీసుకెళ్లిన‌ట్టు సుజ‌న చెప్పారు. తిరిగి రాజ‌మండ్రికి తీసుకెళ్లిన‌ట్టు ఆమె చెప్పారు. అక్క‌డి నుంచి కుర‌పం తీసుకెళ్లిన‌ట్టు ఇంటూరి భార్య తెలిపారు.

క‌నీసం అంటే రోజుకు ఐదారు వంద‌ల కిలోమీట‌ర్లు తిప్పుతున్న‌ట్టు సుజ‌న చెప్పారు. క‌నీసం నిద్ర‌పోవ‌డానికి కూడా స‌మ‌యం ఇవ్వ‌లేద‌న్నారు. ఇంటూరి ఆరోగ్యం బాగాలేద‌ని వైద్యులు చెబుతున్నా, పోలీసులు విన‌కుండా తిప్పుతూ వున్నార‌ని ఆమె వాపోయారు. త‌న భ‌ర్త‌పై ఇప్ప‌టి వ‌ర‌కు 20 కేసులు న‌మోదు అయ్యాయ‌న్నారు. ప్ర‌భుత్వం క‌క్ష‌సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోంద‌ని ఆమె అన్నారు.

47 Replies to “నా భ‌ర్త‌పై కేసులు ఎవ‌రు, ఎందుకు పెడుతున్నారో?”

  1. పోలీసులకు దొరక్కముందే ఆర్జీవీ లాగా పారిపోవాల్సింది..

    ఎక్కడైనా దాక్కుని.. నన్నేమీ పీకలేరు అని సెల్ఫీ వీడియో వదిలితే.. వైసీపీ లో స్వతంత్ర సమరయోధుడితో సమానం..

    ..

    తప్పుడు పనులు చేసేటప్పుడే మందలించి ఉంటె.. ఈ రోజు ఈ ఏడుపు తప్పేది..

    వైసీపీ పడేసే కుక్కబిస్కట్ల కోసం కక్కుర్తి పడితే .. ఇదిగో.. ఇలా ఫ్రీ గా ఊర్లన్నీ తిరగాల్సిఉంటుంది..

    1. So kakshya sadimpu Ani manam anakoodadu mana timelo ex CM ne bokkalo vesam

      Danitho polisthe idi revenge kaadu chinna pillala aata

      Yedanna ycp chesentha ga TDP vallaki sadyam kaadu

      Revenge valla valana kaadu

  2. ఈ ఏడుపు ఇప్పుడు కాదు పోస్టులు పెట్టేటప్పుడు ఏడవాల్సింది..

    ఇప్పుడు ప్యాలెస్ ముందు టెంట్ వేసుకొని ఏడిస్తే న్యాయం జరుగుతుంది.

  3. పాపం అమాయకురాలు..ఆర్జీవీ మూవీ లో హీరో మా ఆయనే, ఆయనకి కూడా ఒక వారం టైం పడుతుంది, లేకపోతే ప్రొడ్యూసర్స్ కి లాస్ వస్తుంది అని ప్లాన్ చెయ్యాల్సింది..

      1. Bail vachinda raleda annadi point kadu bro. Tappu chesina vaariki siksha padali. Ippudu unna government kuda valla social media wing lo evaraithe tappu postlu pettaro vallani arrest cheyyali. Cheyyakapothe vallake nashtam.

  4. మూలశంక ఆపరేషన్ చేయించుకున్న ఎమ్మెల్యేనే డైరెక్ట్ జీప్ లో శ్రీకాకుళం నుంచి విజయవాడ తీసుకుని వచ్చారు గత ప్రభుత్వం లో … మీ ఆయన సాదారణ సోషల్ మీడియా కార్యకర్త మాత్రమే..

    గత ప్రభుత్వం లో ఎమ్మెల్యేలు, ఎంపీ లకే దిక్కు లేకుండాపోయింది..

  5. పాత ప్రభుత్వము అండతో మీ ఆయన ఎన్ని గలీజు పనులు చేసి ఉంటాడు అవన్నీ ఆ సమయములో నీకు తెలిసి అలా కూడదు అని స్పందించి ఉంటే ఇప్పుడు ఈ సమయములో నీకు సానుభూతి వచ్చి ఉండేది. ఖర్మ అనుభవించండి అంతే

  6. మీ భర్త తప్పుడు పనులు చేస్తున్నప్పుడు నిద్రపోతాను వా. ఇప్పుడు తెలుస్తోంది పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని

  7. నీ భర్త పెట్టిన పోస్ట్లు నలుగురు మహిళలు పోగై ఉన్నకాడ చదివి వినిపించు తర్వాత రిజల్ట్స్ చూసుకో ఇది నచ్చకపోతే మీ నాయకుల ఇళ్ల వద్ద మహిళలకు వినిపించు మీ అయన గొప్పతనం తెలుస్తుంది ఈ బుద్ది డబ్బుకు కక్కుర్తిపడి వేరే మహిళలను తిట్టేటప్పుడు ఉండాలి

  8. ఒకవేళ మళ్ళీ వైసిపి ప్రభుత్వ గనుక వచ్చే వుంటే ఈ కుక్క మూతి పిందెలు ఏం మాట్లాడే వారో ఊహించడానికి భయం గా ఉన్నది.

  9. అమ్మ మీ అయన గారు చాలా సుద్దపూస అని అతనికి సన్మానం చేసే సమయము వచ్చింది.. ఎమ్మా గత 5 ఏళ్ళు మీ అయన చేసిన దిక్కుమాలిన పోస్టింగ్ లు కనపడలేదా. అప్పుడు చెప్పి ఉంటే ఇలాంటి దుస్థితి వచ్చేది కాదు కదా

Comments are closed.