నైతికత చిరునామా వెదుక్కోవాలి

చేస్తున్నది అంతా ఎవరో తెలిసింది కనుక, సదరు ఎంప్లాయి విషయంలో జాగ్రత్తగా ఉంటూ వస్తున్నారట.

ఒకప్పుడు ఓ సంస్థ ఉద్యోగం ఇస్తే, దాన్ని నమ్ముకుని ఉండడం, యజమానిని దైవంగా భావించడం ఇలాంటివి ఉండేవి. అదంతా క్రీస్తు పూర్వం అనే లాంటి కాలం. తరువాత కాలం మారింది. యజమానిని దైవంగా భావించకున్నా, కాస్త గౌరవం ఉండేది. మంచి ఆఫర్ వస్తే జంప్ జిలానీ అంటున్నారు. అది కూడా తప్పేమీ కాదు. ఎవరి ఎదుగుదల వారు చూసుకుంటారు. ఇప్పుడు ఇంకా కాలం మారింది. యజమాని గుట్టు మట్లూ అన్నీ తెలుసుకుని బయటకు వదలడం, లేదా లీకులు ఇవ్వడం లేదా బెదిరించి గుప్పిట్లో పెట్టుకోవడం అనే ట్రెండ్ మొదలైంది. లేదంటే టోపీ వేసి కోట్లు కొట్టేయడం అన్నది కామన్ అవుతోంది.

నిర్మాత పివిపి కి టోపీ వేశారు కొందరు ఉద్యోగులు. ఆ మధ్య చాలా పెద్ద పంపిణీ సంస్థ అధినేతకు టోపీ వేశాడు ఓ అకౌంటెంట్. డూప్లికేట్ అకౌంట్ తెరచి, చెక్కులు డిపాజిట్ చేసి కోట్లు గల్లంతు చేశాడు. ఈ మధ్య ఓ నిర్మాత దగ్గర నమ్మకంగా ఉండి కోట్లు కొట్టేసాడు ఓ సీఈఓ.

లేటెస్ట్‌గా ఫ్యాక్టరీ మోడల్‌లో సినిమాలు తీస్తున్న ఓ నిర్మాత గుట్టు మట్లూ, సంస్థ తీరు తెన్నులు, పద్ధతులు అన్నీ బయట జనాలకు లీకులు ఇస్తున్నారట ఓ పెద్ద సినిమా కంపెనీ ఉద్యోగి ఒకరు. ఈ మేరకు వార్తలు రావడంతో, సదరు నిర్మాత ఎవరు చేస్తున్నారు ఇదంతా అని ఆరా తీయడం, ఓ ఎంప్లాయి పేరు బయటకు రావడం జరిగిపోయిందట. అయితే ఇప్పుడు ఆ ఎంప్లాయిని ఎలా జాగ్రత్తగా బయటకు పంపాలి అన్నది ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక్కడ చాలా సెన్సిటివ్ ఇష్యూలు ఇన్‌వాల్వ్ అయ్యి ఉండడంతో, తమకు ఎంత పలుకుబడి ఉన్నా, ప్లాన్డ్‌గా, జాగ్రత్తగా డీల్ చేసి, బయటకు పంపించే పనిలో ఉన్నారట. చేస్తున్నది అంతా ఎవరో తెలిసింది కనుక, సదరు ఎంప్లాయి విషయంలో జాగ్రత్తగా ఉంటూ వస్తున్నారట.

అయినా చేస్తే ఉద్యోగం చేసుకోవాలి, నచ్చకుంటే మానేయాలి. కానీ ఇలా తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టడం ఏమిటో?

7 Replies to “నైతికత చిరునామా వెదుక్కోవాలి”

  1. “నైతికత” లాంటి విలువైన పదాలు ఇలాంటి వెబ్సైట్ లో వాడకపోవడం మంచింది GA గారు

Comments are closed.