పుష్ప-2.. ఇది మామూలు హింస కాదు

తెలుగు తెరపై వయొలెన్స్ హద్దులు దాటి చాన్నాళ్లయింది. శృతిమించిన రక్తపాతం, ఊహకు అందని హింస ఇప్పుడు కామన్ అయిపోయింది. అవసరమైతే ‘ఎ-సర్టిఫికేట్’ తెచ్చుకుంటాం కానీ తగ్గేదేలే అన్నట్టున్నారు మేకర్స్. Advertisement పుష్ప-2 సినిమా కూడా…

తెలుగు తెరపై వయొలెన్స్ హద్దులు దాటి చాన్నాళ్లయింది. శృతిమించిన రక్తపాతం, ఊహకు అందని హింస ఇప్పుడు కామన్ అయిపోయింది. అవసరమైతే ‘ఎ-సర్టిఫికేట్’ తెచ్చుకుంటాం కానీ తగ్గేదేలే అన్నట్టున్నారు మేకర్స్.

పుష్ప-2 సినిమా కూడా ఆ కోవలోకే చేరినట్టు కనిపిస్తోంది. మొదటి పార్ట్ తో పోలిస్తే పార్ట్-2లో హింస పాళ్లు ఎక్కువగా ఉన్నాయి. కాలు నరికితే గాల్లో ఎగిరెళ్లి ఎక్కడో పడడం.. విలన్ చేయి నరికి హీరో దాన్ని ఎత్తి చూపడం లాంటివి జస్ట్ మచ్చుకు కొన్ని మాత్రమే.

పుష్ప-2 సినిమాపై అల్లు అర్జున్ ఇప్పటికే హింట్ ఇచ్చాడు. పుష్ప-1లో ఊర మాస్ చూసిన ప్రేక్షకులు, పార్ట్-2లో జాతర మాస్ చూస్తారని చెప్పకనే చెప్పాడు. దానికి తగ్గట్టుగానే సినిమా సెకెండాఫ్ భారీ వయొలెన్స్ తో నిండిపోయింది.

ఇక రన్ టైమ్ విషయానికొస్తే.. నిడివి 200 నిమిషాలుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, 3 గంటల 20 నిమిషాల 38 సెకెన్లు ఉంది సినిమా. ఇంటర్వెల్ తో కలిపి చూసుకుంటే, థియేటర్లలో మూడున్నర గంటలు గడపాల్సి ఉంటుంది. కంటెంట్ సూపర్ గా వచ్చింది కాబట్టి రన్ టైమ్ విషయంలో తగ్గేదేలే అంటున్నారు మేకర్స్.

19 Replies to “పుష్ప-2.. ఇది మామూలు హింస కాదు”

  1. బర్గర్లు పప్పుతో సేయరు అలాగే మాస్ మూవీస్ బ్లడ్ షెడ్ కాకుండా ఉండదు . ఆర్టికల్స్ కి ఐడియా నే దొరకట్లేదనుకుంటా

Comments are closed.