ఆహా నుంచి సిబ్బంది తొలగింపు?

లేటెస్ట్ ఓ వారం క్రిందట భారీగా సిబ్బందిని తగ్గించారని, ఇప్పుడు చాలా లిమిటెడ్ సిబ్బంది వున్నారని తెలుస్తోంది.

ఏ సంస్థ అయినా రెండు కారణాలతో సిబ్బంది బరువు దించుకుందాం అనుకుంటుంది. ఒకటి అధిక సిబ్బంది లేదా ఖర్చుల తగ్గింపు. రెండు నాన్ ఫెర్మార్మెన్స్. తెలుగు వారి ఓటిటి సంస్థ ఇటీవల కాస్త భారీగానే సిబ్బందిని తగ్గించుకుందనే వార్తలు గుప్పు మంటున్నాయి. దాదాపు యాభై మందిని తొలగించారు అని వినిపిస్తోంది.

తొలగించిన మాట వాస్తవమే కానీ మరీ అంత మందిని కాదు అనీ వినిపిస్తోంది. తెలుగు ఓటిటి సంస్థ ఆహా చాలా పెద్ద ఎత్తున ప్రారంభమైంది. ఓన్ కంటెంట్ మీద దృష్టి పెట్టింది. కొనుగోళ్లు కూడా సాగించింది. అదే టైమ్ లో తమిళంలో కూడా ఓటిటిని స్టార్ట్ చేసింది.

కానీ రాను రాను మల్టీ నేషనల్ ఓటిటి సంస్థల పోటీని తట్టుకోలేకపోయింది. పైగా వారం వారం పెట్టుబడులు పెడుతూనే వుండాలి. కంటెంట్ కొంటూనే వుండాలి. వందల కోట్ల పెట్టుబడి పెడుతూనే వుండాలి. ఇలాంటి నేపథ్యంలో రోజు రోజుకూ ఆహా ఓటిటి సంస్థ వెనక్కు తగ్గుతూ వస్తోంది. నష్టాల్లో వుందని, సిబ్బందిని తగ్గించుకుంటోందని తరచు వార్తలు వినిపించేవి.

లేటెస్ట్ ఓ వారం క్రిందట భారీగా సిబ్బందిని తగ్గించారని, ఇప్పుడు చాలా లిమిటెడ్ సిబ్బంది వున్నారని తెలుస్తోంది. అయితే ఆహా ఇన్ సైడ్ వర్గాలు ఇది కాదంటున్నాయి. సరిగ్గా పెర్ ఫార్మ్ చేయని వారిని ఏటా తొలగించడం అన్నది కామన్ అని, ఈసారి కూడా అలాగే తొలగించారని, అయితే మరీ నలభై యాభై మందిని కాదని అంటున్నాయి. ఏమైనా ఆహా సంస్థ కోలుకునే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి.

2 Replies to “ఆహా నుంచి సిబ్బంది తొలగింపు?”

Comments are closed.