తిరుమ‌ల చ‌రిత్ర‌లో ఇంత‌టి దారుణం ఇదే!

పాదాలు మొక్కి గౌర‌వించాల్సిన స్వామీజీల‌ను, చంద్ర‌బాబు ఏలుబ‌డిలో మెడ‌లు ప‌ట్టి గెంటేశార‌ని టీటీడీ మాజీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

పాదాలు మొక్కి గౌర‌వించాల్సిన స్వామీజీల‌ను, చంద్ర‌బాబు ఏలుబ‌డిలో మెడ‌లు ప‌ట్టి గెంటేశార‌ని టీటీడీ మాజీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. క‌లియుగ దైవం శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామి పాదాల చెంత తిరుప‌తిలో ముంతాజ్ హోట‌ల్ నిర్మాణానికి అనుమ‌తులు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. వంద‌లాది మంది స్వామీజీలు ప్ర‌భుత్వ నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా తిరుమ‌ల‌లో శ్రీ‌వారి ఆల‌యం ఎదుట నిర‌స‌న చేప‌ట్టారు. స్వామీజీల‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని, పోలీస్‌స్టేష‌న్‌కు త‌ర‌లించారు.

ఈ విష‌య‌మై టీటీడీ మాజీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి మాట్లాడుతూ తిరుమ‌ల‌లో సాధువులపై అమానుషంగా ప్ర‌వ‌ర్తించార‌ని ధ్వ‌జ‌మెత్తారు. ప్ర‌భుత్వం హిందూ ధ‌ర్మ వ్య‌తిరేక విధానాల్ని అవ‌లంబిస్తుండ‌డంతో సాధువులు తిరుగుబాటు బావుగా ఎగురవేశార‌ని ఆయ‌న అన్నారు. స‌హ‌జంగా సాధువుల పాదాల్ని మొక్కుతామ‌న్నారు. కానీ తిరుమ‌ల‌లో సోమ‌వారం స్వామీజీల మెడ‌లు ప‌ట్టుకుని గెంటేశార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

హిందూ ధ‌ర్మాన్ని కాపాడాల‌ని నిన‌దించిన స్వామీజీల‌పై కూట‌మి ప్ర‌భుత్వం క‌క్ష‌సాధింపుల‌కు దిగింద‌ని ఆయ‌న ఆరోపించారు. ప‌నికిమాలిన వ్యాన్‌ల‌లో సాధువుల్ని ఎక్కించి, అడ‌వుల్లో భాక‌రాపేట పోలీస్‌స్టేష‌న్‌కు త‌ర‌లిస్తారా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. రెండువేల సంవ‌త్స‌రాల చ‌రిత్ర ఉన్న తిరుమ‌ల‌లో సాధువుల తిరుగుబాటు ఇదే తొలిసారి అని ఆయ‌న విమ‌ర్శించారు.

మత కల్లోల‌ ప్రాంతాల్లో కూడా ప్రమాద కరమైన పరిస్థితుల్లోనూ ఇలా వ్యవహించలేదని ఆయ‌న చెప్పుకొచ్చారు. హిందూ ధ‌ర్మం ప‌రిర‌క్షిస్తామంటూ గొప్ప‌లు చెప్పుకునే కూట‌మి స‌ర్కార్ సాధువుల‌పై ఇదేనా వైఖ‌రి అని ఆయ‌న నిల‌దీశారు. గ‌తంలో ముంతాజ్ హోట‌ల్ నిర్మాణాన్ని తిరుప‌తిలో జ‌ర‌గ‌నివ్వ‌మ‌ని చెప్పిన చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌… ఇప్పుడు మాట మార్చార‌ని ఆయ‌న అన్నారు. వెంక‌టేశ్వ‌ర‌స్వామికి త‌మ గోడు చెప్పుకోడానికి తిరుమ‌ల‌కు వెళ్లిన స్వామీజీల ప‌ట్ల ఇంత దారుణంగా వ్య‌వ‌హ‌రిస్తారా? అని భూమ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాజ‌కీయ నాయ‌కుల‌తో వ్య‌వ‌హ‌రించిన విధంగా సాధువుల‌తో వ్య‌వ‌హ‌రిస్తారా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. తిరుమ‌ల‌లో స్వామీజీల‌పై పోలీసుల అనుచిత వైఖ‌రిని తీవ్రంగా ఖండిస్తున్నామ‌న్నారు.

సాధువులు పై చేయి చేసుకోవడం చంద్రబాబు పాలనలోనే జరిగిందని భూమ‌న ఆరోపించారు. సాధువులకు విజ్ఞప్తి చేస్తున్నా.. కూటమి ప్రభుత్వం పాలనలో ఇన్ని దారుణాలు జరుగుతున్నాయన్నారు. ఇలా చేయడం హిందూ ధర్మం పరి రక్షించడమా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. అలిపిరి వ‌ద్దే స్వామీజీలు, సాధువులకు నచ్చజెప్పి నియంత్రించాల్సిన వారిని తిరుమలలో ఇలా దారుణంగా వ్యవహరిస్తారా? అని మండిప‌డ్డారు.

తిరుమలలో మద్యం సేవించి, ఒక తాగుబోతు శ్రీవారి ఆలయం ముందు అసభ్యంగా ప్రవర్తిస్తే ఏం చేస్తున్నారని ఆయ‌న ప్ర‌శ్నించారు. తాగుబోతు తిరుమలలో వీరంగం చేస్తే దిక్కు లేదని ఆయ‌న విమ‌ర్శించారు. కూట‌మి నేత‌ల సేవ‌ల్లో టీటీడీ అధికారులు త‌రిస్తున్నార‌న్నారు.

20 Replies to “తిరుమ‌ల చ‌రిత్ర‌లో ఇంత‌టి దారుణం ఇదే!”

  1. కట్టుకోమని అనుమతులు ఇచ్చినప్పుడు నువ్వెక్కడున్నావ్? ఈ సాధువులు ఎక్కడున్నారు ? ఇప్పుడు ఎక్కడ నుంచి వచ్చారు? కొంపదీసి మనోళ్ళకి కాషాయం గుడ్డలు కట్టేసి సాధువులనేసామా ఏంటీ భూమనా ?

  2. కట్టుకోమని అనుమతులు ఇచ్చినప్పుడు నువ్వెక్కడున్నావ్? ఈ సాధువులు ఎక్కడున్నారు ? ఇప్పుడు ఎక్కడ నుంచి వచ్చారు? కొంపదీసి మనోళ్ళకి కాషాయం గుడ్డలు కట్టేసి సాధువులనేసామా ఏంటీ భూమనా ?

  3. ముంతాజ్ హోటల్ కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది 11లంగామోహనచెడ్డీ.. మరి ఆడి ప్యాలెస్ ముందు ధర్నా చేసి ఆడి బట్టలూడదీసి అడగాలి కదా నీలి సాదువులు.. ఇదేం రాజకీయం స్వాములు??

    1. Annagaru, okasari video chudandi neeku nammakunna channels lo. Dongaswamulithe tannandi. Hindutvam antha adhikaram lo kamma lu lekapothe ne kanipistunda. Kaasi Nayana annadana satram kulachru. Chala goppa panulu chestunnaru. Ayina manishiki idi tappu idi right ane cheppe alochana swabhavam eppudo poyindi. Ye party lo unte aa party ki anugunanga matladali anthe.

  4. కరుణాకర్ రెడ్డి గారు ఈ విమర్శ ఎట్టగుందంటే గతం లో ఒక పాట వచ్చింది జ్యోతిలక్ష్మి చీరకట్టింది చీరకే సిగ్గేసింది అని

  5. ధర్నా తిరుమలలో కాకుండా, కింద చేస్తే బాగుండేది.

    ఒక వేళ జగన్ అనుమతి ఇచ్చినా, బాబు కాన్సల్ చెయ్యవచ్చు

Comments are closed.