బాబు చేసిన అప్పులు 70 వేల కోట్లు

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయింది. ఈ ఆరు నెలలలో ప్రభుత్వం చేసిన అప్పులు డెబ్బై వేల కోట్ల రూపాయలు చేరుకున్నాయని శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ…

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయింది. ఈ ఆరు నెలలలో ప్రభుత్వం చేసిన అప్పులు డెబ్బై వేల కోట్ల రూపాయలు చేరుకున్నాయని శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ చెబుతున్నారు.

ఇప్పటికే 67 వేల 237 కోట్ల రూపాయలను ప్రభుత్వం అప్పు చేసిందని ఆయన అన్నారు. రేపు మంగళవారం మళ్ళీ నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పు చేయబోతున్నారని చెప్పారు. దీంతో కూటమి వచ్చాక ఏపీలో చేసిన అప్పు మొత్తం 70 వేల కోట్లకు చేరుతుందని ఆయన లెక్కతో సహా చెప్పారు.

ఇన్ని వేల కోట్ల అప్పులు చేస్తున్న కూటమి ప్రభుత్వం ఒక్క పెన్షన్ పెంపు తప్ప సంక్షేమ పథకాలు ఏవీ అమలు చేయడం లేదని బొత్స విమర్శించారు. అయినా వేల కోట్లు అప్పులు చేసి ఏమి చేస్తున్నారని ఆయన నిలదీసారు.

తాము ఈ పాటికి అధికారంలో ఉంటే 18 వేల 200 కోట్ల రూపాయలు సంక్షేమ పధకాలకు ఖర్చు చేసి ఉండేవారని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వానికి సంక్షేమ పధకాలను అమలు చేయలన్నది ప్రాధాన్యత కాదని ఆయన విమర్శించారు. పధకాలు ఎటూ లేవని ఇపుడు విద్యుత్ చార్జీల బాదుడుని మొదలెట్టారని ఆయన మండిపడ్డారు. ట్రూ అప్ చార్జీల పేరుతో మోత మోగిస్తున్నారు అని ఆయన అన్నారు.

వైసీపీ అధికారంలో ఉన్నపుడు అప్పులు పెద్దగా చేస్తున్నారని గగ్గోలు చేసిన కూటమి పెద్దలు ఇంత పెద్ద మొత్తంలో అప్పులు చేసి దేనికి వినియోగిస్తున్నారో చెప్పాలని బొత్స డిమాండ్ చేశారు. గడచిన ఆరు నెలల కాలంలో ప్రజలలో కొనుగోలు శక్తి పూర్తిగా తగ్గిపోయిందని మార్కెట్ ఎకానమీ పడిపోయిందని బొత్స అన్నారు. తాము పథకాల ద్వారా ప్రజలకు చేయూతను ఇవ్వడం వల్లనే ఆర్ధిక వృద్ధి రేటు పెరిగిందని ఆయన చెప్పారు. ఏపీలో జీఎస్టీ తగ్గిపోవడానికి ఇదే కారణం అన్నారు.

బెల్ట్ షాపులను కూడా వేలం వేస్తూ మద్యాన్ని విచ్చలవిడిగా అమ్ముతున్నారని ఒక్కో బెల్ట్ షాపునూ 50 వేల రూపాయలకు వేలం వేస్తున్నారు అంటే లిక్కర్ వ్యవహారం ఎలా ఉందో అంతా అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు.

కాకినాడ పోర్టులో అక్రమాలు ఎవరు చేసినా ఒకేలా యాక్షన్ ఉండాలని తరతమ భేదాలు ఎందుకని బొత్స ప్రశ్నించారు. మంత్రి పదవికి కొత్త కాబట్టే పవన్ అలా మాట్లాడుతున్నారని బొత్స సెటైర్లు వేసారు. విద్యుత్ బాదుడు మీద వైసీపీ యాక్షన్ ప్లాన్ తొందరలో ప్రకటిస్తామని ఆయన చెప్పారు.

27 Replies to “బాబు చేసిన అప్పులు 70 వేల కోట్లు”

  1. So what. This is all used for development. Previously everything was just distributed to people as freebies. Now it is all used for development. AP is developing at Jet speed and you fellows are crying.

    1. No body is crying they are cheating people with corruption 70% of people are not accepting amaravathi who is gaining only ministers and big shots are getting benefits

  2. అప్పుడెమో అమెరికాకి కూడా అప్పుంది అని వాదన..

    ఇప్పుడేమో అప్పు చేసేశారని వాదన..

    జీతం ఒకటో తారీకున పడుతుందా, పింఛను ఒకటో తారీకున అందుతుందా? ఇది కాదా మొదటి కూటమి విజయం..

      1. మీకు ఏ అవసరం వచ్చిన సచివాలయం కి వెళ్లండి..అక్కడ ఎవరు ఎవరిని పట్టించునేవారు కాదు..

        అలాగే, విలేజ్ క్లినిక్ కి ఎన్నిసార్లు వెళ్లవు బ్రో ప్రాణం బాగోపోతే..?

  3. చంద్రబాబు..పోయేలాగా..AP..ని..సంక..నాకిస్తాడు, ఇంతకూ..ముందు..3..సార్లు..CM..ఫైనాన్సియల్..ఇండెక్స్..గోరంగా..ఉండేవి, ఈ..సారి..ఇంకా..ఇంకా..ఘోరం..చూడబోతున్నాము. ఈ..పేపర్..విషనరీ..తమ..వాళ్లకు..దోచిపెట్టడానికి..మాత్రమే..పవర్లోకి..వస్తాడు, వాళ్లు..నడిపే..పేపర్లు..మోసపు..వార్తలతో..మల్లి..గెలవడానికి..ట్రై..చేస్తాడు. మోసము..దగా..ఈఆయనతోటె..మొదలు..అయ్యింది. ఎంతైనా…April..20..న..పుట్టాడు..కదా?

  4. నీ పాలన లొ ఉన్న సంఘ్షెమ పదకాలు అన్ని ఇప్పుడు కూడా ఉన్నయి. పైగా వ్రుధాప్య పెన్షన్లు 4 వేలు అయ్యింది, అన్న క్యాంటెన్లు వచ్హాయి, రొడ్లు వెస్తున్నారు, రాజదాని కడుతున్నరు. పొలవరం కూడా మొదలు కాబొతుంది

  5. వీళ్ళు ఎంత అప్పు తెచ్చిన దానికి లెక్కాజమా చెపుతున్నారు వెబ్సైట్ లో పెడుతున్నారు మీ హయం లో గెజిట్ ఆర్డర్ కూడా సీక్రెట్ గ ఉంచి దేనికి లెక్కాజమా లేదు కదా అది మీకు తెలుసు ఎక్కడికి వెళ్లి అవినీతి విషయం ప్రతిపక్షం పరిశీలించాలన్న అక్కడ పోలీస్ లను వాడి వాళ్ళను అరెస్ట్ చేయించి ఇబ్బందులు పాలు చెయ్యటమేగా అప్పట్లో మీ పని

Comments are closed.