పయ్యావుల నోరు తెరవాల్సిందే!

పవన్ కల్యాణ్ పాపం అంత కష్టపడి సముద్రం మీదికి పడవల్లో దూసుకెళ్లిపోయి.. షిప్ ఎక్కడానికి కూడా ప్రయత్నించి, విఫలమై ఆ ఆక్రోశాన్ని దాచుకోలేక విచ్చలవిడిగా ఆగ్రహాన్ని ప్రకటించి.. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను ఏకం చేసేసి…

పవన్ కల్యాణ్ పాపం అంత కష్టపడి సముద్రం మీదికి పడవల్లో దూసుకెళ్లిపోయి.. షిప్ ఎక్కడానికి కూడా ప్రయత్నించి, విఫలమై ఆ ఆక్రోశాన్ని దాచుకోలేక విచ్చలవిడిగా ఆగ్రహాన్ని ప్రకటించి.. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను ఏకం చేసేసి అయినా సరే.. కాకినాడ పోర్టును మూయించేస్తా అనేంత స్థాయిలో పవన్ కల్యాణ్ నానా రచ్చ చేశారు.

ఇంతా కలిపి.. కలెక్టరు పట్టుకున్న పీడీఎస్ బియ్యం పట్టాభి ఆగ్రో అనే సంస్థ ద్వారా తరలి వెళ్తున్నదని, ఆ సంస్థ చంద్రబాబు సర్కారులో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వియ్యంకుడిదే అని ఇప్పుడు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆరోపణలు తీవ్రం అవుతున్నప్పుడు.. మంత్రి పయ్యావుల స్వయంగా నోరు తెరచి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని ప్రజలు భావిస్తున్నారు.

రాజకీయాల్లో ఆరోపణలు ప్రత్యారోపణలు చాలా సహజం. నిజానికి మసిగుడ్డ కాల్చి మొహాన పడేయడం, అవతలి వాళ్లే దాన్ని కడుక్కోవాలని వేచిచూడడం రాజకీయాల్లో చాలా సహజమైన క్రీడ. పవన్ కల్యాణ్ తనంత తాను సముద్రం మీదికి వెళ్లిపోయి.. పట్టుకున్న పీడీఎస్ బియ్యం మొత్తం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులే అక్రమంగా స్మగ్లింగ్ చేస్తున్నట్టుగా చాలా ఘాటుగా మాట్లాడారు. ఏదో నామన్ కే వాస్తే.. కొన్ని సంస్థ పేర్లు ప్రకటించారు గానీ.. పట్టుకున్న బియ్యం ఏ సంస్థ ద్వారా వెళుతున్నదో ఇదమిత్థంగా ఆ ప్రెస్ మీట్ లో చెప్పనేలేదు.

తీరా ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు మొత్తం వివరాలు ఆరా తీసిన తర్వాత తెలుగుదేశం నాయకులకు గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్టు అవుతోంది. పట్టుకున్న బియ్యం పయ్యావుల వియ్యంకుడిదే అని తేలడంతో వారు నోరు మెదపలేకపోతున్నారు. అంబటి రాంబాబు, పేర్ని నాని తదితర వైసీపీ నాయకులు విడివిడిగా ప్రెస్ మీట్లు పెట్టి.. పయ్యావుల కేశవ్ వియ్యంకుడికి చెందిన సంస్థ ద్వారానే ఈ బియ్యం తరలుతున్నట్టుగా వెల్లడిస్తున్నారు.

ఇలాంటి సమయంలో.. అతిగా దూషణలు చేసిన, రాజకీయ ప్రత్యర్థుల్ని ఇరికించాలని చూసిన పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ లాంటి నాయకులకు మాట్లాడ్డానికి నోరు పెగలకపోవచ్చు. కానీ ఆరోపణలు ఎదుర్కొంటున్న పయ్యావుల కేశవ్ సంజాయిషీ చెప్పాలని, వివరణ ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు. అదానీ ముడుపులకు సంబంధించి ఆరోపణలు వచ్చాయి. జగన్ స్వయంగా మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చారు. ఈ పీడీఎస్ బియ్యం ఆరోపణలపై పయ్యావుల కేశవ్ కూడా అదే జగన్ స్ఫూర్తితో స్వయంగా వివరణ ఇవ్వాలనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

16 Replies to “పయ్యావుల నోరు తెరవాల్సిందే!”

  1. Whether he is power or not, Pawan sir always fights against corruption. Janasena works only for people and not for power. So, if what you are saying is right then Pawan sir is doing the right thing by bringing all corruption and loot to public notice. That is his true leadership and why people love him. He is the man of the masses. AP is fortunate to have him as a leader.

  2. Whether he is power or not, Pawan sir always fights against corruption. Janasena works only for people and not for power. So, if what you are saying is right then Pawan sir is doing the right thing by bringing it all to public notice. That is his true leadership and why people love him. He is the man of the masses. AP is fortunate to have him as a leader.

    1. కరెక్ట్ ఏ పవన్ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు బాబు ద్రుష్టి కి తీసుకొని వెళ్తాడు బాబు గారు ఇలా ఆగ్రహం వ్యక్తం chestu untaru

      మద్యం షాప్ లో వాటాల కోసం వ్యాపారులను బెదిరిస్తున్న MLA లు ఆగ్రహం వ్యక్తం చేసిన బాబు.

       MLA లు మామూళ్ల కోసం కొట్లాట ఆగ్రహం వ్యక్తం చేసిన బాబు.

      కాకినాడ బియ్యం అక్రమ ఎగుమతుల ఫై సీరియస్ ఐన బాబు ,Pawan.

      ఉత్తర ఆంధ్ర కంపెనీ దెగ్గర మామూళ్లు వసూళ్లు చేస్తున్న సీనియర్ MLA ki వార్నింగ్ ఇచ్చిన బాబు.

      JC ,అది కి అమరావతి పిలిచి మందలించిన బాబు .

      అధికారుల ఫై పెత్తనం చేస్తున్న MLA భార్య సీరియస్ ఐన బాబు గారు

  3. పయ్యావుల నోరు తెరిసి నా పేరు ఎక్కడ లేదు అని చెప్తే సరేనా నీకు? లేవెన్నన్న ఇచ్చిన వివరణ అదేగా..?

  4. అసలు కాకినాడ పోర్ట్ కొనుక్కున్నది జగన్ రెడ్డి వియ్యంకుడు అరబిందో, వాడు టీడీపీ వాళ్ళని ఎందుకు రానిస్తాడు? జగన్ రెడ్డి కి అంటిన బురద అందరికి పూసి తప్పించుకోవటమే కానీ ఎప్పుడు ఒప్పుకున్నాడు… నీచుడు జగన్ రెడ్డి

  5. ఉచిత బియ్యం వంటి సంక్షేమ పథకాలు ఇచ్చేటప్పుడు లబ్ది దారులకు డబ్బు కావాలా సరుకు కావాలా అనే ఒప్షన్స్ ఇవ్వాలి వాళ్ళు కోరినది ఇస్తే ఇలాంటి కార్యక్రమాలకు అవకాశం ఉండదు

Comments are closed.