నైజాంలో తగ్గేదేలే.. ఏపీలో అస్సలు తగ్గేదేలే

పుష్ప-2 కోసం నైజాంలో టికెట్ రేట్ల పెంపు కోసం గేట్లు బార్లా తెరిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏపీలో కూడా అదే రిపీటైంది. తగ్గేదేలే అన్నట్టు తెలంగాణలో టికెట్ రేట్లు పెంచితే.. అస్సలు తగ్గేదేలే…

పుష్ప-2 కోసం నైజాంలో టికెట్ రేట్ల పెంపు కోసం గేట్లు బార్లా తెరిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏపీలో కూడా అదే రిపీటైంది. తగ్గేదేలే అన్నట్టు తెలంగాణలో టికెట్ రేట్లు పెంచితే.. అస్సలు తగ్గేదేలే అన్నట్టు ఏపీలో కూడా రేట్లు పెంచేశారు. రెట్టించిన ఉత్సాహంతో స్పెషల్ జీవో జారీ చేశారు. ఎంతలా అంటే.. ఏపీలో ఇదే హయ్యస్ట్.

నైజాంలో ఇచ్చినట్టుగానే ఏపీలో కూడా 4వ తేదీన స్పెషల్ ప్రీమియర్ కు ప్రత్యేక అనుమతినిచ్చారు. ఆ ఒక్క షోకు టికెట్ రేటు 800 రూపాయలు చేశారు. ఇది 4వ తేదీ 9.30 గం.లకు ఉంటుంది.

నైజాంలో 5వ తేదీ నుంచి ఫ్లాట్ గా టికెట్ రేట్లు పెంచితే.. ఏపీలో మాత్రం శ్లాబ్ సిస్టమ్ పెట్టారు. 5వ తేదీన 6 షోలకు అనుమతినిస్తూనే, లోవర్ క్లాస్ కు వంద రూపాయలు, అప్పర్ క్లాస్ కు 150 రూపాయలు, మల్టీప్లెక్సుల్లో 200 రూపాయల వరకు పెంచుకోవచ్చని జీవో ఇచ్చారు.

ఇక 6వ తేదీ నుంచి 17వ తేదీ వరకు రోజుకు 5 షోలకు అనుమతినిచ్చారు. ఇక్కడ కూడా పైన చెప్పుకున్న టికెట్ రేట్ల పెంపునే కేటాయించారు. నైజాంలో 19 రోజుల పాటు ఏకథాటిగా టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతులు రాగా.. ఏపీలో వరుసగా 13 రోజుల పాటు రేట్లు పెంచుకోవచ్చని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ లో ఓ సినిమాకు ఈ స్థాయిలో టికెట్ రేట్ల పెంపుపై ప్రత్యేక అనుమతి ఇవ్వడం ఇదే తొలిసారి. ఇంతకుముందు రిలీజైన పెద్ద సినిమాలు కల్కి, దేవరతో పోలిస్తే, పుష్ప-2కు భారీగా రిలాక్సేషన్ ఇచ్చినట్టయింది. మరీ ముఖ్యంగా బెనిఫిట్ షో విషయంలో తగ్గేదేలే అన్నట్టు వ్యవహరించింది ఏపీ సర్కారు.

15 Replies to “నైజాంలో తగ్గేదేలే.. ఏపీలో అస్సలు తగ్గేదేలే”

  1. క్యాపటలిసంలో ఇవన్ని మామూలే GA, ఏవడికి ఏక్కువ దురద ఉంటదో వాడే సినిమాను ముందుగా చూస్తాడు దానిలో వింతేముంది!

  2. AP govt should provide immediate relief to white card holders by offering 4 free tickets per family. Otherwise people will spend their pension money on tickets and starve for food this month. Since Govt increased the ticket prices, they should take the responsibility and minimize the impact on poor.

  3. Theatre ki vacche public 50% of the population nundi 10% ki padipoyindi ani telisi, ee vacche 10% vaari mida ne, tkt rates 400% penchi colls laagudaamu ani plan. Audience ee gimmicks ki padaru. 2nd week daaka wait cheste, taggaaka choodochu, leda OTT ki wait chesi, aa theatre lo spend chese dabbu oka mutual funds SIP chesukunte 20 yrs lo maname rich avvochu

Comments are closed.