ఇక మగపిల్లలకి పెళ్లిళ్లు అయినట్టే

ఎన్నారై సంబంధాలే కావాలంటే కుదరదు. ఎందుకంటే హెచ్ 1 బి లేకపోతే ఎన్నారై పెళ్లికొడుకులే తగ్గిపోతారు కాబట్టి.

1980ల వరకు మగపిల్లలకి పెళ్లి అవ్వాలంటే మినిమం ప్రభుత్వ ఉద్యోగమో, లేక బ్యాంక్ జాబో ఉండాల్సిన పరిస్థితి. దాంతో పాటూ అబ్బాయిల వైపునుంచి కట్నకానుకల డిమాండ్స్ ఎలాగూ ఉండేవి.

1990ల తర్వాత గాలి అమెరికా వైపుకు వీయడం మొదలుపెట్టింది. అమ్మాయిల ఆలోచనల్లో ఇండియాలోనే ఉండే పెద్ద ఉద్యోగం వాడికంటే అమెరికా భర్త అయితే బాగుంటుందని కోరుకోవడం ఎక్కువయ్యింది. దాంతో ఎన్నారై సంబంధాలకి గిరాకీ పెరిగింది. కట్నాలు కూడా దానికి తగ్గట్టే ఉండేవి.

క్రమంగా రోజులు మారుతూ వచ్చాయి. “మంది ఎక్కువైతే మజ్జిగ పలచన” అన్నట్టుగా వీధికొక మగపిల్లాడు అమెరికాలో ఉండడం వల్ల, కేవలం ఎన్నారై స్టాటస్ కాకుండా, అబ్బాయికి ఆస్తిపాస్తులుంటేనే పెళ్లికి ఒప్పుకునే అమ్మాయిలు బయలుదేరారు. అమ్మాయిల సంఖ్య పెరిగి, అబ్బాయిల సంఖ్య తగ్గడంతో కట్నాల డిమాండ్స్ కూడా తగ్గుతూ వచ్చాయి. “మంచి అమ్మాయి దొరికితే చాలు.. కట్నాలక్కర్లేద”నే రోజులు వచ్చాయి. దాంతో అమ్మాయిలకే డిమాండ్ పెరిగింది.

వరకట్నాలు పోయి కన్యాశుల్కం రోజులు ఇంకా రాలేదు కానీ, కట్నాలు డిమాండ్ చేసే వరులు మాత్రం తగ్గారు.

తెలియని వాళ్లకి ఇదంతా అతిశయోక్తిగా ఉండొచ్చు కానీ, అబ్బాయిల పెళ్లిళ్ల కోసం వధువుని వెతుక్కుంటూ మ్యాట్రిమోనీ సైట్లల్లో తొంగిచూసే తల్లిదండ్రులకి కళ్లు బయర్లు కమ్ముతున్నాయి. తమ కొడుకు అమెరికాలో హెచ్ 1 బి మీద ఉంటూ ఉద్యోగం చేసుకుంటున్నాడని చెబితే చాలు అమ్మాయిలు క్యూ కడతారు అనుకునే వాళ్లకి చుక్కెదురవుతోంది.

కేవలం అమెరికా ఉద్యోగం సరిపోదంటున్నారు అమ్మాయిలు. ఫ్యామిలీ ఫైనాన్షియల్ స్టాటస్ లోనూ, చదువులోనూ, అందచందాల్లోనూ జస్ట్ యావరేజ్ అనిపించే అమ్మాయిలు అమెరికాలోనూ, ఇండియాలోనూ సొంత ఇళ్లు ఉండాలంటున్నారు. లేదా కనీసంలో కనీసం 10-15 ఎకరాల పొలమైనా ఉండాలట. ఈ తరహా అమ్మాయిల తల్లిదండ్రుల్లో చాలామందికి సొంత ఫ్లాట్ కూడా ఉండట్లేదన్నది ఇక్కడ కఠిన వాస్తవం. అబ్బాయిల తల్లిదండ్రులు నచ్చిన సంబంధం కోసం ఒక ఏడాది కాలయాపన చేసి వెనక్కి వచ్చి చూస్తే ఈ రకం అమ్మాయిల్లో సగం మందికి పెళ్లిళ్లు కుదిరిపోతున్నాయి. అంటే వాళ్లకి కావాల్సిన వరులు దొరికేస్తున్నారని అనుకోవాలి.

ఇక కొద్దో గొప్పో ఆస్తి ఉండి, అందచందాలు కూడా ఉంటే ఇక ఆ అమ్మాయిల కోరికలు అన్నీ ఇన్నీ కావు. పదుల కోట్లల్లో ఆస్తులు, విల్లాలు, అమెరికాలో టాప్ యూనివెర్సిటీ బ్యాక్ గ్రౌండ్ ఉండి టాప్ లెవెల్లో జాబ్ ఉన్న అబ్బాయిలు మాత్రమే కాకుండా, కచ్చితంగా గ్రీన్ కార్డ్ వాళ్లు కావాలని కోరుకుంటున్నారు. ఆ రేంజ్ అబ్బాయిలు కూడా ఇలాంటి వాళ్ల కోసం వెతుక్కుని వచ్చి పోటీ పడి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.

లవ్ మ్యారేజీలైతే ఓకే కానీ, పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవాలంటే ఆ పెద్దలకి చుక్కలు కనిపిస్తున్నాయి.

ఇక ఇప్పుడు పరిస్థితి మరీ కఠినంగా మారుతోంది. ట్రంప్ ప్రమాణస్వీకారం తర్వాత అమెరికాలో సీన్ మారుతోంది. హెచ్ 1 బి శాశ్వతంగా ఎత్తేస్తున్నాడని టాక్. అలాగే టాప్ యూనివర్సిటీల్లో సీట్ పొంది మెరిట్లో పాసైన విద్యార్థులకి మాత్రం సత్వరం గ్రీన్ కార్డ్ ఇచ్చేస్తానంటున్నాడు. అంటే వాళ్లకి తప్ప ఎ-క్లాస్ అమ్మాయిలు దొరికే పరిస్థితి ఉండదు ఇండియన్ మ్యారేజ్ మార్కెట్లో.

ఇక ఇందాక చెప్పుకున్న యావరేజ్ అమ్మాయిల పరిస్థితి కూడా మారనుంది. వాళ్ల కోరికలు తగ్గించుకోవాల్సిన పరిస్థితి రాబోతోంది. ఎన్నారై సంబంధాలే కావాలంటే కుదరదు. ఎందుకంటే హెచ్ 1 బి లేకపోతే ఎన్నారై పెళ్లికొడుకులే తగ్గిపోతారు కాబట్టి. ఉన్నంతలో ఇండియాలోనే పెద్ద ఉద్యోగం, మంచి సంపాదన ఉన్నవాళ్లని వెతుక్కోవచ్చు.

అమ్మాయిల్లో ఈ కాంప్రమైజ్ వల్ల అబ్బాయిలకి పెళ్ళిళ్లు ఈజీగా అవుతాయా అంటే చెప్పలేం. ఎందుకంటే మారిన సినారియోలో ఇండియాలో నిరుద్యోగులు పెరిగే అవకాశాలున్నాయి. కొద్దో గొప్పో ఉద్యోగాలుంటేనే పరిస్థితి కష్టంగా ఉంటే, ఇక ఉద్యోగం లేని అబ్బాయిల్ని చేసుకునేదెవరు? ఆస్తులుంటే కాస్త పర్వాలేదనుకోవాలి.

అందుకే ఈ పరిస్థితిని దాటాలంటే అమెరికాని వదిలేసి మరో దేశాన్ని వెతుక్కోవాలేమో భారతీయ యువకులు. అలా అనుకుందామనుకున్నా అమెరికా తర్వాత డిమాండ్ ఉన్న దేశం కెనెడా. అక్కడ జాబ్ మార్కెట్ అమెరికా అంత స్ట్రాంగ్ కాదు. ఆ తర్వాత యూకే. అది ఆల్రెడీ ఇబ్బందుల్లో ఉంది. అసలక్కడ చదివిన ఏ భారతీయుడైనా తిరిగి ఇంటికొస్తున్నాడే తప్ప అక్కడ జాబ్ పొందడం చాలా కష్టంగా ఉంది. ఇక మిగిలింది ఆస్ట్రేలియా. అక్కడ కూడా జాబ్ వీసాలు కఠినమయ్యాయి. మరి ఎప్పటికప్పుడు పెరిగిపోతున్న భారతీయ యువ జనాభాకి ప్రపంచంలో మంచి చోటెక్కడ? ట్రంప్ మొహమ్మీదే తలుపులు మూసేస్తుంటే ఎటుపోవాలి? కాలమే చెప్పాలి.

-పద్మజ అవిర్నేని

27 Replies to “ఇక మగపిల్లలకి పెళ్లిళ్లు అయినట్టే”

  1. పెళ్లిళ్లు ఏంటి , విడాకులు కూడా అయిపోతున్నాయి …

    ఇప్పుడు జరిగే పెళ్లిళ్లు లో , 50 శాతం విడాకులు అవుతున్నాయి . కావాలంటే మీ చుట్టూ చూసుకోండి

  2. చాతనైతే ఏదో విధంగా కాలేజీ రోజులనించే ఏదో ఒక అమ్మాయికి వల వేసి చేసుకోవాలి అంతే.. ఈ కాలం అధిక శాతం కుర్రాళ్ళు ఉద్యోగానికి పెళ్ళికి పనికిరారు…

  3. ముందుగా అబ్బాయిలు చెయ్యాల్సిన పని – కుల పిచ్చి వదిలించుకుని, మంచి అమ్మాయైతే చాలు ఏ కులమైనా పర్లేదు అనుకుంటే పెళ్లిళ్లు ఈజీగా అవుతాయి.

    1. అబ్బాయిలు ఎప్పుడో రెడీ. కానీ

      అమ్మాయి లె వొప్పుకోవడం లేదు.

      వాళ్ళ కొరికలకి అంతు లేదు మొర్రో అని అబ్బాయిల బాధ.

      నిజయితో గల అబ్బాయి ఉద్యోగం, ఇల్లు, పొలాలు, స్థలాలు, డబ్బు వున్నా కూడా వచ్చే అమ్మాయి నిజాయితీ గా వుండే అమ్మాయి గ్యారెంటీ అని లేదు అని అబ్బాయిల గోల.

      1. అంత లేదు బ్రో. నేను ఎన్నారైని. ఇక్కడ ఉండే చాలామంది కుర్రాళ్లని చూస్తున్నా కదా – అమ్మాయికి మంచి ఉద్యోగం ఉండాలి, భార్య సంపాదననతో మనం మేడలు కట్టాలి – ఇవే ఆలోచనలు. ఉద్యోగం చెయ్యడానికి సరిపడే చదువు లేదు అంటే చాలు ఆ అమ్మాయి ఎంత అందంగా ఉన్నా, బుద్ధిమంతురాలు అయినా సరే మాకొద్దు, నా ఒక్కడి సంపాదనతో కుటుంబాన్ని లాగలేను అంటున్నారు.

  4. No need to worry. India becomes superpower with AP becoming a trillion dollars economy by 2047. However much population growth, Modi-Babu ensures every person in a family gets a well paid job even foreigners will fly to India to get jobs. No need to worry about current situation of hundreds of youth competing for 15k job, this is temporary only. Nirmala Mary will such the blood from the working class and eradicate poverty in the country.

  5. “ఇంక మగ పిల్లల పెళ్లిళ్లు అయినట్టే ” ఏంటండీ? మగ పిల్లల పెళ్లిళ్లు మాత్రమే తగ్గిపోయి ఆడపిల్లల పెళ్లిళ్లు అయిపోతూ ఉంటాయా ఏంటి భవిష్యత్తులో ?

    “ఇంక పెళ్లిళ్లు అయినట్టే” అంటే సరిపోతుంది కదా?

  6. H1B ని పూర్తిగా రద్దు చెయటం సాద్యం కాదు రా అయ్యా! ఎ దెశం అయినా పూర్తిగా వర్క్ విసాలని క్యాన్సిల్ చెయటం సాద్యమెనా?

  7. Why do we need a buffalo at home when a man can buy milk outside. There will be peace in man when no women enters in to his life. No need to run for money, house or any other materialistic things

  8. If AI keeps on growing, then cheap labour from India cannot compete with it. Big corps don’t just need as many employees they once needed for routine processes. Eventually in next 5 years or so, the number of employees will keep getting cut anyways, so outsourced model is going to get even more squeezed. Better youth start looking for stable jobs rather than cheap IT jobs.

  9. ఇక్కడ మనం బీహార్ బెంగాల్ నార్త్ ఇండియా నుంచి వచ్చి ఇటుకల బట్టలలో పశువులను చూడటానికి వచ్చే కార్మికులను వద్దు ఇక్కడ వారితో చూపిద్దామంటే పనిజరుగుతుందా ఇది అంతే మన వాళ్ళను పంపిస్తే అక్కడ పనిచేసే వారెవరు అప్పుడు ఆ కంపెనీలు ఇండియాలో ఆఫీస్ లను పెట్టవలసి ఉంటుంది చెరువు మీద కోపగిస్తే మన పార్ట్ ఎండిపోతుంది

  10. Maa friends lo 20% foreign ammayilani chesukunnaru. USA, Australia, Europe lo settle ayyaru. So every NRI India ki vachi below average ammayini chesukovadaaniki Q kadatharu anukovadam kooda correct kadhu.

Comments are closed.