రూ.1200 అంటే కష్టం.. వినిపించిందా ‘మైత్రీ’

పుష్ప-2 కోసం నైజాంలో టికెట్ రేట్లను ఇష్టారాజ్యంగా పెంచేశారు. ప్రభుత్వ పెద్దల ‘చలవ’తో ప్రత్యేక జీవో తెచ్చుకొని, భారీగా మినహాయింపులు, కేటాయింపులు పొందారు. దీంతో సాధారణ ప్రేక్షకులు భగ్గుమన్నారు. Advertisement టికెట్ రేట్ల పెంపు…

పుష్ప-2 కోసం నైజాంలో టికెట్ రేట్లను ఇష్టారాజ్యంగా పెంచేశారు. ప్రభుత్వ పెద్దల ‘చలవ’తో ప్రత్యేక జీవో తెచ్చుకొని, భారీగా మినహాయింపులు, కేటాయింపులు పొందారు. దీంతో సాధారణ ప్రేక్షకులు భగ్గుమన్నారు.

టికెట్ రేట్ల పెంపు విషయం బయటకొచ్చిన వెంటనే యూనిట్ పై అసంతృప్తి చెలరేగింది. మరీ ముఖ్యంగా నిర్మాతలపై సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు జనం. అయితే అదంతా సోషల్ మీడియాలో కాబట్టి, నిర్మాతలు ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు.

తమకు బయట ఎక్కడా అలాంటి ప్రతికూలత, వ్యతిరేకత కనిపించలేదని నిర్మాతలు వాదించుకోవచ్చు. కానీ ఇప్పుడా అవకాశం కూడా లేదు. ఏకంగా పుష్ప-2 ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లోనే నిర్మాతల మొహం మీద ఫ్యాన్స్ అడిగేశారు.

రాత్రి జరిగిన పుష్ప-2 ఫంక్షన్ లో మాట్లాడ్డానికి నిర్మాత నవీన్ మైక్ అందుకున్నారు. 2 ముక్కలు మాట్లాడి మమ అనిపించారు. మైక్ ను పక్కనే ఉన్న మరో నిర్మాత రవికి ఇవ్వబోయారు. సరిగ్గా అప్పుడే మొదలైంది జనంలోంచి అలజడి. “ఈ టికెట్ రేట్లు ఏంటి.. 1200 అంటే చాలా కష్టం.” అంటూ అరవడం మొదలుపెట్టారు జనం.

దీంతో నిర్మాతలు బిత్తరపోయారు. అంత జనం ముందు, ఎదురుగా అల్లు అర్జున్ ను పెట్టుకొని ఏం మాట్లాడాలో వాళ్లకు అర్థం కాలేదు. కొన్ని క్షణాల పాటు సైలెంట్ అయి, ఆ వెంటనే తేరుకొని నిర్మాత రవి ఇంకేదో మాట్లాడారు. అలా ఆ విషయాన్ని సైడ్ చేశారు.

టికెట్ రేట్లు భారీగా పెంచడంపై సాధారణ ప్రేక్షకులు మాత్రమే ట్విట్టర్ లో గోల చేస్తున్నారని, కోప్పడుతున్నారని నిర్మాతలు అనుకోవచ్చు. కానీ ఇప్పుడు స్వయంగా అల్లు అర్జున్ ఆర్మీ సభ్యులు, అంటే అతడి ఫ్యాన్స్ ఇలా ఈవెంట్ లో అరవడంతో అసంతృప్తి ఏ స్థాయిలో ఉందో నిర్మాతలకు అర్థమైంది.

ఇప్పటికిప్పుడు ఈ జీవో అనే ప్రత్యేక ఆయుధంతో నిర్మాతలు అందినకాడికి డబ్బులు పిండుకోవచ్చు కానీ ఇదే పద్ధతిని ఇతర నిర్మాతలు కూడా ఫాలో అయితే కూర్చున్న కొమ్మను నరుక్కోవడమే అవుతుంది.

43 Replies to “రూ.1200 అంటే కష్టం.. వినిపించిందా ‘మైత్రీ’”

  1. మొదటి వారం వెళ్లకుండా వుంటే సరి.

    తల మీద గన్ పెట్టీ బలవతం చెయ్యడం లేదు కదా, మొదటి వారం లో తప్పనిసరిగా చూడాలి అని.

    బాగా డబ్బుతో బలిసిన వాళ్ళు మాత్రమే వెళతారు, 1200 వందల టిక్కెట్ అంటే

    1. correct . what you said is true .But a hero charging 200cr as a fees for his movie and then now charging that amount on public as 1200 per ticket is wrong way of business.off course people should not watch his movies

    2. First week kaadhu only premier show ante release roju mundhu roju night show ke 1200. Antha petti choose fans elaano untaaru. So ticket dabbulu takkuva petti goodwill moota kattukuni dhaantho emaina pillalalaki destination marriage chestaara enti

    3. డై హార్ట్ ఫ్యాన్స్ ఉంటారు కదా తల్లి దండ్రుల్ని చూడరు గానీ మా అన్న సినిమా అని పడి చస్తారు నా కొడుకులు వాడి ఏదో ఈడి ఇంట్లో పుట్టినట్లు

  2. మా అన్నయ్య పాలనలో సినిమా రీలీజ్ అయి ఉంటే ఈ కష్టాలు ఉండేవి కావు..10,20,50 రూపాయలు మాత్రమే ఉండేవి కదా..

  3. But a hero charging 200cr as a fees for his movie and then now charging that amount on public as 1200 per ticket is wrong way of business.off course people should not watch his movies. How come he can charge 200 cr as a fees is the question. i am not saying govt should interfere but i am saying fees peole should not watch

  4. ఇది చాలా దారుణం GA గారు మొన్నటిదాకా ఎదో ఒక వంక తో బన్నీ గారిని మీ ఆస్థానహీరో లాగా లేపావు ఈరోజు నువ్వు కూడా ఇలా అంటే ఎలా? అసలే నిన్న అల్లు అర్జున్ గారు మాట్లాడే సమయానికి జనాలు లేక గ్రౌండ్ బోసి పోయింది సోషలమీడియా లో అవే వీడియో లు ట్రెండింగ్, ఇప్పుడు bhAAii కి మీ సపోర్ట్ కావాలి

  5. ఇంటర్నేషనల్ కదా

    300 కోట్ల రెమ్యూనరేషన్ లేకపోతే అవమానం.

    పైగా ఈసారి హాలీవుడ్ కు గురిచూసి కొట్టెయ్యాలి ఆస్కార్.

  6. డబ్బులు రావడం కోసం టికెట్ పెంచుతున్నారు కదా అంటే సినిమా లో ఆ సత్తా లేకపోవాలి అందుకే ఫస్ట్ డే నీవు మొత్తం కలెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు కాబోలు , ఫ్యాన్స్ ఉన్నారు గా వాళ్ళు అంతేనా కొనేస్తారు గా జనాలను పిచ్చెల్లోని చేసి ఆడేసుకుంటున్నారు

  7. సత్తా ఉంటే 100డేస్ ఆడించుకోవచ్చు గా అది సాధ్యం కాక 1st week లోనే మొత్తం గుంజెయ్యాలని ప్లాన్ చేసి నట్లు ఉన్నారు. ఈ ఫ్యాన్స్ కూడా కాన్సెప్ట్ చూడరు మన హీరో ఐతే చాలు అనుకున్నంత వరకు ఇలానే ఉంటుంది

  8. ప్రభుత్వం కూడా ప్రజలు కోసం కాకుండా సినీరంగం కోసం, వాళ్ళ బిజినెస్ పెంచుకోవడం కోసమే పనిచేస్తుంది ప్రజలకి మాత్రం ఏదో చేసినట్లు కబుర్లు చెప్తారు నా కొడుకులు

  9. పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి మేలు చేస్తా అని చెప్పి ఇప్పుడు ఏమో సినిమా టికెట్స్ పెంచేసి వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటున్నారు,ఓట్లు వేసి గెలిపించినందుకు మా ఫ్యాన్స్ కి బాగానే బుద్ధి చెప్పేరు సర్,

    1. సినిమా చూడకండి సర్. రేట్లు తగ్గాక చూడండి. ఎవరు మనమీద gun petti ఇప్పుడే చూస్తావా చస్తావా అని బెదిరించలేదు కదా..

      ప్రశాంతంగా టికెట్ రేట్లు తగ్గాకే చూడండి.

      1. గురువు గారు అలా ఎలా చెప్పగలం ఏ వ్యక్తికైనా సినిమా మొదట్లోనే చూడాలి అన్పిస్తుంది. అది సహజం. వీళ్ళు ఇలా దోచుకుంటే చాలా తప్పు

      2. పది రూపాయల బిస్కెట్ పాకెట్ మల్లు మార్ఫింగ్ అయితే పది రూపాయలకే కొంటాడు… అదే అతని అభిమానులు అయితే 1200 కు కొంటారు… చిన్న లాజిక్…. వాళ్ళు అలా కొంటేనే కదా…. వంద కోట్లు లేదా వెయ్యి కోట్లు వెనుక వేసుకునేది….

        1. అది కొనే వాడి విచక్షణ ను బట్టి ఉంటుంది.

          For example నేను 2024 లో ఈ రోజు వరకు థియేటర్ లో చూసిన సినిమాలు రెండే రెండు. ఒకటి హనుమాన్ అది కూడా గొప్ప సినిమా అని నాకు నచ్చి… చూడాలని… చూడలేదు. మా పాప కోసం థియేటర్ లో చూశా. రెండు కల్కి… Theatrical experience కోసం … నా విచక్షణ తో థియేటర్ లో చూశా. అది కూడా రేట్లు తగ్గాక. మిగతా అన్నీ OTT నే…

Comments are closed.