జనాభా గురించి వర్రీ అవుతున్నారు!

కొంతమంది నాయకులు జనాభా గురించి వరీ అవుతున్నారు. వాళ్ళు బాధపడేది అధిక జనాభా గురించి కాదు. జనాభా పెరుగుదలలో ఇండియా చైనాను మించిపోతోందని కాదు. జనాభా ఇంకా పెరగాలంటున్నారు. కొందరు పొలిటికల్ గా మాట్లాడుతుంటే,…

కొంతమంది నాయకులు జనాభా గురించి వరీ అవుతున్నారు. వాళ్ళు బాధపడేది అధిక జనాభా గురించి కాదు. జనాభా పెరుగుదలలో ఇండియా చైనాను మించిపోతోందని కాదు. జనాభా ఇంకా పెరగాలంటున్నారు. కొందరు పొలిటికల్ గా మాట్లాడుతుంటే, కొందరు సమాజం గురించి మాట్లాడుతున్నారు.

జనాభా నియంత్రణ, దాని ద్వారా ఎదురయ్యే పరిణామాల గురించి చాలా కాలంగా తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాలు ఏదో ఒక రూపంలో తమ స్వరాన్ని వినిపిస్తూనే ఉన్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాల పునర్విభజన ప్రస్తావన వచ్చినప్పటి నుంచి ఇది ఇంకాస్త పెరిగింది.

అమరావతిలో ప్రజలు వృద్ధులు అవుతున్నారని, రాష్ట్రానికి అదొక సమస్యగా మారనుందని చంద్రబాబు అన్నాడు. ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలను కనాలని మరొకసారి పిలుపునిచ్చాడు. ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలను కనకుంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి ‘అనర్హులుగా’ చేస్తూ చట్టం కూడా తీసుకొస్తామన్నాడు. స్టాలిన్ అయితే మరో అడుగు ముందుకేసి ఒక్కో జంట పదహారుమంది పిల్లలను ఎందుకు కనగూడదు అని ప్రశ్నించాడు.

జనాభా నియంత్రణ మీద చంద్రబాబు నాయుడు, స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేయడం ఇదే తొలిసారి కాదు. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే జనాభా నియంత్రణలో ముందున్న దక్షిణాది రాష్ట్రాలు డీలిమిటేషన్ వల్ల నష్టపోతాయనే ఆందోళన ఎప్పటి నుంచో ఉంది. కేంద్రం, జనాభా ఆధారంగా నిధులను రాష్ట్రాలకు పంచడం మీద ఎంతో కాలంగా దక్షిణాది రాష్ట్రాలు, ముఖ్యమంత్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏజింగ్ గురించి చంద్రబాబు ప్రస్తావించగా, పార్లమెంటులో ప్రాతినిధ్యం గురించి స్టాలిన్ మాట్లాడారు. తక్కువ జనాభా కారణంగా దక్షిణాదికి అన్యాయం జరుగుతోందన్న కోణంలో స్టాలిన్ మాట్లాడాడు.

జనాభా నియంత్రణ విధానాలు అమలు చేస్తున్న దక్షిణాదికి అన్యాయం జరుగుతోందన్నాడు. తక్కువ జనాభా కారణంగా చట్ట సభల్లో దక్షిణాదికి ప్రాతినిధ్యం తగ్గిందని , దీనివల్ల కేంద్రం నుంచి వచ్చే నిధులు తగ్గుతున్నాయని అన్నాడు. దక్షిణాదిలో జనాభా తగ్గడంవల్ల ఉత్తరాది లాభపడుతోందని చెప్పాడు. అందుకే ప్రతి కుటుంబం ఎక్కువమంది పిల్లలను కనాల్సిన అవసరం ఉందని స్టాలిన్ చెప్పాడు.

తాజాగా ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ కూడా ప్రతి కుటుంబం ముగ్గురు పిల్లలను కనాలని అన్నాడు. జనాభా తగ్గడంవల్ల చివరకు సమాజమే అంతరిస్తుందని అన్నాడు. జనాభా తగ్గడంవల్ల భాషలు అంతరిస్తాయని, సంస్కృతి నశిస్తుందని ఆవేదన వ్యక్తం చేశాడు. వృద్ధుల జనాభా పెరుగుతోంది అంటే పని చేసే జనాభా తగ్గుతోందని అర్థం. ఇది ప్రధానంగా మానవ వనరుల కొరతకు దారి తీస్తుంది. సౌత్ కొరియా, చైనా, జపాన్ వంటి దేశాలు ఇప్పటికే ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. పెళ్లి చేసుకున్న వారికి ఆర్థిక ప్రోత్సాహకాలను సౌత్ కొరియా ప్రకటించింది. జపాన్‌ అయితే మ్యారేజ్‌ బడ్డెట్‌ కేటాయించింది.

దక్షిణాదిలో జనాభా పెరుగుదల ఆగిపోవడం వల్ల పార్లమెంటులో ప్రాతినిధ్యం తగ్గుతుందనే ఆందోళనలున్నాయి. తమిళనాడు ముఖ్యమత్రి ఎంకే స్టాలిన్ చెబుతోంది అదే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటకల్లో పెరిగే జనాభా 2.9 కోట్లు. అంటే ఇది మొత్తం పెరిగిన జనాభాలో కేవలం 9శాతం. జనాభా సంఖ్యను బట్టే అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్య ఉంటుంది. ఆ సంఖ్య తగ్గితే రాజకీయ బలం తగ్గిపోతుంది.

ఎక్కువ సీట్లు ఉన్న రాష్ట్రాలు తమ డిమాండ్లు సాధించుకోవడంలో ముందుంటాయి. నాయకులు ఎక్కువమంది పిల్లలను కనాలని చెబుతున్నారుగానీ అది సాధ్యమయ్యే పనికాదు. పాత కాలంలో ఒక్కో కుటుంబంలో పది మంది పిల్లలకంటే ఎక్కువమంది సంతానం ఉండేవారు. ఆ కాలంలో జీవన వ్యయం తక్కువ కాబట్టి ఎలాగోలా కష్టపడి పోషించారు.

కానీ ఈ కాలంలో అది సాధ్యం కాదు. ఇప్పుడు కాస్ట్ లివింగ్ పెరిగిపోయింది. ఈ ఆధునిక కాలంలో ఎక్కువమంది ఒక్క సంతానంతో సరిపెడుతున్నారు. ఎక్కువమంది పిల్లలను కనాలని చెబుతున్న చంద్రబాబుకు ఎంతమంది పిల్లలు?

41 Replies to “జనాభా గురించి వర్రీ అవుతున్నారు!”

  1. యూరప్ అమెరికా ఆస్ట్రేలియా యుకె జపాన్ లాంటి చోట్ల స్థానిక ప్రజలు పెళ్ళిళ్ళు , పిల్లల్ని కనడం మానేసి జనాభా తగ్గించుకుంటూ వుంటే, అక్కడికి వలస పేరుతో వెళ్లిన ముస్లిం ప్రజలు అదే పనిగా పిల్లలని కంటూ “జనాభా జీహాద్ ” మార్గం ద్వారా ఆ దేశాల్లో ఇస్లాం మత పాలన తేవాలి అని ట్రై చేస్తున్నారు.ఇప్పటికే చాలా చోట్ల స్థానిక ప్రజల కంటే జనాభా పెంచుకుని ఇస్లాం నీ నిర్బంధం గా స్థానికుల మీద రుద్దుతున్నారు అని న్యూస్ లో బాహాటంగా చెబుతున్నారు.

    1. ఇండియా లాంటి చోట్ల పలానా ఏరియా లో ఒక్కసారిగా ముస్లిం జనాభా పెరిగితే , ఆ ఏరియా లో వచ్చే మార్పులు, అక్కడ మిగతా మతాల వారి పరిస్దితి ఏంటి అనేది అందరికీ తెలుసు.

  2. రాజకీయాలు, పార్లమెంటు ప్రాతినిద్యం, నిదులు కాదు… పిండాకూడు కాదు! ఇదెదొ రాజకీయం లా చూపించాలి అని నీ తుత్తి ఒకటి!! జనాబా తగ్గినా కూడా కొంచం కొంచం గా తాగుతూ వెళ్ళాలి. ఒకెసారి భారీగా తగ్గిపొతె ప్రమాదం.

    .

    చైనా లొ one child policy వల్ల ఒక జంట, తమ పిల్లలని, తమ ఇద్దరి తల్లి తండ్రులని (2×2), బ్రతికె ఉంటె తమ తాత నాయనమ్మలని (2×4) చూసుకుకొవాలిసి ఉస్తుంది.

    1 Couple has look after….

    1 (child) + 4 (parents of self and spouse) + 8 (grand parents of self and spouse) = 13 people.

      1. ముందె ఇంత పెరగకుండా చూసుకొవాల్సింది. ఇప్పుడు ఒక్కసారి గా తగ్గితె కష్టమె!

  3. ఒకరిని చూసుకోవడానికే పులుసు కారిపోతుంది. ఇద్దరుకి ఐతే దూ…. ల… తీరుతుంది. అంతకన్నా ఎక్కువ ఐతే అంతే కధ. .

  4. ఒక్కో బిడ్డకి ఐదేళ్ల వరకు నెలకి ఐదు వేలు.. పదేళ్ళ వరకు నెలకి పది వేలు.. పదిహేనేళ్ళ వరకు నెలకి పదిహేను వేలు.. ఇరవై ఏళ్ల వరకు నెలకి ఇరవై వేలు.. ఇలా ఇస్తే కనొచ్చు…

    1. ఈమధ్యనే ఎక్కడో రాశారు.

      ఏదో యూరోప్ దేశం లో పిల్లల్ని కన్న తల్లి కి,

      2 సంవత్సరాలు ఉద్యోగం నుండి సెలవులు,

      పైగా లక్ష రూపాయల డబ్బు ఇస్తారు అంట.

      అలాంటి దేశానికి వెళితే సరి.

  5. జనాభా పెరిగిందా తరిగిందా అన్నది కాదు ముఖ్యం.. ఎలాంటి జనాభా పెరిగింది తరిగింది అన్నది ముఖ్యం…

  6. హిందీ జనాభా పెరిగినా వారు ఎక్కడికంటే అక్కడకొచ్చి ఆ ప్రాంతపు భాష నేర్చుయకుండా అహంకారపూరితంగా హిందీని మాట్లాడుతూ తమకు పని కల్పించిన వారికి బలవంతపు హిందీ నేర్చుకునేలా చేస్తారు. అలాంటిది ప్రాంతీయ విద్వేషాలతో, సహజ వనరుల కోసం నిత్యం కొట్టుకునే ద్రావిడ రాష్ట్రాల్లో జనాభా పెరిగితే వారికెలాగూ చిన్న పనులంటే చిన్నతనం కనుక ఇక్కడా చిరుద్యోగాలు చేయలేరు, ఉత్తరాదికి పోయి అక్కడ వారి మురికి అలవాట్ల మధ్య జీవించనూ లేడు. ఏ Americca వాడో అయితే వివక్ష చూపించే కేంద్రం ఉంటే దానికి civill warr ద్వారానే తేల్చుకుంటాడు. Unitedd Kingdomm వాడు referendumm ద్వారా ప్రజల అభీష్టాలు తెలుసుకుంటాడు. India వాడు మాత్రం IPL వేలాన్ని చూస్తూ parliamentt లో వలె tea కొట్టు వద్ద సొల్లు కొట్టుకుంటాడు.

      1. Bro, that is a recent thought, Babu had kids 40 years ago. Lokesh had kids 15 years ago. Ask your kids to have more kids if they can afford. Take it positively. Not everything is political.

        1. Lokesh sir is still youth. Can easily have 3 more kids. Go and advise him please. Only person following this advise really well is our Pawan sir like Elon musk.

  7. సర్రోగేసీ నిబంధనలను సడలించాలి పెళ్లి కానీ వాళ్ళు కు కూడా ఈ పద్దతి ద్వారా అవకాశం ఇవ్వాలి భార్యాభర్తలు విడిపోయిన కేసు లు లో పిల్లలు దగ్గర లేని వారికీ కూడా అవకాశం ఇవ్వాలి

  8. 9 నిమిషాల ఆనందం కోసం 9 నెలలు ,ఇద్దరి ముగ్గుర్నీ మొయ్యటానికి పెంచటానికి ఏ ఆడది రెడీ గా లేదు ఈ జనరేషన్ లో..ఆల్రెడీ చైనా లో అంతా following

  9. రాబోయే తరంలో ఫెర్టిలిటీ సెంటర్ల ద్వారానే పిల్లల్ని కనే దారుణ పరిస్థితులు ఏర్పడతాయి.. సహజంగా వచ్చే ప్రెగ్నెన్సీలు తగ్గిపోతున్నాయి..దంపతులు పెళ్ళయిన వెంటనే ఒక పిల్లో పిల్లాడిన కనేస్తే గానీ ఈ ఇబ్బందులు తగ్గవు. లేదంటే పిల్లల్ని పెంచడమే కాదు.. పిల్లల్ని కనడం కూడా కాస్ట్ లీ. అంతా బాగానే రాసావు కానీ లాస్ట్ లో సీబీన్ గురించి ఎందుకు రా ల ఫు ట్ లం జా కొ డ కా .. ఆ టైం లో ఇంటికి ఒక్కరు లేక ఇద్దరు ముద్దు అని చెప్పారు . ఇప్పుడు జనాభా తగ్గుతుంది కాబ్బట్టి కనమని చెబుతున్నారు .

  10. డబ్బు వున్నవాళ్ళు ఏమైనా ఎన్ని ఐన చెప్తారు. మోసే వాడికి తెలుస్తుంది బరువు. బతకడానికి కష్టం అవుతుంది అంటూ వుంటే 3 పిల్లల్ని ఎలా పెంచాలి? Food costly, rentals ekuuva, transport cost అన్ని ఎక్కువ. Income చాలా తక్కువ

Comments are closed.