ఏడాదిగా స‌హ‌జీవ‌నం.. జంట ఆత్మ‌హ‌త్య‌

ఏడాదిగా స‌హ‌జీవ‌నం చేస్తున్న జంట‌.. ఇవాళ ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఈ దుర్ఘ‌ట‌న గాజువాక పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోని అక్కిరెడ్డిపాలెంలో చోటు చేసుకుంది. పోలీసుల క‌థ‌నం మేర‌కు వివ‌రాలిలా ఉన్నాయి. Advertisement అమ‌లాపురానికి చెందిన…

ఏడాదిగా స‌హ‌జీవ‌నం చేస్తున్న జంట‌.. ఇవాళ ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఈ దుర్ఘ‌ట‌న గాజువాక పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోని అక్కిరెడ్డిపాలెంలో చోటు చేసుకుంది. పోలీసుల క‌థ‌నం మేర‌కు వివ‌రాలిలా ఉన్నాయి.

అమ‌లాపురానికి చెందిన పిల్లి దుర్గారావు, సాయి సుష్మిత ఏడాదిగా విశాఖ‌లోని వెంక‌టేశ్వ‌ర‌కాల‌నీలో స‌హ‌జీవ‌నం చేస్తున్నారు. గ‌తంలో హైద‌రాబాద్‌లో సాయి సుష్మిత ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేసేది. దుర్గారావు కేట‌రింగ్ య‌జ‌మాని. వీళ్లిద్ద‌రి మ‌ధ్య ప‌రిచ‌యం ప్రేమ‌గా మారింది. వైజాగ్‌లో క‌లిసి జీవిస్తున్న సాగిస్తున్న వాళ్లిద్ద‌రి మ‌ధ్య ఏం జ‌రిగిందో ఇంకా తెలియ‌డం లేదు.

వెంక‌టేశ్వ‌ర‌కాల‌నీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో మూడు నెల‌లుగా వుంటున్నారు. మూడో అంత‌స్తు పైనుంచి మంగ‌ళ‌వారం ఉద‌యం దుర్గారావు, సుష్మిత దూకి ప్రాణాలు కోల్పోయారు. ఆత్మ‌హ‌త్య‌కు దారి తీసిన ప‌రిస్థితుల‌పై విచారిస్తున్న‌ట్టు పోలీసులు తెలిపారు.

అయితే ఇంట్లో వ‌స్తువులు చెల్లాచెదురుగా ప‌డి వుండ‌డంతో ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ జ‌రిగి వుంటుంద‌ని భావిస్తున్నారు. ప్ర‌స్తుతం కేసు ద‌ర్యాప్తులో వుంది. మృతుల కుటుంబాల్లో విషాదం చోటు చేసుకుంది.

17 Replies to “ఏడాదిగా స‌హ‌జీవ‌నం.. జంట ఆత్మ‌హ‌త్య‌”

  1. ఆ జగన్ గాడిని అబద్దాలతో పొగడటం కంటే ఈ చావు కబుర్లే నయం గుడ్డంద్రా…

      1. aa కామెడీ పూస్కీ గాడిని చూసి జనం వుయ్యటం తిట్టటం చూసాం/చూస్తాం కానీ, భయపడటం ఇంక చూడం.. ఇది పక్కా…

Comments are closed.