సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్

డిసెంబర్ వచ్చిందంటే రజనీకాంత్ ఫ్యాన్స్ రెడీ అయిపోతారు. తమ తళైవ నుంచి అప్ డేట్స్ వస్తాయని ఆశగా ఎదురుచూస్తుంటారు. రజనీ కూడా ఎప్పుడూ ఫ్యాన్స్ ను నిరుత్సాహపరచలేదు. ఈసారి పుట్టినరోజుకు కూడా సూపర్ స్టార్…

డిసెంబర్ వచ్చిందంటే రజనీకాంత్ ఫ్యాన్స్ రెడీ అయిపోతారు. తమ తళైవ నుంచి అప్ డేట్స్ వస్తాయని ఆశగా ఎదురుచూస్తుంటారు. రజనీ కూడా ఎప్పుడూ ఫ్యాన్స్ ను నిరుత్సాహపరచలేదు. ఈసారి పుట్టినరోజుకు కూడా సూపర్ స్టార్ నుంచి ట్రీట్ రెడీ అయింది.

అయితే ఈసారి ఒకటి కాదు, ఏకంగా 2 సర్ ప్రైజ్ లు ఇవ్వడానికి రెడీ అవుతున్నారు రజనీకాంత్. అదే ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న కూలీ సినిమా నుంచి ఎలాగూ ఏదో ఒక అప్ డేట్ ఉంటుందని అభిమానులు ఫిక్స్ అయ్యారు. కానీ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ జైలర్-2 నుంచి కూడా అప్ డేట్ ఇవ్వబోతున్నారు.

ముందుగా కూలీ విషయానికొస్తే.. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే గ్లింప్స్ రిలీజైంది. దానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు రజనీకాంత్ పుట్టినరోజు కానుకగా మరో వీడియో విడుదల చేయడానికి రెడీ అవుతోంది యూనిట్.

కూలీ సినిమాలో నాగార్జున విలన్ గా కనిపించబోతున్నాడు. కీలక పాత్రలో శృతిహాసన్ నటిస్తోంది. బర్త్ డే కు విడుదల చేసే వీడియోలో రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఇక రజనీకాంత్ కెరీర్ లో ఈమధ్య కాలంలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన మూవీ జైలర్. ఈ సినిమా సీక్వెల్ పనులు సాగుతున్నాయి. ప్రస్తుతం నెల్సన్ ఈ పనిమీదే ఉన్నాడు. ఈ మూవీకి సంబంధించి కూడా పుట్టినరోజున క్రేజీ అప్ డేట్ ఇవ్వబోతున్నారు.

7 Replies to “సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్”

  1. కూలీ లో నాగార్జున విలన్ అని నీకు రజని కానీ నాగ్ కానీ చెప్పారా నువ్వు ని సోది సైట్

Comments are closed.