‘మైత్రీ’ కప్పులో ‘దేవి’ తుపాను చల్లారినట్టే..!

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలకు, దేవిశ్రీ ప్రసాద్ కు మధ్య వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. పుష్ప-2 సినిమా రీ-రికార్డింగ్ కోసం దేవిశ్రీని పాక్షికంగా పక్కనపెట్టి, తమన్ తో సహా మరో ఇద్దరు సంగీత…

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలకు, దేవిశ్రీ ప్రసాద్ కు మధ్య వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. పుష్ప-2 సినిమా రీ-రికార్డింగ్ కోసం దేవిశ్రీని పాక్షికంగా పక్కనపెట్టి, తమన్ తో సహా మరో ఇద్దరు సంగీత దర్శకుల్ని రంగంలోకి దించడంతో వివాదం మొదలైంది.

దీనిపై దేవిశ్రీ కూసింత అసంతృప్తి వ్యక్తం చేశాడు. సభాముఖంగానే నిర్మాతలను ఆక్షేపించాడు. ఆ తర్వాత నిర్మాతలు స్పందిస్తూ, వ్యవహారాన్ని తేలికపరిచే ప్రయత్నం చేశారు. మొత్తానికి ఈ వివాదం సమసిపోయినట్టు కనిపిస్తోంది.

తాజాగా మరోసారి మైత్రీ నిర్మాతలపై స్పందించాడు దేవిశ్రీ. వాళ్లంతా తన ఫ్యామిలీ అని చెప్పుకొచ్చాడు. “వాళ్ల బ్యానర్ పై మరో సినిమాకు వేరే మ్యూజిక్ డైరక్టర్ ను తీసుకుంటే, ఆ విషయాన్ని ముందే నాకు చెబుతారు. అంత క్లోజ్” అంటూ ప్రకటించుకున్నాడు.

రీసెంట్ గా రామ్ పోతినేనితో సినిమా స్టార్ట్ చేశారు మైత్రీ నిర్మాతలు. ఈ ప్రాజెక్టుకు దేవిశ్రీని కాదని, వేరే సంగీత దర్శకుల్ని తీసుకున్నారు. ఆ విషయాన్ని దేవిశ్రీ పరోక్షంగా ప్రస్తావించినట్టయింది.

మొత్తమ్మీద పుష్ప-2 సినిమా కోసం ఇతర సంగీత దర్శకుల్ని తీసుకున్న వ్యవహారం.. దేవిశ్రీకి నిర్మాతలకు మధ్య.. దేవిశ్రీ-బన్నీ మధ్య.. దేవిశ్రీ-సుక్కూ మధ్య పెద్దగా గ్యాప్ తీసుకురాలేదని విషయం స్పష్టమైంది.

6 Replies to “‘మైత్రీ’ కప్పులో ‘దేవి’ తుపాను చల్లారినట్టే..!”

Comments are closed.