హ‌రీశ్‌రావుపై ఫోన్ ట్యాప్ కేసు

రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌భుత్వాలు ప్ర‌త్య‌ర్థుల‌పై కేసులు న‌మోదు చేస్తున్నాయి. ఏదో ఒక ఫిర్యాదు రావ‌డ‌మో, చేయించ‌డ‌మో …ఆ త‌ర్వాత వెంట‌నే కేసులు న‌మోదు చేసి వేధించ‌డం స‌ర్వ‌సాధార‌ణ‌మైంది. కాక‌పోతే ఏపీతో పోల్చితే తెలంగాణ‌లో…

రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌భుత్వాలు ప్ర‌త్య‌ర్థుల‌పై కేసులు న‌మోదు చేస్తున్నాయి. ఏదో ఒక ఫిర్యాదు రావ‌డ‌మో, చేయించ‌డ‌మో …ఆ త‌ర్వాత వెంట‌నే కేసులు న‌మోదు చేసి వేధించ‌డం స‌ర్వ‌సాధార‌ణ‌మైంది. కాక‌పోతే ఏపీతో పోల్చితే తెలంగాణ‌లో కాస్త కేసుల సంఖ్య త‌క్కువే. ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం ప్ర‌కారం కేసులు న‌మోద‌వుతున్నాయ‌నే ఆరోప‌ణ‌ల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.

తాజాగా తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీల‌క నాయ‌కుడు హ‌రీశ్‌రావుపై ఫోన్ ట్యాప్ కేసు న‌మోదు కావ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. కాళేశ్వ‌రం ప్రాజెక్టులో అవినీతికి సంబంధించి మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రి హ‌రీశ్‌రావుపై కాంగ్రెస్ నేత‌లు తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు సంబంధించి మామాఅల్లుళ్ల‌పై కేసు న‌మోదు అవుతుంద‌ని అనుకుంటే, ఊహించ‌ని విధంగా హ‌రీశ్‌పై ఫోన్ ట్యాపింగ్ అంశం తెర‌పైకి రావ‌డం గ‌మ‌నార్హం.

త‌న ఫోన్ ట్యాప్ చేశారంటూ బాచుప‌ల్లికి చెందిన చ‌క్ర‌ధ‌ర్‌గౌడ్ పంజాగుట్ట పోలీస్‌స్టేష‌న్‌లో హ‌రీశ్‌పై ఫిర్యాదు చేశారు. హ‌రీశ్‌తో పాటు టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావును కూడా కేసులో చేర్చారు. దీంతో వీళ్లిద్ద‌రిపై కేసు న‌మోదు చేసిన‌ట్టైంది. కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని సీరియ‌స్‌గా తీసుకున్న సంగ‌తి తెలిసిందే.

ఈ కేసులో ప‌లువురు పోలీస్ అధికారుల్ని అరెస్ట్ కూడా చేశారు. మ‌రి కొంద‌రు దేశం విడిచి వెళ్లారు. తాజాగా హ‌రీశ్‌రావుపై కేసు న‌మోదు కావ‌డంతో అరెస్ట్ వ‌ర‌కూ వ్య‌వ‌హారం వెళ్తుందా? లేక విచార‌ణ‌కే ప‌రిమితం అవుతురా? అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

6 Replies to “హ‌రీశ్‌రావుపై ఫోన్ ట్యాప్ కేసు”

Comments are closed.