అనంత‌, ఆదిపై జేసీవి స‌భ్య‌త లేని మాట‌లు!

అధికారంలో ఉన్నామ‌ని ఏం చేసినా చెల్లుతుంద‌ని అనుకుంటే, ఎవ‌రూ చూస్తూ ఊరుకోర‌ని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. ఎప్పుడో ఒక‌సారి తిరుగుబాటు వ‌స్తుంద‌ని ఆయ‌న అన్నారు. Advertisement బెల్టు షాపులు, ఇత‌ర‌త్రా అంశాల‌పై…

అధికారంలో ఉన్నామ‌ని ఏం చేసినా చెల్లుతుంద‌ని అనుకుంటే, ఎవ‌రూ చూస్తూ ఊరుకోర‌ని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. ఎప్పుడో ఒక‌సారి తిరుగుబాటు వ‌స్తుంద‌ని ఆయ‌న అన్నారు.

బెల్టు షాపులు, ఇత‌ర‌త్రా అంశాల‌పై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని కూట‌మి నేత‌లు చెబుతున్నార‌న్నారు. కానీ ఏ గ్రామం చూసినా బెల్టు షాపులు క‌నిపిస్తున్నాయ‌న్నారు. ప‌దిరోజులుగా తాడిప‌త్రి మున్సిప‌ల్ చైర్మ‌న్ జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి ఇటు త‌మ పార్టీ నాయ‌కుడు అనంత వెంక‌ట్రామిరెడ్డి, అటు జ‌మ్మ‌ల‌మ‌డుగు ఎమ్మెల్యే ఆదినారాయ‌ణ‌రెడ్డిపై స‌భ్య‌త లేకుండా మాట్లాడుతున్నార‌ని పెద్దారెడ్డి విమ‌ర్శించారు.

తాడిప‌త్రి మున్సిప‌ల్ అభివృద్ధి పేరుతో వ్యాపార‌స్తుల‌ను చందాలు అడుగుతున్న‌ట్టు జేసీపై ఆయ‌న ఆరోపించారు. ఇది త‌మ‌కు సంతోషాన్ని ఇస్తోంద‌న్నారు. తాడిప‌త్రిని అభివృద్ధి చేస్తార‌నే న‌మ్మ‌కంతోనే వ్యాపార‌స్తులు కూడా స‌హ‌క‌రిస్తున్నార‌న్నారు. కానీ మూడు వ్య‌వ‌స్థ‌ల్ని మాత్రం జేసీ చందాలు అడ‌గ‌డం లేద‌న్నారు. అందులో నువ్వేమైనా భాగ‌స్వామిగా ఉన్నావా? లేక నీ వ‌ల్లే అవ‌న్నీ జ‌రుగుతున్నాయా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు.

మ‌ట్కా, గ్యాంబ్లింగ్‌, గంజాయిల‌లో జేసీ భాగం అడ‌గ‌లేద‌న్నారు. వీటిపై ఎన్నోసార్లు తాను ఎస్పీకి ఫిర్యాదు చేసినా చ‌ర్య‌లే లేవ‌న్నారు. ఎమ్మెల్యే లేదా ఆయ‌న తండ్రి ఏమైనా ఆడిస్తున్నాడో? తాడిప‌త్రి అభివృద్ధి కోసం సొంత నిధుల కింద ఈ సొమ్ము తీసుకొచ్చి పెడ్తారేమో అనుకుంటున్న‌ట్టు పెద్దారెడ్డి వ్యంగ్య ఆరోప‌ణ‌లు చేశారు. వీటిపై జేసీ వివ‌ర‌ణ ఇవ్వాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

6 Replies to “అనంత‌, ఆదిపై జేసీవి స‌భ్య‌త లేని మాట‌లు!”

  1. 2020లో చిన్న జేసీ బ్రదర్ ఇంటి మీదకి దాడికి వెళ్ళింది ఈ పెద్దారెడ్డే అనుకుంటా? అనాల్సింది వీళ్లిద్దరినీ కాదు, వీళ్లకి వోట్స్ వేసి గెలిపిస్తున్న ప్రజలని

Comments are closed.