ఈమధ్య తరచుగా వార్తల్లో నిలుస్తోంది శ్రద్ధా కపూర్. ఇంకా చెప్పాలంటే స్త్రీ-2 సక్సెస్ నుంచి ఆమె పేరు మార్మోగిపోతోంది. ఆ తర్వాత పుష్ప-2లో ఐటెంసాంగ్ కోసమంటూ శ్రద్ధా కపూర్ పేరు గట్టిగా వినిపించింది. ఇప్పుడీ ముద్దుగుమ్మ మరోసారి వార్తల్లోకెక్కింది.
రీసెంట్ గా ఓ అద్దె ఫ్లాట్ లోకి మారింది శ్రద్ధా కపూర్. ముంబయిలోని ఖరీదైన జుహు ప్రాంతంలో ఉన్న ఆ లగ్జరీ అపార్ట్ మెంట్ లో మూడో ఫ్లోర్ ను శ్రద్ధా కపూర్ అద్దెకు తీసుకుంది. ఆ ఫ్లాట్ కోసం నెలకు ఆమె చెల్లిస్తున్న రెంట్ అక్షరాలా 6 లక్షల రూపాయలు.
ఏడాది పాటు అందులో ఉండేందుకు అగ్రిమెంట్ చేసుకుంది శ్రద్ధా కపూర్. అంతేకాదు, ఏడాది అద్దెను (రూ. 72 లక్షలు) ఒకేసారి చెల్లించింది. అక్టోబర్ 16న ఈ అగ్రిమెంట్ పూర్తయింది.
శ్రద్ధా లాంటి హీరోయిన్లు కావాలనుకుంటే సొంత ఫ్లాట్ కొనుక్కోగలరు. నిజానికి ఆమెకు బాంద్రాలో ఓ ఫ్లాట్ ఉంది కూడా. కానీ ఆమె జుహులో 3929 చదరపు అడుగుల కొత్త ఫ్లాట్ ను అద్దెకు తీసుకుంది. 4 కారు పార్కింగ్ లు కూడా దక్కించుకుంది.
టాలీవుడ్ లో ఈ మధ్య శ్రద్ధా కపూర్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. పుష్ప-2 ఐటెంసాంగ్ ను ఆమె వదులుకున్న తర్వాత.. నాని సినిమాలో హీరోయిన్ పాత్రను ఆమెకు ఆఫర్ చేశారు. అయితే ఆమె డిమాండ్ చేసిన రెమ్యూనరేషన్ చూసి వెనక్కుతగ్గారు. నాని సినిమాలో నటించేందుకు ఆమె 12 కోట్లు డిమాండ్ చేసిందంట.
Rent pay cheste, you get so many Tax Benefits. they are not fools
vc available 9380537747
Call boy works 7997531004
Call boy jobs available 7997531004
Vc estanu 9380537747