ఆర్ఆర్ఆర్ ను క్రాస్ చేసిన పుష్ప-2

కీలకమైన నైజాం సెగ్మెంట్ లో ఆర్ఆర్ఆర్ రికార్డ్ బద్దలైంది. చెక్కుచెదరదనుకున్న ఈ రికార్డ్ ను పుష్పరాజ్ బద్దలుకొట్టాడు.

కీలకమైన నైజాం సెగ్మెంట్ లో ఆర్ఆర్ఆర్ రికార్డ్ బద్దలైంది. చెక్కుచెదరదనుకున్న ఈ రికార్డ్ ను పుష్పరాజ్ బద్దలుకొట్టాడు. అలా నైజాంలో హయ్యస్ట్ ఓపెనర్ గా నిలిచాడు అల్లు అర్జున్. ఇదంతా టికెట్ రేట్ల పెంపు మహత్యం.

నైజాంలో మొదటి రోజు వసూళ్లలో “పుష్ప-2: ది రూల్” ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది. ప్రీమియర్స్ తో కలిపి ఈ సినిమాకు ఫస్ట్ డే 25 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. ఆర్ఆర్ఆర్ మొదటి రోజు షేర్ కంటే ఇది 2 కోట్ల రూపాయలు ఎక్కువ.

లిమిటెడ్ గా కాకుండా, ముందురోజే ప్రీమియర్స్ పేరిట ఎక్కువ స్క్రీన్స్ కేటాయించడం, దానికితోడు కనివినీ ఎరుగతి రీతిలో ప్రీమియర్స్ కు వెయ్యి రూపాయలకు పైగా టికెట్ రేటు పెట్టడంతో పుష్ప-2కు ఈ రికార్డ్ సాధ్యమైంది.

రెండో రోజుకే పడిపోయిన ఆక్యుపెన్సీ…

అయితే భారీగా పెంచిన టికెట్ రేట్లు, రెండో రోజు నుంచి ఈ సినిమాకు ఇబ్బందికరంగా మారాయి. మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రమే కనిపించాయి. కౌంటర్ బుకింగ్స్ చాలా తక్కువగా ఉన్నాయి. అటు నైజాంలోని సెమీ-అర్బన్ ప్రాంతాల్లో బుకింగ్స్ 50 శాతానికి పడిపోయాయి.

బుధవారమే ప్రీమియర్స్ పేరిట దాదాపు అన్ని ప్రాంతాల్లో షోలు వేయడం, సినిమాను గురువారం రిలీజ్ చేయడం కారణంగా.. ఈరోజు ఆక్యుపెన్సీ పడిపోయింది. రేపు, ఎల్లుండి కాస్త ఊపందుకునే అవకాశం ఉందంటున్నారు.

సోమవారం నుంచి రేట్లు తగ్గే ఛాన్స్..?

నైజాంతో పాటు.. ఏపీ, సీడెడ్ కు చెందిన చాలామంది డిస్ట్రిబ్యూటర్లు టికెట్ రేట్లు తగ్గిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని నిర్మాతల ముందు వ్యక్తం చేశారు. తాజా సమాచారం ప్రకారం, తెలంగాణ సర్కారు నుంచి తెచ్చుకున్న జీవోతో సంబంధం లేకుండా సోమవారం నుంచి పుష్ప-2 సినిమాకు టికెట్ రేట్లు తగ్గించాలని నిర్మాతలు భావిస్తున్నారు.

12 Replies to “ఆర్ఆర్ఆర్ ను క్రాస్ చేసిన పుష్ప-2”

    1. Ee kalam lo ye hero Aina Hit , flop anedi vundadu….! Combination set chesukunin Ott ki yentha ku ammukunnama…..! Leda first week lo yentha pindukunnama . Bagunte okasari theatre lo leda wait chesi Ott lo chustaru.

  1. నిజం లో ఒక ప్రాణం తీసుకున్న సినిమా అని కూడా రాయి .. రికార్డ్స్ ఎవడికి కావాలి .. పోయిన ప్రాణం వొస్తుందా ?

  2. రేపు ఇంకో సినిమా ఇంకా రేట్లు పెంచేసి దీనిని బద్దలు కొడతారు. అంతిమంగా ఫ్యాన్స్ జేబులకి చిల్లులు అంతేగా

Comments are closed.