అల్లు అర్జున్ పైకి కనిపించడు గానీ..

తన ఎంట్రీ సంగతి ఎలా ఉన్నా.. ఆ తర్వాత కాళ్లలోసత్తువను, సినిమా హీరోగా ఎదిగే క్రమంలో తన ప్యాషన్ ను మాత్రం చాలా ఘనంగా నిరూపించుకున్న హీరో అల్లు అర్జున్.

ఒక మామూలు వ్యక్తి హీరో కావాలనుకుంటే వెయ్యి రకాల అభ్యంతరాలు ఎదురవుతూ ఉంటాయి. వాటిని తోసిరాజనుకుంటూ హీరో అయ్యేవాడు నిలబడాలి. కొడుకు హీరో కావడం కోసం నిర్మాతలుగా మారే తండ్రులు మనకు బోలెడు మంది ఇండస్ట్రీ నిండా కనిపిస్తారు. కానీ ఒక టాప్ క్లాస్ నిర్మాత కొడుకు హీరో కావాలనుకుంటే అది చాలా సునాయాసమైన విషయం కదా అని మనం అనుకుంటాం. కానీ.. హీరో కావడానికి తల్లి నుంచే తొలి అభ్యంతరం వస్తుందని ఊహించలేం కదా? అలాంటి అభ్యంతరాల్ని అధిగమిస్తూ ఆవిర్భవించిన హీరోనే.. అల్లు అర్జున్!

తెలుగు చిత్ర పరిశ్రమకు ‘జాతీయ ఉత్తమ నటుడు’గా అవార్డును కానుకగా ఇచ్చిన హీరో.. అవార్డు తరువాత కూడా.. ఆ క్రేజ్ ను, క్రెడిబిలిటీని సస్టెయిన్ చేస్తూ పుష్ప2తో మరో విజయం అందుకున్నారు. సినిమా ఎలా ఉంది ఏం సాధించింది? ఏం సాధించబోతున్నది? పగిలిన రికార్డులు ఏమిటి? సృష్టింపబడిన రికార్డులు ఏమిటి? ఇలాంటి చర్చోపచర్చలు ఇప్పుడు దేశవ్యాప్తంగా నడుస్తూనే ఉన్నాయి. కానీ.. ఈ నేపథ్యంలో.. ‘బియాండ్ పుష్ప 2’ అల్లు అర్జున్ గురించి కొన్ని ముచ్చట్లు చర్చించుకోవడం బాగుంటుంది.

గంగోత్రితో కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వెండితెర మీదకు ఎంట్రీ ఇచ్చిన కుర్రాడు.. ఈ స్థాయి స్టార్ డమ్ తో నిలదొక్కుకుంటాడని బహుశా అప్పట్లో ఎవరూ ఎక్స్‌పెక్ట్ చేసి ఉండరు. అలాగే.. బన్నీ సినిమా ఎంట్రీకి తల్లి అభ్యంతరపెట్టడం కూడా తప్పుకాదని అనుకుని ఉంటారు. ‘తండ్రి బడా నిర్మాత అయితే.. ఎవడైనా హీరో అయిపోవచ్చు’ అనే సిద్ధాంతానికి ఇదొక ఉదాహరణ అని కూడా అనుకుని ఉంటారు. కానీ.. సినిమా ఇండస్ట్రీలాంటి చోట్ల తండ్రి నిర్మాతో, దర్శకుడో, ఫైనాన్షియరో, మరొక ఇన్‌ఫ్లుయెన్సరో కావడం అనేది కేవలం ఎంట్రీకి ఉపయోగపడుతుంది. ఆ తర్వాత నిలదొక్కుకోవాలంటే.. ఎవరి కాళ్లలో వారికి సత్తువ ఉండాలి.

తన ఎంట్రీ సంగతి ఎలా ఉన్నా.. ఆ తర్వాత కాళ్లలోసత్తువను, సినిమా హీరోగా ఎదిగే క్రమంలో తన ప్యాషన్ ను మాత్రం చాలా ఘనంగా నిరూపించుకున్న హీరో అల్లు అర్జున్. కాంటెంపరరీ హీరోల్లో కొన్ని విభాగాల్లో అసమానమైన హీరోగా పేరు తెచ్చుకుంటున్నాడంటే అతిశయోక్తి కాదు. యంగ్ హీరోల మొదటి వరుసలో సుదీర్ఘ కాలంగా సస్టెయిన్ కావడం కూడా చిన్న సంగతి కాదు.

సొంత కాంపౌండ్ నిర్మించుకున్న హీరో..

‘మెగా కాంపౌండ్ నుంచి మరో హీరో’ అనే ట్యాగ్ లైన్ తో అల్లు అర్జున్ సినీ రంగ ప్రవేశం చేశారు. మెగా ఫ్యాన్స్ అందరూ.. తనకు కూడా అభిమానులుగా మారారు! స్వయంగా తానే ‘మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్ ని’ అని ప్రకటించుకుంటూ, ఆ కాంపౌండ్ అభిమానులను తనకు కూడా అభిమానులుగా సంపాదించుకోవడంలో చాలావరకు సక్సెస్ అయ్యారు అల్లు అర్జున్! సినిమా కెరియర్ తొలినాళ్లలో మెగాస్టార్ చిరంజీవి కాంపౌండ్ కు చెందిన హీరో అనే మాట ఒక ‘ట్రీ గార్డ్’లాగా పనిచేసింది! ఎదిగే మొక్కను కాపాడుతూ ఉండే ట్రీగార్డ్, ఆ మొక్క వృక్షంగా మారే క్రమంలో దాని ఎదుగుదలకు ఆటంకం అవుతుంది. ఈ విషయాన్ని అల్లు అర్జున్ కాస్త త్వరగానే గుర్తించారని అనుకోవాలి. ఎందుకంటే తాను మెగా కాంపౌండ్ మనిషిని అనే ముద్ర నుంచి అర్జున్ బయటకు వచ్చారు.

తనకు ఒక సొంత ముద్ర ఉన్నదని, తాను ఒక సొంత కాంపౌండ్ నిర్మించుకోగలనని టాలీవుడ్ కు అల్లు అర్జున్ చాటి చెప్పదలుచుకున్నారు. మర్రి చెట్టు కింద మరో చెట్టు ఎదగదని నానుడి తనకు తెలుసు అన్నట్లుగా అల్లు అర్జున్ జాగ్రత్త పడుతూ వచ్చారు. ఆయన మెగాస్టార్ అనే మర్రిచెట్టు కిందనే పురుడు పోసుకుని ఎదిగిన మొక్క అయినప్పటికీ, క్రీపర్స్ లాగా ఆ కాంపౌండ్ నీడ నుంచి బయటకు వచ్చారు. ఆ తరువాత తానే ఒక వృక్షంగా ఎదగడం ప్రారంభించారు. ‘జాతీయ ఉత్తమ నటుడు’ వంటి అవార్డును సాధించడం ద్వారా మొన్నటి, నిన్నటి తరాలతో పోల్చినా కూడా తనకొక విశిష్టమైన స్థానం ఉంటుందని ఆయన నిరూపించుకోదలచుకున్నారు.

హీరోలు సినిమాలోని తమ తమ పాత్రల పేర్లకు ఒక నిర్వచనం చెబుతూ హైప్ క్రియేట్ చేస్తూ ఉంటారు. ‘సూర్య అంటే ఒక బ్రాండ్’ అని మహేష్ బాబు చెప్పిన మాటలు.. ‘పుష్ప అంటే పువ్వు అనుకుంటివా ఫైర్’ అని తొలి భాగంలో చెప్పిన మాటలు ఈ కోవకు చెందుతాయి. ఆ తరహాలో ‘అల్లు అర్జున్ అంటే ఇండిపెండెంట్’ అనే ముద్రను సంపాదించుకోగలిగారు. తెలుగు పరిశ్రమలో సమకాలీన హీరోలలో చాలా మంది స్టార్లకు లేని ట్యాగ్ లైన్ అది. పైకి కనిపించకుండా చాలా స్మూత్ గా జరిగిపోయిన ట్రాన్సిషన్ ఇది.

ముందు ముందు అల్లు కాంపౌండ్ అంటూ ఇండస్ట్రీ ప్రత్యేకంగా వ్యవహరించే రోజు క్రియేట్ అయితే గనుక.. ఆ ఘనత ఆద్యుడైన అల్లు రామలింగయ్యకు గానీ, పరిశ్రమలో టాప్ గ్రేడ్ నిర్మాతల్లో ఒకరుగా స్థిరపడిన అల్లు అరవింద్ కు గానీ దక్కదు. పైకి కనిపించకుండా పనులు చక్కబెట్టుకుంటూ వెళ్లిపోయే అల్లు అర్జున్ కే ఆ క్రెడిట్ చెందుతుంది.

భవిష్యత్తు ప్లానింగ్ ఏమిటి?

ఒక్కొక్క సినిమాకు మూడు సంవత్సరాల కాలం తన అభిమానులను నిరీక్షించేలా చేయడం అంటే అది హీరో దుర్మార్గం కిందికే వస్తుంది. అభిమానుల వేలం వెర్రిపోకడల వల్ల మాత్రమే హీరోలు మనగలుగుతూ ఉంటారు. ఓపెనింగ్ రోజుల రికార్డులు ఘనంగా ప్రచారం చేసుకుంటూ ఉంటారంటే దానికి మూల కారణం వేల రూపాయలు పెట్టి టికెట్లు కొనే అభిమానుల వేలం వెర్రి మాత్రమే! అంతగా అభిమానించే వారిని రెండు మూడు సంవత్సరాలు నిరీక్షించేలా చేయడం ధర్మమేనా అనేది ఇండస్ట్రీలో పెద్ద ప్రశ్న!

ఇలాంటి ప్రశ్నలకు అల్లు అర్జున్ కూడా స్వయంగా సమాధానం చెప్పారు. ఇక మీదట తన సినిమాల మధ్య మూడు సంవత్సరాల గ్యాప్ ఉండదని వెంట వెంటనే సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తానని ఆయన చెప్పుకున్నారు కూడా!

మరి అల్లు అర్జున్ భవిష్యత్తు ప్రణాళిక ఏమిటి? ఒక సినిమా విడుదల కాకముందే ఆ తర్వాతి సినిమాలకు సంబంధించిన ప్లానింగ్ మొత్తం పూర్తయిపోయి ఉంటుంది? కానీ బడ్జెట్ తో నిమిత్తం లేకుండా త్వరగా పూర్తయ్యే సినిమాలను అల్లు అర్జున్ చేసి ఇండస్ట్రీకి ఒక కొత్త పోకడతో ట్రెండ్ సెట్ చేస్తారా? అనేది ఇప్పుడు పరిశ్రమ వర్గాలతో పాటు, అభిమాన ప్రపంచం ఎదురుచూస్తున్న సంగతి! కాంటెంపరరీ హీరోల్లో అందరూ కూడా ఒక సినిమాకు తర్వాతి సినిమాకు బడ్జెట్ ను పెంచుకుంటూ.. హైప్ పెంచుకుంటూ ఒకటే మూసలో ముందుకెళుతున్నారు.

‘ఒక సినిమాకు 400 కోట్ల బడ్జెట్ చేస్తే ఆ తర్వాత చేయబోయే సినిమా కనీసం 500 కోట్ల బడ్జెట్ అయినా ఉండాలి కదా?’ అనే పిచ్చి భ్రమల ఊహలలో అభిమానులు బతుకుతున్నారు. అదే రకమైన భ్రమల్లో హీరోలు కూడా తమ కెరియర్ను తాము ప్రమాదకర శిఖరాల వైపు నెట్టుకుంటూ తీసుకెళుతున్నారు! కానీ శిఖరం చేరుకున్న తర్వాత, ఇక ఒక్క అడుగు వేయడానికి కూడా ఏమీ ఉండదు. అంతకంటే పైకి వెళ్ళడానికి మెట్లు ఉండవు.. అనే సంగతి చాలామందికి తెలియదు! శిఖరం ఎక్కే క్రమంలోనే హారిజంటల్ గా కూడా తనను తాను విస్తరింప చేసుకుంటూ వెళ్లిన వారే నిలకడైన కెరియర్ విషయంలో ఘనవిజయం సాధిస్తారు. ఆ పని అల్లు అర్జున్ చేయగలరా?

త్వరత్వరగా సినిమాలు చేయడం వలన ఇండస్ట్రీని కాపాడడం జరుగుతుందని కొందరు అంటుంటారు. కానీ దానిని మించి త్వరత్వరగా సినిమాలు చేయడం వలన తమను తాము కాపాడుకోవడం అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. త్వరగా సినిమా చేయడం అంటే బడ్జెట్ హైప్ క్రియేట్ చేసే భ్రమాచిత్రాలు కాకుండా, ఫీల్ గుడ్ మూవీలు ఉంటే బాగుంటుంది. ఈ క్రమంలో బన్నీ తర్వాతే ప్లానింగ్ ఎలా సాగుతుందో వేచి చూడాలి.

పైకి కనిపించడు గానీ.. ‘కేర్ నాట్’ స్టయిల్!

సాధారణంగా సినిమా ప్రపంచంలో నటులు, సెలబ్రిటీలు.. పైకి మాట్లాడే మాటలకు, అంతరంగం లోపల యాక్చువల్ గా రన్ అవుతూ ఉండే స్క్రిప్టుకు మధ్య చాలా తేడా ఉంటుంది. ఇలాంటి గోలను మనం సినిమా ఫంక్షన్ల విషయంలో ఎక్కువగా గమనిస్తుంటాం. ముఖప్రీతి పొగడ్తలు లాంటివి ఇక్కడున్నంతగా మరెక్కడా ఉండవు. బన్నీ కూడా ఇందుకు అతీతం కాకపోవచ్చు. కానీ.. అదే సమయంలో.. తనకు ఇష్టంలేకపోతే ఏమాత్రం కేర్ చేయనని కూడా నిరూపించుకుంటూ ఉండే హీరో అతను. అసహనం పీక్స్ కు వెళ్లినప్పుడు.. ఈ ముఖప్రీతి మాటలనుంచి బయటకు వస్తానని అల్లు అర్జున్ నిరూపించుకున్నారు. కొన్ని సార్లు ఆయన దొరికిపోయారు. వేదిక మీద ఉండగా.. పవన్ కల్యాణ్ డైలాగులు చెప్పాలని ఫ్యాన్స్ కోరితే.. ‘చెప్పను’ అంటూ చిరునవ్వుతోనే తిరస్కరించి, తన ‘కేర్ నాట్’ ధోరణి గురించి స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.

ఆ తర్వాత మాత్రం.. అడుగడుగునా.. ‘పైకి కనిపించడుగానీ.. కేర్ నాట్ ధోరణికి అల్లు అర్జున్ ఒక బ్రాండ్ అంబాసిడర్’ అనే పేరు తెచ్చుకున్నారు. ఇటీవలి ఎన్నికల సమయంలో కూడా.. తన స్నేహితుడైన వైసీపీ అభ్యర్థికి ఫేవర్ చేయాలనుకున్నారు. ప్రచారంలో మైలేజీ కనిపించేలా.. వారి ఇంటికి వెళ్లారు. అభిమానులకు అభివాదం చేశారు. ‘ప్రచారం’ అనే ముద్ర పడకుండా అక్కడినుంచి వెళ్లిపోయారు. అదే సమయంలో పవన్ కల్యాణ్ స్వయంగా పోటీ చేస్తున్నప్పటికీ.. ఆయనకు అనుకూలంగా గానీ, ఆయన పార్టీకి అనుకూలంగా గానీ… నోరు మెదపకుండా మౌనం పాటించి.. తన కేర్ నాట్ ధోరణిని చాటిచెప్పుకున్నారు. పవన్ అభిమానులు ఆగ్రహిస్తే.. అదే కేర్ నాట్ అన్నట్టుగానే ఉండిపోయారు.

పుష్ప 2 విడుదలకు సిద్ధమైన తర్వాత.. ప్రభుత్వంలోని పెద్దల వద్దకు వెళ్లి.. వారి ముఖప్రీతికి కొన్ని మాటలు చెప్పి తమ సినిమాకు టికెట్ ధర పెంచుకునే బేరాలాడ్డం హీరోలకు అలవాటు. మెగాస్టార్ అంతటి వారికి కూడా అది తప్పదు. కానీ అల్లు అర్జున్ అలాంటి పని చేయలేదు. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఉండగా.. అటువైపు ఆయన అడుగు కూడా పెట్టలేదు. పుష్ప 2 విడుదల తర్వాత.. సినిమా బృందం నిర్మాతలు, దర్శకుడు ఉమ్మడిగా వెళ్లి మెగాస్టార్ చిరంజీవిని ఇంట్లో మర్యాదపూర్వకంగా కలిసినప్పుడు కూడా బన్నీ వెళ్లలేదు. కానీ.. వైసీపీకి చెందిన తన మిత్రుడితో కలిసి సినిమా చూడ్డానికి మాత్రం వెళ్లారు.

పుష్ప 2 బృందం మెగాస్టార్ ను కలవడం.. నెక్ట్స్ ప్రాజెక్టుగా రాంచరణ్ సినిమా ఉన్నది గనుక– అని అనుకోవచ్చు. కానీ మర్యాదపూర్వక భేటీకి ‘మామయ్యది మొగల్తూరు.. మా నాన్నది పాలకొల్లు..’ అంటూ ఎట్రీలో పాడుకుని పునాది వేసుకున్న ఈ బన్నీ కూడా వెళితే తప్పేముంది.. అనుకునే వారు లేకపోలేదు. ఆ రకంగా కూడా తన కేర్ నాట్ ధోరణిని చాటుకున్నారు అల్లు అర్జున్!

ఈ పోకడలన్నీ ఎలాగైనా ఉండొచ్చు గాక.. కానీ ఒక హీరో వర్టికల్ గా ఎదుగుతున్నాడంటే.. ఆ ఎదుగుదల పరిశ్రమ హారిజాంటల్ గా కూడా ఎదగడానికి దోహదపడాలి. అలాంటి ప్లానింగ్ ఎలా చేసుకోవాలి అనేది.. అల్లు అరవింద్ వంటి అసాధారణ వ్యూహనిపుణుడిని తన వెన్నుదన్నుగా కలిగిఉన్న అల్లు అర్జున్ కు మరొకరు నేర్పాల్సిన అవసరం లేదు. కానీ.. కేవలం వర్టికల్ ఎదుగుదల సదరు హీరోకు కూడా మంచిది కాదనే వాస్తవం మాత్రం అర్జున్ గ్రహించాలి.

..ఎల్ విజయలక్ష్మి

63 Replies to “అల్లు అర్జున్ పైకి కనిపించడు గానీ..”

  1. మర్రి చెట్టు నీడలో ఇంకో చెట్టు పెరగదు అందుకే కదా బాబాయ్ ను లేపేసి, చెల్లి, తల్లి ని గెంటేశారు.

  2. అవునవును పాపం..ఉత్తమ నటుడు. తాము ఏదో చించుకొని నటించేశామనుకునే భ్రమల్లో కమల్, మోహన్ లాలా, మమ్మూట్టి, విక్రమ్ వంటి వారు ఉన్నారు. ఉత్తరోత్రా భక్తుల మనోభావాలు బహిర్గతమవగా తేలిందేమంటే ఖాన్ త్రయాన్ని తుడిచిపెట్టడానికి ఈ awards ని దక్షిణాదికి ఇస్తున్నారని. విజయలక్ష్మి వంటి వారు అతడిని కూడా ఉత్తమ నటుడిగా ఒప్పుకుంటే ఆ ప్రోత్సాహంతో కొండల్ని పిండి చేస్తాడు, నీటి మీద నడుస్తాడు.

  3. కౌరవ సైన్యం అంతా కర్ణుడిని పొగిడేసి పాండవులకు శత్రువు గా మార్చేసినట్లు చాలా కష్టపడుతున్నారు అల్లు అర్జున్ ని కలిపేసుకోవడానికి…..ఎదో అల్లు అర్జున్ వైకాపా తీర్థం పుచ్చుకుని జనసేన వ్యతిరేక ప్రచారం చేసినట్లు….. శిల్ప కుటుంబం టీడీపీ లోకో, జనసేన లోకో వచ్చేస్తే అల్లు అర్జున్ ని డబ్బా కొట్టిన వాళ్లంతా ఏమయిపోతారో….. అప్పుడు కూడా ఇవే పొగడ్తలు ఉంటాయా?….

    1. ventrukAA gaadu tappu telusukuni chaala tondarlone tappyipoyindi brother ani pawan sir kaallu pattukuni janasena lo cherathadu. adi maatram pakka.

  4. పాపం చాలా మంది మింగలేక కక్కలేక సతమతమౌతున్నారు.. చేసుకున్నవారికి చేసుకున్నంత…

  5. తొందర లో నే వీడి down fall స్టార్ట్ అవుతుంది…వీడి అహంకారం వీడి ని కిందకు తీసుకు వస్తుంది

  6. మీరు ఉహించుకుంటున్న Success అనేది PARABOLIC CURVE లాంటిది….ఎంత fast ga top కి reach ఐతే….downfall అంత కన్నా speed గా వుంటుంది…అందుకే చిరంజీవి గారు ఎన్ని ఇండస్ట్రీ హిట్స్ వచ్చిన DOWN TO EARTH వుంటారు….మీ పార్టీ ఎంత ఎత్తుకు ఎదిగింది….ఎందుకు ఇప్పుడు పత్లానికి పోయింది…కారణం ఎవరు….CHARACTER ముఖ్యం….అది. ఒక్కటే మళ్ళీ మళ్ళీ success lu ఇస్తుంది…fake , sympathy డ్రామాలతో బండిని నడపలేరు…👍👍

  7. వైసీపీ కి వైసీపీ మీడియా కి బాగానే దొరికారు ఇద్దరు హీరో లు ప్రభాస్, అల్లు అర్జున్, పాజిటివ్ ఆర్టికల్స్ వేసుకోవడానికి!

  8. రీల్ కు రియల్ కు ఇంత తేడా ఉంటుందా పుష్పా?

    పుష్ప 2 మూవీలో ఒక సీన్ ఉంటుంది. రాత్రికి పెళ్లి పెట్టుకొన్న ఒకడు.. పొద్దున్నే ఎర్రచందనం చెట్లు కొట్టేందుకు అడవిలోకి పుష్ప సభ్యుడిగా పనికి వెళతాడు. అనుకోకుండా పోలీసులు చుట్టు ముట్టి.. వారందరిని అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తీసుకెళతాడు. మరోవైపు.. పెళ్లి పీటల మీద పెళ్లి కుమార్తె వెయిట్ చేస్తూ ఉంటుంది.పెళ్లి కుమార్తె తండ్రి కోపంతో ఉంటాడు. పెళ్లి పెట్టుకొని ఇలా ఎవడైనా వెళతాడా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటే.. పీటల మీద కూర్చున్న పెళ్లి కుమార్తె కలుగుజేసుకుంటుంది. నేనే చెప్పా.. పుష్ప పనికి వెళ్లి రమ్మని. నాకు నమ్మకం ఉంది పెళ్లి ముహుర్తం టైంకు వచ్చేస్తాడు.. అక్కడ పుష్ప ఉన్నాడంటూ ఆ క్యారెక్టర్ చెప్పటం కనిపిస్తుంది.

    పిల్లలకు ఈ పేర్లు పెడితే చట్టపరమైన చర్యలు తప్పవు! అన్నట్లే.. పెళ్లి పెట్టుకొన్న ఒకడు.. తన పని కోసం అడవికి వెళ్లి.. పోలీసులకు దొరికిపోయాడన్న విషయం తెలుసుకున్న పుష్ప.. అలియాస్ పుష్పరాజ్ నేరుగా స్టేషన్ కు వెళతాడు. పెళ్లి కొడుకును ఇంటికి పంపేందుకు అక్కడి పోలీసులు సహకరించకపోతే.. వారికి వచ్చే జీతం.. వారికి ఉన్నసర్వీసు.. ఆ లెక్కన వచ్చే జీతంతో పాటు.. పెన్షన్ బెనిఫిట్స్ లెక్కేసి.. అక్కడికక్కడే స్టేషన్ లో ఉన్నందరికి డబ్బులు లెక్క సెటిల్ చేస్తాడు. అందరూ రాజీనామా చేసేసి వెళ్లిపోతారు. కట్ చేస్తే.. లాకప్ లో ఉన్న వారంతా బయటకు వచ్చేస్తారు.

    ఇక్కడ చెప్పాలనుకుంటున్నదేమంటే.. తన మనిషి అనేటోడికి ఏం జరిగినా.. పుష్ప అక్కడికి వచ్చేస్తాడు.వారి కష్టం తెలుసుకుంటాడు. ఎంత ఖర్చు అయినా.. ఏం జరిగినా.. ఏ స్థాయి వారు అడ్డుకున్నా.. వారికి ఎదురెళ్లి.. ఢీ కొట్టి మరీ తన వాళ్లకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూస్తాడు రీల్ పుష్ప రాజ్. కట్ చేస్తే.. వెండితెర మీద పుష్ప పాత్రను అత్యద్భుతంగా పండించిన అల్లు అర్జున్.. రియల్ లైఫ్ లో వ్యవహరించిన తీరుపైనే వేలెత్తి చూపటం ఎక్కువైంది. దీనికి కారణం..ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్యా థియేటర్ లో పుష్ప 2 సినిమా బెనిఫిట్ షోను ప్రేక్షకులతో కలిసి చూసేందుకు అల్లు అర్జున్ రావటం.. ఆ సందర్భంగా జరిగిన తీవ్ర తొక్కిసలాటతో రేవతి అనే ఇద్దరు చిన్నారుల తల్లి.. ఆమె పెద్ద కొడుకు గాయపడ్డారు. వారిలో రేవతి ఆ రాత్రే చనిపోగా.. బాలుడు మాత్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

    పుష్ప 2 సినిమాలో.. తన వాళ్లకు ఏమైనా అయితే.. ప్రాణాల్ని పణంగా పెట్టే పుష్పరాజ్.. రియల్ లైఫ్ లో అనూహ్య విషాద ఘటన చోటు చేసుకుంటే.. స్పందించేందుకు దగ్గర దగ్గర 48 గంటల టైం తీసుకోవటం ఏమిటి? అంతేకాదు.. తనకు రేవతి చనిపోయారన్న విషయం పక్క రోజు ఉదయం తెలిసిందని అల్లుఅర్జున్ నోటి నుంచి విన్నంతనే షాక్ కు గురవుతాం. రీల్ లో తన వాళ్ల కోసం డబ్బులు కుమ్మరించి.. స్టేషన్ మొత్తాన్ని కొనేసే అతడికి తగ్గట్లు.. ఆ పాత్రలో జీవించిన అల్లు అర్జున్.. మరెంతలా రియాక్టు కావాలి? అన్నదే ప్రశ్న. రీల్ కు రియల్ కు మధ్య తేడా కొట్టొచ్చినట్లు కనిపించటమే కాదు.. తన వాళ్ల విషయంలో రీల్ పుష్ప రియాక్టు అయ్యే తీరుకు.. ఆ పాత్రను పోషించే అల్లు అర్జున్ రియాక్టు అయిన తీరును చూసినప్పుడు మాత్రం.. అదేంది? రీల్ కు రియల్ కు మధ్య తేడా ఇంతలా ఉంటుందా పుష్పా? అన్న ప్రశ్న మాత్రం రాక మానదు.

  9. Separate Allu compound, very good. Next hero from Allu compound is Allu Sirish. in Allu sirish Next movie song will be like this “ma annayya Pushparaju, ma brandu allu brandu” then if people accept that movie then I will agree AA reached that status.

  10. మీ వై సి పి పా ర్టీ సం క న క్క డం వ ల్ల చా లా మం ది సి నీ న టు లు అ డ్డు క్కు తిం టు న్నా రు. ఇ ప్పు డు ఈ. అ ల్లు గా డి వం తు,

    పై గా సం ధ్య ఇ ష్యు ఒ క టి.. పై గా 1 0 మ ర్డ ర్ కే సు లు న మో దు అ యిం ది..

    ఈ పు ష్ప. మూ వీ. కు. ఏ న్ని కో ట్లు అ యి నా , 1 0. పై గా మ ర్డ ర్ కే సు లు

    న మో దు వ చ్చి న చె డ పే రు ని. మా ర్చ. గ ల డ్డా ..

  11. “కేర్ నాట్ తల పోగురే” సింగల్ సింహం అని ఎగిరెగిరి పడ్డ A1 గాడిని 151 నుండి 11 కి అదఃపాథాళానికి దింపింది.. అదే ఆటిట్యూడ్ అల్లు అర్జున్ ని కూడా పాతాళానికి దింపుతుంది any డౌట్స్??

  12. ఇండస్ట్రీ లో ప్రతి హీరో చిరంజీవి మాకు స్ఫూర్తి అని చెప్పి తీరాల్సిందే. సొంత మేనల్లుడు కాబట్టి ప్రతి సినిమా రిలీజ్ కు చెప్పాలి. అల్లు అర్జున్ ఇంత చిన్న లాజిక్ మిస్ అయ్యాడు, తిట్లు తింటున్నాడు. చూడండి బాలకృష్ణ అన్నేసి మాటలు అన్నా కూడా ఇప్పుడు కొంచెం లౌక్యం తెలుసుకున్నాడు, ఇతను కూడా త్వరలో తెలుసుకొని,మెగా భజన చేసి మళ్ళీ కుటుంబం అంతా ఒక్కటి అవ్వాలని ఆశిద్దాం.

    1. అంత భజన చేసే..నాగబాబు కొడుకు సినిమా మట్కా ఎందుకు… దారుణంగా కనపడకుండా పోయింది? ముందు సినిమాలన్నీ అన్ని రకాల భజనలు చేసినా పోయాయి.. భజన చేస్తే కాదు.. సినిమాలో… మేటర్ ఉండాలి. ప్రేక్షకులని థియేటర్ కి రప్పించి కూర్చోబెట్టే Screenplay Script Excecution అన్ని ఉంటేనే… భజన చేస్తే కాదు!

      చిరంజీవి సినిమా నే.. దేకటం లేదు.. బాగాలేకపోతే.. ఇక వాళ్ళ పేరు చెప్పుకుంటే.. చూస్తారా జనం?

      1. నిజమే. కానీ మెగా ఫ్యాన్స్ నీ దువ్వాలంటే మెగా భజన కంపల్సరీ అని నా ఉద్దేశం. కొంచెం బావుండే సినిమాలు ఈ ఫ్యాన్స్ చూడడం వల్ల గట్టెక్కేస్తాయి . బావుండని సినిమాలు ఎవరూ చూడరు.

  13. అదేదో సినిమాలో చెప్పినట్టు ‘ దీన్నే కొన్ని చోట్ల బలుపు అంటారు’.

    ఇది కొందరికి ఎక్కువగా ఉంటుంది.

    కానీ కాలం అందరి దూల తీర్చేస్తుంది.

    30 ఏళ్లు నేనే సీయమ్ అన్న వాడిని ప్రతిపక్ష హోదా కోసం అడుక్కునే కారణం ఆ కాలమే.

  14. మోగా..కోతి..మొఖల..కన్నా..AA..బాగుంటాడు, ఇంకా..డాన్స్ ల్లో..నెంబర్ 1, ఆంక్షన్..ఆల్రడీ..బెటర్..అని..నిరూపించుకున్నాడు. PK..లాంటోళ్ళు..AA..కాల్కిగోటితో..సమానము.

    1. ఒ రే య్ కు క్క. …. నీ దం డు పా ళ్యం ఫ్యా మి లీ. కు క్క లం తా * ప వ న్ *

      పా దా లు నా క్క లిం దే

      త ప్ప., పి క్కే ది. ఏ మీ లే దు …

  15. ఈ వెబ్ సైట్ వాడు,

    వాడి కులానికి అండగా నిలిచినందుకు,

    అల్లు అర్జున్ గురించి రోజుకి 100 ఆర్టికల్స్ రాసి లేపుతాడు.

    మరి పిచ్చి జనాలు, ఫ్యామిలీ కి 1500 పెట్టి ఎందుకు వెళ్ళాలి?

    మంచి డ్రెస్ ఒకటి కొనిపెడితే, మా నాన్న హీరో అని పిల్లాడు చెప్పుకుంటాడు.. ఎవడో బొక్క గాడి బానిస అని ప్రూవ్ చేసుకోవడానికి డబ్బు ఖర్చు చేస్తే మీ ఇష్టం.

    ఈ రికార్డు కొట్టడానికి రేపు ఇంకో బొక్క గాడి సినిమా కి 400 టికెట్ పెడతారు

  16. ఈడి సినెమా కి చేసిన ప్రతీ పేరున్న టెక్నీషియన్ రిగ్రెట్ అవుతున్నాఋ . దేవి శ్రీ ప్రసాద్ ఆల్రెడీ పబ్లిక్ గా చూపించేశాడు తను ఎంత రిగ్రెట్ అవుతున్నాడొ, ఫహాద్ అయితే పబ్లిక్ గా చెప్పేశాడు ఈ మొవీవలన నాకు 0.1% కూడా ఒరిగింది ఏం లేదు అని. సుక్కులాంటి ఒక హై స్టాండర్డ్ టెక్నికల్ డైరెక్టర్ స్విమ్మింగ్ పూల్ లో ఫహాద్ ని తోసేసి ఎక్స్ట్రా గాడి చేత ఉచ్చ పోయించే లాంటి సీన్లు పెట్టారంటే తప్పకుండా ఇది సుక్కు లైఫ్ లోనె ఒక బ్లాక్ మార్క్. బయటకి చెప్పుకోలేకపోయినా తన లైఫ్ టైం రిగ్రెట్ ఫీల్ అవుతూనే ఉంటాడు. ఈ సినెమా అల్లు అర్జున్ ఫేక్ ఇమేజ్ రిప్రెజెంట్ చేసుకోవడానికి చూపించుకున్న సిద్ధం సభలాంటిది. అభిమానులు నిజం కాదు, క్రేజ్ నిజం కాదు, పబ్లిక్ లో మాట్లాడిన మాటల్లో నిజం లేదు

  17. ఈడి సినెమా కి చేసిన ప్రతీ పేరున్న టెక్నీషియన్ రిగ్రెట్ అవుతున్నాఋ . దేవి శ్రీ ప్రసాద్ ఆల్రెడీ పబ్లిక్ గా చూపించేశాడు తను ఎంత రిగ్రెట్ అవుతున్నాడొ, ఫహాద్ అయితే పబ్లిక్ గా చెప్పేశాడు ఈ మొవీవలన నాకు 0.1% కూడా ఒరిగింది ఏం లేదు అని. సుక్కులాంటి ఒక హై స్టాండర్డ్ టెక్నికల్ డైరెక్టర్ స్విమ్మింగ్ పూల్ లో ఫహాద్ ని తోసేసి ఎక్స్ట్రా గాడి చేత ఉ*చ్చ పోయించే లాంటి సీన్లు పెట్టారంటే తప్పకుండా ఇది సుక్కు లైఫ్ లోనె ఒక బ్లాక్ మార్క్. బయటకి చెప్పుకోలేకపోయినా తన లైఫ్ టైం రిగ్రెట్ ఫీల్ అవుతూనే ఉంటాడు. ఈ సినెమా అల్లు అర్జున్ ఫేక్ ఇమేజ్ రిప్రెజెంట్ చేసుకోవడానికి చూపించుకున్న సిద్ధం సభలాంటిది. అభిమానులు నిజం కాదు, క్రేజ్ నిజం కాదు, పబ్లిక్ లో మాట్లాడిన మాటల్లో నిజం లేదు

  18. ఈ డి సినెమా కి చేసిన ప్రతీ పేరున్న టెక్నీషియన్ రిగ్రెట్ అవుతున్నాఋ . దేవి శ్రీ ప్రసాద్ ఆల్రెడీ పబ్లిక్ గా చూపించేశాడు తను ఎంత రిగ్రెట్ అవుతున్నాడొ, ఫహాద్ అయితే పబ్లిక్ గా చెప్పేశాడు ఈ మొవీవలన నాకు 0.1% కూడా ఒరిగింది ఏం లేదు అని. సుక్కులాంటి ఒక హై స్టాండర్డ్ టెక్నికల్ డైరెక్టర్ స్విమ్మింగ్ పూల్ లో ఫహాద్ ని తోసేసి ఎక్స్ట్రా గా డి చేత ఉ చ్చ పోయించే లాంటి సీన్లు పెట్టారంటే తప్పకుండా ఇది సుక్కు లైఫ్ లోనె ఒక బ్లా క్ మార్క్. బయటకి చెప్పుకోలేకపోయినా తన లైఫ్ టైం రిగ్రెట్ ఫీల్ అవుతూనే ఉంటాడు. ఈ సినెమా అల్లు అర్జున్ ఫేక్ ఇమేజ్ రిప్రెజెంట్ చేసుకోవడానికి చూపించుకున్న సిద్ధం సభలాంటిది. అభిమానులు నిజం కాదు, క్రేజ్ నిజం కాదు, పబ్లిక్ లో మాట్లాడిన మాటల్లో నిజం లేదు

Comments are closed.