వైసీపీ పెద్ద‌ల‌పై నందిగం సురేష్ గ‌రంగ‌రం

రెండు నెల‌ల‌కు పైగా అత‌ను జైలు జీవితం గ‌డుపుతున్నారు. బెయిల్ కోసం ప్ర‌య‌త్నిస్తున్నా, అత‌నికి ఊర‌ట ద‌క్క‌డం లేదు. దీంతో నందిగం సురేష్ తీవ్ర అస‌హ‌నంగా ఉన్నార‌ని స‌మాచారం.

వైసీపీ పెద్ద‌ల‌పై బాప‌ట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ గ‌రంగ‌రంగా ఉన్న‌ట్టు తెలిసింది. వివిధ కేసుల్లో ఆయ‌న జైల్లో ఉన్న సంగ‌తి తెలిసిందే. రెండు నెల‌ల‌కు పైగా అత‌ను జైలు జీవితం గ‌డుపుతున్నారు. బెయిల్ కోసం ప్ర‌య‌త్నిస్తున్నా, అత‌నికి ఊర‌ట ద‌క్క‌డం లేదు. దీంతో నందిగం సురేష్ తీవ్ర అస‌హ‌నంగా ఉన్నార‌ని స‌మాచారం.

త‌న‌ను ప‌రామ‌ర్శించ‌డానికి వెళుతున్న నాయ‌కుల వ‌ద్ద‌ పార్టీ పెద్ద‌ల‌పై సురేష్ మండిప‌డుతున్నార‌ని చెబుతున్నారు. “తాడేప‌ల్లిలో వైసీపీ పెద్ద‌లంతా ఏం చేస్తున్నారు? నెల‌ల త‌ర‌బ‌డి నేను జైల్లో వుంటే, క‌నీసం బ‌య‌టికి తీసుకొచ్చేందుకు పెద్ద లాయ‌ర్ల‌ను పెట్టాల‌నే ఆలోచ‌నే లేదా?” అని అత‌ను ప్ర‌శ్నిస్తున్నార‌ని సొంత పార్టీకి చెందిన నాయ‌కులు తెలిపారు.

ఇదిలా వుండ‌గా నందిగం సురేష్‌పై పార్టీలో ఏ ఒక్క‌రికీ సానుభూతి లేదు. అతి సామాన్యుడైన నందిగం సురేష్‌ను గ‌తంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం కేసులు పెట్టి వేధించింద‌నే కార‌ణంతో ఊహించని స్థాయిలో జ‌గ‌న్ ఆద‌రించారు. బాప‌ట్ల ఎంపీని చేశారు. అయితే సురేష్ మాత్రం ఎంపీ ప‌ద‌విని ప్ర‌జాసేవ చేసి, పార్టీకి మంచి పేరు తేవాల‌న్న విష‌యాన్ని మ‌రిచిపోయార‌ని సొంత పార్టీ నేత‌లు విమ‌ర్శిస్తున్నారు.

క‌రోనా స‌మ‌యంలో కృష్ణా న‌దిని కొల్ల‌గొట్టి, భారీ మొత్తంలో సొమ్ము చేసుకున్నాడ‌ని వైసీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. చివ‌రికి చంద్ర‌బాబు ఇంటి ప‌క్క‌న ఇసుకను కూడా వ‌దిలిపెట్ట‌లేద‌ని అంటున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు అక్ర‌మంగా సంపాదించిన సొమ్మ‌తో మంచి లాయ‌ర్‌ను పెట్టుకోవ‌చ్చు క‌దా? అని కొంద‌రు ప‌ల్నాడు జిల్లా నాయ‌కులు ప్ర‌శ్నిస్తున్నారు.

15 Replies to “వైసీపీ పెద్ద‌ల‌పై నందిగం సురేష్ గ‌రంగ‌రం”

  1. మొత్తం పార్టీ అంతా దొంగలే, వీళ్ళ నాయకుడు పెద్ద గజదొంగ!! no wonder!!

  2. ఇంతకీ ముందు ఆర్టికల్ లో యనమల అసహనం బీసీ కి జరిగిన అన్యాయం మీద ఐతే మన అన్న పార్టీ నాయకులు అసహనం అసంతృప్తి వాళ్ళకి అధిష్టానం మద్దత్తు లేదు అని అక్కడ కి ఆయన ఏదో ప్రజా సమస్య ల మీద పోరాడి ఇరుకున్నట్టు??? అంతే లే అన్న పోరాటం కూడా నాకు విపక్ష హోదా కోసం కదా… ఇలా మీరే చెప్తున్నారు రెండు పార్టీ ల మధ్య తేడా ని

  3. ముందు మనం ఎక్కడి నుంచి వచ్చామో ఆలోచించాలి. ఆతర్వత పార్టీ పెద్దలపై మాట్లాడాలి

Comments are closed.