లోకేశ్‌పై టీడీపీ సీనియ‌ర్ల అసంతృప్తి

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడి త‌న‌యుడు, మంత్రి నారా లోకేశ్‌పై టీడీపీ సీనియ‌ర్లు తీవ్ర అస‌హ‌నంగా ఉన్నారు.

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడి త‌న‌యుడు, మంత్రి నారా లోకేశ్‌పై టీడీపీ సీనియ‌ర్లు తీవ్ర అస‌హ‌నంగా ఉన్నారు. పార్టీలోనూ, ప్ర‌భుత్వంలోనూ లోకేశ్ క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నేది వాస్త‌వం. ఏ నిర్ణ‌య‌మైనా లోకేశ్‌ను కాద‌ని తీసుకునే ప‌రిస్థితి ప్ర‌భుత్వంలో లేదు. ఇటీవ‌ల కాలంలో లోకేశ్ పెద్ద‌గా మీడియాతో మాట్లాడ్డం లేదు.

ప్ర‌భుత్వంలోనూ, పార్టీలోనూ ప‌ట్టు పెంచుకోడానికే ఆయ‌న ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్ర‌స్తుత చంద్ర‌బాబు కేబినెట్‌లో లోకేశ్ టీమ్‌కే ప్రాధాన్యం. ప‌య్యావుల కేశవ్‌, అచ్చెన్నాయుడు, ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి, పార్థ‌సార‌థి లాంటి వాళ్లు మాత్ర‌మే సీనియ‌ర్ నాయ‌కులు. వీళ్ల‌లో కూడా ఆనం, పార్థ‌సార‌థి వైసీపీ నుంచి ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీలో చేరారు.

మొద‌టి నుంచి పార్టీని న‌మ్ముకున్న త‌మ‌కు మంత్రి ప‌ద‌వులు లేవ‌నే బాధ‌, ఆవేద‌న టీడీపీ సీనియ‌ర్ల‌లో వుంది. గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి, ప‌రిటాల సునీత‌, ప‌త్తిపాటి పుల్లారావు, కాల్వ శ్రీ‌నివాసులు…ఇలా ప్ర‌తి జిల్లా నుంచి ఒక‌రిద్ద‌రు సీనియ‌ర్లు మంత్రి ప‌ద‌వి ఆశించి భంగ‌ప‌డ్డారు. త‌మ‌కు మంత్రి ప‌ద‌వులు రాక‌పోవ‌డానికి లోకేశే కార‌ణ‌మ‌ని వాళ్లంతా న‌మ్ముతున్నారు.

రాజ‌కీయంగా చివ‌రి ద‌శ‌లో ఉన్న త‌మ‌కు ఇప్పుడు కాక‌పోతే, మ‌రెప్పుడు ఇస్తార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. లోకేశ్‌పై అసంతృప్తితో పార్టీ కార్య‌క‌లాపాల్లో అంటీముట్ట‌న‌ట్టుగా పాల్గొంటున్నారు. అలాగ‌ని సంపాద‌న విష‌యానికి వ‌స్తే మాత్రం, అసంతృప్తి లేదు. క‌నీసం సంపాదించుకోడానికైనా అవ‌కాశం ఇస్తే చాల‌ని వారు అంటున్నారు. లోకేశ్ మాత్రం సీనియ‌ర్ల అసంతృప్తిని ప‌ట్టించుకోకుండా త‌న ప‌ని తాను చేసుకెళుతున్నారు.

10 Replies to “లోకేశ్‌పై టీడీపీ సీనియ‌ర్ల అసంతృప్తి”

  1. ఒర్ గూట్లే 2009 రాజాకీలలో ఉన్న సత్య ప్రసాద్గ గొట్టిపాటి రవి, డోలా వీరాంజనేయులు. విద్యార్థి రాజకీయాల నుండి వచ్చిన కొల్లు రవీంద్ర, హాట్ట్రిక్ కొట్టిన రామానాయుడు విల్లు సీనియర్లు కాదురా?1985 లోనే నంద్యాల్ లో గెలిచినా ఫారూఖ్ కనపడలేదా?

    1. istam leni site lo comments pettadam emantaru ra langa lanjakodaka…istam lenappudu chadavatam endu comments pettadam enduku..nee ip address pattukoni nee guddalo oka pedda rokali dinchutam choosuko

  2. తప్పదు ఇలాంటివి రాసి ఏదో జరిగిపోతుంది అని రాయకపోతే నాలుగున్నర ఏళ్ళు ఎంతలోకి కళ్ళు మూసేలోపల అయిపోదా…..???

      1. తప్పదు అలానే చెప్పుకోవాలి…..కానీ ఇలానే అన్న నాలుగున్నరేళ్ల కళ్ళుమూసుకుంటే మీలాంటి గోబీ లు ఇలాంటి సింగల్ సింహం ఎలివేషన్స్ ఇస్తూ గడిపేయండి….

Comments are closed.