గంద‌ర‌గోళ జ‌గ‌న్‌!

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి త‌న పాల‌న‌లో ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్ని తానే మ‌రిచిపోయారు.

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి త‌న పాల‌న‌లో ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్ని తానే మ‌రిచిపోయారు. వైసీపీ హ‌యాంలో మొత్తం 26 జిల్లాల్ని ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే వైసీపీ ప్ర‌తిప‌క్షంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌, పార్టీలో మార్పుచేర్పులు చేప‌ట్టారు. కానీ పాత జిల్లాల‌కే ఆయ‌న పార్టీ అధ్య‌క్షుల్ని నియ‌మించ‌డం గ‌మ‌నార్హం. అంటే 13 జిల్లాల‌కు మాత్ర‌మే వైసీపీ అధ్య‌క్షుల్ని నియ‌మించారు.

ఈ నేప‌థ్యంలో 13వ తేదీ నుంచి కూట‌మి స‌ర్కార్ ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌పై నిర‌స‌న‌లు చేప‌ట్టాల‌ని వైసీపీ నిర్ణ‌యించింది. 13న ప్ర‌తి జిల్లా క‌లెక్ట‌రేట్‌లో విన‌తిప‌త్రాలు ఇవ్వాల‌ని వైఎస్ జ‌గ‌న్ ఆదేశించారు. ఇంత వ‌ర‌కూ బాగానే వుంది. ఇంత‌కూ తాము ఏ జిల్లాల ఆందోళ‌న‌ల్లో పాల్గొనాల‌ని వైసీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు ప్ర‌శ్నిస్తున్నారు.

ఉదాహ‌ర‌ణ‌కు తిరుప‌తి జిల్లా ప‌రిధిలోకి గూడూరు వ‌స్తుంది. ఇది ఉమ్మ‌డి నెల్లూరు జిల్లా ప‌రిధిలోనిది. ఈ నియోజ‌క‌వ‌ర్గ వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల ప్ర‌శ్న ఏందంటే… ఇంత‌కూ మేము ఏ జిల్లా నిర‌స‌న కార్య‌క్ర‌మంలో పాల్గొనాలి? వాస్త‌వానికి వీళ్లు తిరుప‌తి క‌లెక్ట‌ర్‌కు త‌మ స‌మ‌స్య‌ల‌ను విన్న‌వించుకోవాల్సి వుంటుంది.

కానీ రాజ‌కీయంగా వైసీపీకి జిల్లా అధ్య‌క్షుడు కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి. కాకాని నేతృత్వంలో నెల్లూరు క‌లెక్ట‌ర్‌కు గూడూరు వైసీపీ నాయ‌కులు స‌మ‌స్య‌ల్ని తెలియ‌జేసినా ఉప‌యోగం ఏంటి? అనే ప్ర‌శ్న త‌లెత్తుతోంది. మొత్తానికి గంద‌ర‌గోళానికి వైఎస్ జ‌గ‌న్ మారుపేరుగా మారారు. తాను అయోమ‌యంలో ఉండ‌డంతో పాటు త‌న పార్టీ శ్రేణుల్ని కూడా అదే ర‌కంగా త‌యారు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇప్ప‌టికైనా వైసీపీ నిర‌స‌నల్లో ఎవ‌రెవ‌రు ఎక్క‌డెక్క‌డ పాల్గొనాల‌నే అయోమ‌య అధిష్టానం స్ప‌ష్ట‌త ఇవ్వాల్సిన అవ‌స‌రం వుంది.

9 Replies to “గంద‌ర‌గోళ జ‌గ‌న్‌!”

Comments are closed.