మితిమీరిన మాస్-యాక్షన్.. హద్దులుదాటిన హింస.. ప్రస్తుతం నడుస్తున్న పోకడ చూస్తుంటే ఓ సినిమా హిట్టవ్వడానికి ఈ 2 మాత్రమే ఉంటే సరిపోతుందేమో అనిపిస్తుంది. కబీర్ సింగ్ సినిమాను విమర్శకులు తిట్టుకున్నారు. యానిమల్ సినిమాను తిట్టని విమర్శకుడు లేడు. పుష్ప-2 సినిమా రివ్యూస్ లో ఎక్కువగా నెగెటివ్ పాయింట్లే కనిపించాయి. కానీ ఇవన్నీ హిట్టయ్యాయి.
సమీక్షకుడు ఇచ్చే సమీక్షతో ఇప్పుడు ప్రేక్షకుడికి సంబంధం లేదు. సినిమాలో ఇంకేదో పాయింట్ కు కనెక్ట్ అవుతున్నాడు వాడు. దాన్నే హింస అంటున్నారు చాలామంది. వయొలెన్స్ పీక్స్ లో చూపిస్తే సినిమా హిట్ అనేది ఇప్పుడు కొత్త ఫార్ములాగా మారిపోయినట్టుంది.
అలా అని హింసను మాత్రమే చూపిస్తే సినిమాలు ఆడేయవు. దానికి ఇంకొన్ని ఎలిమెంట్స్ కూడా కలిసిరావాలి. అందమైన ఫ్రేములు, అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్, హీరో మాస్ అప్పీల్.. ఇలాంటివి కూడా తోడవ్వాల్సి ఉంటుంది. అప్పుడిక లాజిక్స్ కోసం ప్రేక్షకుడు చూడట్లేదు, తెరపై మేజిక్ ను మాత్రమే ఆస్వాదిస్తున్నాడు. అందుకే సుకుమార్ లాంటి దర్శకుడు కూడా కాళ్లు-చేతులు నరికే సీన్స్ తీస్తే ప్రేక్షకుడు బ్రహ్మరథం పట్టాడు. 3 గంటల 20 నిమిషాలైనా ఓపిగ్గా కూర్చుంటున్నాడు.
ఓ సినిమాను సమీక్షకుడు చూసే దృక్కోణం మారలేదు. అతడు ఎప్పట్లానే సినిమాను చూస్తున్నాడు. ఎన్నో ఏళ్లుగా సినిమాలు చూసిన మైండ్ సెట్ తోనే థియేటర్ లోకి అడుగుపెడుతున్నాడు. ఎటొచ్చి ప్రేక్షకుడి ఆలోచన ధోరణి మారిపోయింది. అదే పనిగా తెరకు అతుక్కుపోయే మనస్తత్వం కాదు ఇప్పటి ప్రేక్షకుడిది. ఏ చిన్న సీన్ బోర్ కొట్టినా ఆటోమేటిగ్గా ఫోన్ ఆన్ చేస్తున్నాడు.
అలా మొబైల్ ఆన్ చేయకుండా చేయగలిగితే చాలు, సినిమా హిట్టు. అందుకే పుష్ప-2 సినిమాను ఎక్కడో మొదలుపెట్టి, ఇంటర్వెల్ తో సంబంధం లేకుండా సాగదీసి, క్లయిమాక్స్ లో మరెక్కడో ముగించినా అది సమీక్షకుడికి పెద్ద లోపంగా అనిపించింది తప్ప, ప్రేక్షకుడు పట్టించుకున్న పాపాన పోలేదు. మారిన ప్రేక్షకుడి మానసిక స్థితికి అద్దం పడుతున్నాయి పుష్ప-2 లాంటి సినిమాలు.
“ఈ కాలం కథ ఎవడిక్కావాలి.. లాజిక్ ఎవడు చూస్తున్నాడు. నవ్వించడమో, ఏడిపించడమో, హింస పెట్టడమో.. ఏదో ఒకటి పతాక స్థాయిలో చూపించాడా లేదా.. అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్ తో యాక్షన్ చూపించాడా లేదా….” ఇవి మాత్రమే ప్రేక్షకుడు చూస్తున్నాడు. ఇలాంటి ప్రేక్షకుల్ని ఇనిస్టెంట్ గా ఆకర్షించేది హింస మాత్రమే. అందుకే తెరపై రక్తం ఏరులైపారుతోంది. వీడియో గేమ్స్ లో కూడా హింసను చూస్తున్న ఈ తరం ప్రేక్షకుడు.. డబ్బు పెట్టి థియేటర్లకొచ్చి అదే హింసను కోరుకోవడంలో తప్పులేదనిపిస్తోంది. వాడు కోరింది మేకర్స్ ఇవ్వాల్సిందే.
కబీర్ సింగ్ లో మహిళల్ని చూపించిన విధానం చూసి చాలామంది తిట్టుకున్నారు. యానిమల్ లో హింసను చూసి ముక్కున వేలేసుకున్నారు. నిజం చెప్పాలంటే సుకుమార్ ఆ స్థాయిలో పుష్ప-2లో వయొలెన్స్ చూపించలేదు. కాకపోతే అప్పటికే ఈ ఫ్రాంచైజీపై ఆడియన్స్ లో క్రేజ్ పెరిగింది. హుక్ లైన్స్, సిగ్నేచర్ స్టెప్పులు, తగ్గేదేలే అంటూ చెప్పే మాస్ మేనరిజమ్స్ కట్టి పడేశాయి. వెరసి వీటికి హింస తోడై సినిమా నభూతో అనే రేంజ్ లో ఆడుతోంది.
ఇదేదో పుష్ప-2 సినిమాను విమర్శించడం కోసం రాసిన వ్యాసం కాదు. ప్రేక్షకుడు సినిమాను చూసే విధానం ఎంతలా మారిపోయిందో చెప్పే ప్రయత్నం.
విమర్సించడం కోసం కాదంటూనే పరోక్షంగా సినిమాని బాగా లేపే ప్రయత్నం చేస్తున్నారు… టాక్ బాగుంది కానీ అక్కడ థియేటర్లు ఖాళీ గా ఉన్నాయి.. కావాలంటే బుక్ మై షో ఓపెన్ చేసి చూడండి మీకే తెలుస్తుంది నభూతో రేంజ్ లో ఆడుతుందో తట్ట బుట్ట సర్దేసే రేంజ్లో అడుతుందో.. ఏమో రేట్లు ఇంకా తగ్గిస్తే చూడాలి ఏమవుతుందో .. అప్పటికి కూడా సినిమా ఆడట్లేదంటే.. మెగా ఫ్యాన్స్ ఎఫెక్ట్ గట్టిగా పడినట్టే
Good understanding
Good
2.75 itchav adi cavar cheyadam ala
Pushpa 2
Movie కన్నా mobile ఎక్కువ చూస్తున్నారు Theatre lo…