ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల తాను ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నాటినుంచి ఒకటే ఎజెండా పట్టుకుని ఆ ఒక్క అంశాన్ని వదిలిపెట్టకుండా మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది ఏమాత్రం ఆచరణ సాధ్యం కాదనే సంగతి ఆమెకు కూడా తెలుసు. ఆమె డైలాగులు చెబుతున్నట్టుగా దేశంలో రాహుల్ గాంధీ ప్రధానిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినా కూడా ఆ అంశం నెరవేరేది కాదని ఆమెకు తెలుసు. అయితే.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మనుగడను కాపాడడానికి ఆమెకు అది తప్ప మరొక అంశం కనపడ్డం లేదేమో అనిపిస్తోంది. పీసీసీ చీఫ్ షర్మిల తాజాగా మరోసారి రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించాల్సిన అవసరం గురించి మాట్లాడారు.
విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి ప్రత్యేకహోదా వచ్చి, పదేళ్ల పాటు అమల్లో ఉండి ఉంటే. ఇబ్బడి ముబ్బడిగా పరిశ్రమలు వచ్చి ఉండేవనే సంగతి.. పదకొండో ఏడాదిలో ఇప్పుడు షర్మిల చెప్పాల్సిన అవసరం లేదు. ఆ విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు షర్మిల మరోసారి చెబుతున్నారు. విభజన హామీలను బుట్ట దాఖలు చేయడంలో మొదటి ముద్దాయి మోడీ అయితే, రెండో ముద్దాయి చంద్రబాబు, మూడో ముద్దాయి జగన్ మోహన్ రెడ్డి అని ఆమె విమర్శిస్తున్నారు. ప్రత్యేకహోదాపై ప్రధానిని నిలదీసి పార్టీలు సాధించాలని ఆమె వారికి హితవు చెబుతున్నారు.
ఏపీకి ప్రత్యేకహోదా అనేది ప్రాక్టికల్ గా సాధ్యం కాగల రోజులు ఎప్పుడో గతించి పోయాయి.
అయితే షర్మిల వైఖరిలో కొంతలో కొంత మార్పు వచ్చినట్టుగా కనిపిస్తోంది. ఇంతకాలం కేవలం జగన్ ను నిందించడానికి మాత్రమే ఎక్కువ సమయం కేటాయిస్తూ వచ్చిన షర్మిల ఇప్పుడు అంతో ఇంతో చంద్రబాబును కూడా మాటలు అంటున్నారు. అసలే చంద్రబాబుకు అనుకూలంగా షర్మిల మాట్లాడుతున్నదనే విమర్శలు ఉండే నేపథ్యంలో.. ఆమె విజన్ 2047 పేరుతో ఆయన అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని విమర్శిస్తున్నారు.
షర్మిల తెలుసుకోవాల్సిన సంగతి ఇంకోటుంది. గత అయిదేళ్లలో జగన్ ను ఏమీ చేయలేదంటూ విమర్శించడం వల్ల ఆమెకు టైం వేస్ట్ తప్ప లాభం లేదు. ఎటూ ప్రజలు ఆయనను ఓడించారు. గెలిచిన ఈ ఆరునెలల్లో చంద్రబాబు నాయుడు ఏం చేయగలుగుతున్నాడో.. ఎక్కడెక్కడ మాట మారుస్తున్నాడో మాట్లాడ్డం నేర్చుకుంటూనే ఆమెకు, ఆమె పార్టీకి కూడా రాష్ట్రంలో మనుగడ ఉంటుందని ప్రజలు అంటున్నారు.
నువ్వు రాసినదానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా నోటికి వచ్చింది రాసావా ?
విభజనహామీలలో మొదటి ముద్దాయి మోడీనా ? ఎలా ? విభజన చట్టంలో గానీ, బీజేపీ ఎన్నికల మానిఫెస్టోలో గానీ, నరేంద్రమోడీ ఏమైనా ప్రత్యేకహోదా ఇస్తామని హామీ ఇచ్చారా ?
పోనీ లోక్సభ లో విభజన బిల్లు డిబేట్లలో అయినా బీజేపీ ప్రత్యేకహోదా ప్రసక్తి తెచ్చిందా ? వెంకయ్యనాయుడు గారు రాజ్యసభలో ప్రత్యేకహోదా గురించి ఆవేశపడి చొక్కాలు చించుకునేవరకూ ప్రత్యేకహోదా అనేది ఒకటి ఉన్నది అని మన నాయకులు ఎవరికైనా తెలుసా ? వెంకయ్యనాయుడుగారి దీర్ఘకాలిక ప్రణాళిక ప్రకారం ప్రత్యేకహోదా గురించి రంకెలు పెడితే, మోడీ బాధ్యుడా ? అయినా ప్రత్యేకహోదాకు సమానమైన ఆర్ధికపాకేజీ ఇస్తానికి మోడీ ముందుకు వస్తే, ఆ విషయంలో నాటకాలు ఆడి రాష్ట్రానికి రావాల్సిన ఆర్ధికలాభం చెడగొట్టింది చంద్రబాబుగారు.
కేంద్రం కట్టి అప్పచెప్పాల్సిన పోలవరంను భుజానవేసుకుని కంపు చేసిన,
10 ఏళ్ళూ గడిచినా రైల్వే జోన్ కు స్థలం కేటాయింపుకు ముందుకు రాని రాష్ట్రప్రభుత్వాలను ఎన్నుకున్న ప్రజలు అసలు నేరస్థులు
విభజన చట్టంలో ఏ హామీ మోడీ నెరవేర్చలేదో చెప్పి అప్పుడు బురద జల్లితే బాగుండేది.
Giving Modi’s Tirupati Election meeting links for your verification , which is much talked
youtube.com/watch?v=urFU6ysTjbs&list=WL&index=7
youtube.com/watch?v=uPKWSIJS1tM&list=WL&index=6
links are removed. you may search in youtube by typing Modi Tirupati meeting
Tirupati Sabhahttps://www.youtube.com/watch?v=uPKWSIJS1tM&t=42s
https://www.youtube.com/watch?v=urFU6ysTjbs&t=257s
reddy
okkati matram sure
Sharmilakka ki jagan kante babe yekkuva!!!
ap కి.మోసం చేసిందే కాంగ్రెస్…ఇప్పుడు దీన్ని ఎవ్వడు లెక్క చేస్తారు..