సాగునీటి సంఘాల ఎన్నికల్లో 95 శాతం పదవులు తమ వశమయ్యాయని కూటమి సంబరపడుతోంది. అధికారంలో ఉన్నప్పుడు ఎవరికైనా ఇట్లే అనిపిస్తూ వుంటుంది. ఇలాంటివి ప్రత్యర్థుల్లో పట్టుదల పెంచుతుంటాయి. గతంలో వైసీపీ నియంతృత్వంతో వ్యవహరించిందని విమర్శించిన నోళ్లే, నేడు తాము అంతకంటే ఎక్కువ నిరంకుశ ధోరణితో వ్యవహరించడం గమనార్హం.
గతంలో వైసీపీ దౌర్జన్యాలను ప్రజలు గమనించారు. ఎన్నికలొచ్చే వరకూ ఎదురు చూశారు. వైసీపీకి ప్రజలు చెప్పిన గుణపాఠం నుంచి కూటమి ఏమీ నేర్చుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. వినాశకాలే విపరీత బుద్ధి అంటే ఇవే కాబోలు. ఈ మాట కూటమికి చేదు అనిపించొచ్చు. అధికారంలో ఉన్నాక, ఆ మాత్రం చేసుకోకపోతే ఎలా అని నియంతృత్వాన్ని ప్రశ్నించిన వాళ్లను దబాయించొచ్చు.
కానీ నియంతృత్వం ఎక్కువ కాలం సాగదని చరిత్ర ఎన్నో పాఠాల్ని నేర్పింది. దురదృష్టవశాత్తు రాజకీయ పార్టీల నాయకులకు అవన్నీ రుచించవు. తాత్కాలిక ప్రయోజనాల కోసం ఏం చేయడానికైనా సిద్ధమనే రీతిలో వ్యవహరిస్తున్నారు. అయితే ప్రతిదానికీ సమాధానం చెప్పుకోవాల్సిన రోజు ఒకటొస్తుంది. అప్పుడు లబోదిబోమన్నా పట్టించుకునే వారుండరు. ప్రస్తుతం వైసీపీ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనే పిలుపును ఎవరు పట్టించుకుంటున్నారు? ప్రజాస్వామ్యాన్ని కాపాడిన వాళ్లకు మాత్రమే, దాని గురించి మాట్లాడే అర్హత వుంటుంది.
ప్రస్తుతం ఏ ఎన్నికైనా గెలుపు తప్ప, ప్రజాస్వామ్యం గురించి ఆలోచించే పరిస్థితిలో కూటమి నేతలు లేరు. ఇవన్నీ తాత్కాలిక ఆనందాన్ని ఇచ్చేవని తెలిసినా, వాళ్లు మాత్రం నియంతృత్వంగా వ్యవహరించడానికే సిద్ధమయ్యారు. చేయగలిగేదేమీ లేదు. చిత్రగుప్తుడు పాపాల్ని కౌంట్ చేస్తున్నట్టుగా, ప్రజలు అన్నీ మనసులో పెట్టుకుంటారు. సమయం వచ్చినప్పుడు ఎలా గుణపాఠం నేర్పాలో వాళ్లకు బాగా తెలుసు. తెలియక చేస్తే పొరపాటు. తెలిసి చేస్తే, తప్పు అవుతుంది. తప్పులు చేసిన వాళ్లు శిక్ష అనుభవించక తప్పదు. దీనికి మినహాయింపులుండవు.
ప్రస్థుతానికి కూటమి గత ప్రభుత్వం అంత దారుణంగా ఐతే లేదు అని ప్రజలు భావిస్తున్నారు
Adhi nuvvu kadhu prajalu cheppali raaa p/k
Oh avuna meeku Ela telusu
మేం ప్రజలమే కాబట్టి
జగన్ గారి రికార్డు బ్రేక్ చేయాలంటే కిమ్ గాడు రావలసిందే
ఆడివల్ల కూడా కాదేమో 🤔
inko nalugunnarra yellataravatha chooskundamule reddy
mundu 2025 new year celebrate chesiko
2029 new year sangathi demuderugu !!
picchi reddy
ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దౌర్జన్యాలు చేసింది అని ఒప్పుకున్నావ్
అబ్బా ఏం జీవిత సత్యాలు చెబుతున్నావ్ రా గ్యాసాంద్ర. ఈ జీవిత సత్యాలు ఇంతకుముందు వైసీపీ వాళ్లకు చెప్పి ఉంటే పరిస్థితులు కొంతలో కొంత మెరుగై ఉండేది. కానీ అలా చేయక వాళ్ళు తానా అంటే నువ్వు తందానా అన్నావు. ప్రతి వ్యాసంలోనూ వాళ్ళ నాకాశానికి ఎత్తేశావు. మీలాంటి వాళ్ళు చేసిన అతి పార్టీకి చేటు తెచ్చింది . ఈ మాత్రం సంయమనం వాళ్ళు ఎందుకు పాటించలేకపోయారో తెలుసా ? చెప్పింది వేదం చేసింది చట్టంలో గడిచిపోయింది ఐదేళ్లు. మీలాంటి వాళ్ళు కళ్ళుండి కబోధులు నోరు ఉండి మూగవాళ్ళు అయిపోయారు. ఇప్పుడు మాత్రం నీతులు చెబుతున్నారు. ఎంతటి ఉదారత్వము . ఐదేళ్లు వాళ్ళు చేసిన తప్పులు కనపడలేదా నీకు ? 151 నుంచి 11 కి ఎందుకు దిగజారారో చెప్పు ? నీతులు ఒకరికే చెప్పడం కాదు అందరికీ చెప్పాలి . తప్పును తప్పు అనాలి ఒప్పును ఒప్పు అనాలి. అలా ఎప్పుడూ చెప్పింది లేదే తమది అంతా వన్ సైడ్ బాండ్.. మనుషులు రివర్స్ పాలన రివర్స్. ఇప్పుడు నీతులు చెప్పడానికి నీకు తగిన అర్హత లేదు నువ్వు నీతులు చెప్పకూడదు. సర్పంచ్ ఎన్నికల్లో జరిగిన అక్రమాలకు అంతే లేదు. జెడ్పిటిసి ఎంపీటీసీ మునిసిపల్ ఎన్నికల్లో జరిగిన దారుణాలు ఒకటా రెండా ? అప్పుడు తమరికి ఇవన్నీ కనిపించలేదా ? కనిపించిన కళ్ళు ఉన్న కబాడీ పోయినావు నోరన్న మూగవాడివైపోయినావు.