అందుకే మోహ‌న్‌బాబును అరెస్ట్ చేయ‌లేదు

జ‌ర్న‌లిస్టుల‌పై దాడి కేసులో సినీ న‌టుడు మోహ‌న్‌బాబును ఎందుకు అరెస్ట్ చేయ‌లేదో రాచ‌కొండ సీపీ సుధీర్‌బాబు కార‌ణం చెప్పారు.

జ‌ర్న‌లిస్టుల‌పై దాడి కేసులో సినీ న‌టుడు మోహ‌న్‌బాబును ఎందుకు అరెస్ట్ చేయ‌లేదో రాచ‌కొండ సీపీ సుధీర్‌బాబు కార‌ణం చెప్పారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ మోహ‌న్‌బాబు అరెస్ట్ విష‌యంలో ఎలాంటి ఆల‌స్యం లేద‌న్నారు. కానీ ఈ నెల 24వ తేదీ వ‌ర‌కూ మోహ‌న్‌బాబు అరెస్ట్‌కు హైకోర్టు మిన‌హాయింపు ఇచ్చింద‌ని ఆయ‌న గుర్తు చేశారు. కోర్టు ఆదేశాల‌ను తాము గౌర‌విస్తామ‌ని రాచ‌కొండ సీపీ తెలిపారు.

మోహ‌న్‌బాబును విచారించేందుకు మెడిక‌ల్ స‌ర్టిఫికెట్ తీసుకోవాల్సి వుంటుంద‌ని ఆయ‌న అన్నారు. ఇప్ప‌టికే మోహ‌న్‌బాబుకు నోటీసులు ఇచ్చిన‌ట్టు ఆయ‌న చెప్పుకొచ్చారు. ఇప్ప‌టి వ‌ర‌కు మంచు కుటుంబ స‌భ్యుల‌పై మూడు ఎఫ్ఐఆర్‌లు న‌మోదైన‌ట్టు రాచ‌కొండ సీపీ తెలిపారు. అలాగే మ‌రికొన్ని ఫిర్యాదులు కూడా వ‌చ్చాయ‌న్నారు. ప్ర‌స్తుతం మోహ‌న్‌బాబుపై విచార‌ణ కొన‌సాగుతోంద‌న్నారు.

త‌న చేతిలో గాయ‌ప‌డిన జ‌ర్న‌లిస్ట్ రంజిత్‌ను సానుభూతితో మోహ‌న్‌బాబు ప‌రామ‌ర్శించ‌డానికి వెళ్లి వుంటార‌న్నారు. కానీ చ‌ట్ట‌ప్రకారం తాము న‌డుచుకుంటామ‌న్నారు. మోహ‌న్‌బాబుకు ఇచ్చిన గ‌డువు కంటే ముందే విచారించే విష‌య‌మై న్యాయ‌స్థానం అభిప్రాయం తెలుసుకుంటామ‌న్నారు.

న్యాయ స్థానం ఆదేశాల మేర‌కు న‌డుచుకుంటామ‌ని రాచ‌కొండ సీపీ తెలిపారు. హైకోర్టు ఇచ్చిన గ‌డువు లోపు మోహ‌న్‌బాబు స్పందించ‌క‌పోతే, అప్పుడు అరెస్ట్ చేస్తామ‌ని సీపీ స్ప‌ష్టం చేశారు.

3 Replies to “అందుకే మోహ‌న్‌బాబును అరెస్ట్ చేయ‌లేదు”

Comments are closed.