త్వరలో వైసీపీలోకి కాంగ్రెస్‌ పెద్ద తలకాయ!

మీకు కొత్త ఇన్‌చార్జ్‌గా మాజీ మంత్రి వస్తున్నారు. ఇక మీదట నా దగ్గరకు రావాల్సిన అవసరం లేదు

2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత అధికారాన్ని అనుభవించిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీని విడుతుంటే.. కాంగ్రెస్ మాజీ పీసీసీ అధ్యక్షుడు, పార్టీకి కీలక నేతలలో ఒకరు వైసీపీలో చేరతారని వార్తలు వినిపిస్తున్నాయి. జనవరి నెలలో వైసీపీలో చేరేందుకు ఆయ‌న ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇటీవ‌ల‌ మాజీ ఎమ్మెల్యే భర్తను కలిసిన కార్యకర్తలకు, “మీకు కొత్త ఇన్‌చార్జ్‌గా మాజీ మంత్రి వస్తున్నారు. ఇక మీదట నా దగ్గరకు రావాల్సిన అవసరం లేదు” అంటూ క్లారిటీ ఇచ్చినట్లు చెబుతున్నారు.

గతంలో ఆయ‌న మంత్రిగాను, పీసీసీ అధ్యక్షుడిగానూ కీలక బాధ్యతలు నిర్వర్తించారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించారు. ఏపీ కాంగ్రెస్‌కు షర్మిల నేతృత్వం పెద్దగా ఉపయోగం లేకపోగా ఆమె ఆ పదవిలో కొనసాగితే, కాంగ్రెస్ మరింత బలహీనమవుతుందని భావించిన ఆయ‌న, వైసీపీలో చేరడం ద్వారా తన రాజకీయ భవిష్యత్తు మెరుగుపడుతుందని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ఇప్ప‌టికే ఆయ‌న టీడీపీలో చేరతార‌ని, వైసీపీ చేరుతార‌ని చాలా సార్లు వార్త‌లు వినిపించాయి. మ‌రి ఈ సారి కూడా వార్త‌ల వ‌ర‌కే ప‌రిమితం అవుతుందా? లేదా? అనేది జ‌న‌వ‌రిలో తెలుతుంది. 2019 ఎన్నికల సమయంలో టీడీపీ బీ ఫారం ఇచ్చినా, జిల్లా పార్టీ పెద్దల వివాదాల కారణంగా చివరి నిమిషంలో కాంగ్రెస్ నుంచి పోటీచేశారు. ఆయన మంత్రిగా పనిచేసిన నియోజకవర్గంలో వైసీపీ క్యాడర్‌తో మంచి సాన్నిహిత్యం ఉంది, మంత్రిగా పనిచేసిన కాలంలో కార్యకర్తల కోసం బాగా పని చేశార‌నే పేరు ఉంది. దీంతో ఆయ‌న రాకాను వైసీపీ కార్య‌క‌ర్త‌లు కూడా స్వాగ‌తం ప‌లికే అవ‌కాశం కూడా ఉంది.

ఎందుకంటే ఆ నియోజకవర్గంలో ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే భర్త తన‌ వ్యక్తిగత వ్యవహారాలపై దృష్టి పెట్టడంతో, కార్యకర్తలను పట్టించుకోవడం లేదు, త‌న విద్య‌సంస్థ‌ల‌కు ఎటువంటి ఇబ్బందు లేకుండా అధికార పార్టీ నాయ‌కుల‌తో లోపాయికారి ఒప్పందం చేసుకున్నార‌ని కార్య‌క‌ర్త‌లు భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మాజీ పీసీసీ అధ్యక్షుడు పార్టీలో చేరితే ఆ నియోజకవర్గం మాత్రమే కాదు, రాష్ట్ర స్థాయిలో కూడా గట్టి వాయిస్‌ ఉంటుందనే అభిప్రాయం వైసీపీ అధిష్ఠానానికి ఉంది.

జనవరి నుంచి వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి జిల్లాల పర్యటన చేస్తారని ఇప్పటికే వెల్లడించారు. ఈ పర్యటన సందర్భంగా పార్టీలో చేరికలు చేసి, కార్యకర్తల మధ్య ఉత్సాహం నింపాలని వైసీపీ యోచిస్తోంది. ఇతర పార్టీల నుంచి సీనియర్ నేతలను కూడా వైసీపీలో చేర్చడం ద్వారా కార్యకర్తలకు కొత్త‌ ఉత్సాహం నింపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.

14 Replies to “త్వరలో వైసీపీలోకి కాంగ్రెస్‌ పెద్ద తలకాయ!”

  1. నీ బిల్డప్పె కాని కంగ్రెస్స్ లొ ఇంకా పెద్ద తలకాయలు ఎవరు మిగిలి ఉన్నారు?

  2. కాంగ్రెస్లో వైసీపీకి ఉపయోగపడే అంత పెద్ద తలకాయ ఎవడున్నాడమ్మా?. ఆ బోడి కాంగ్రెసులో ఉండే వారంతా తలకాయలు లేనివాళ్లే. అంత తలకాయలు ఉన్నవాళ్లు అయితే కాంగ్రెస్కు ఇవాళ ఈ స్థితి ఎందుకు వచ్చింది? ఎవ్వరు దొరకనట్టు షర్మిలను ఏపీ పిసిసి అధ్యక్షురాలిగా ఎందుకు చేస్తారు -? ఇప్పుడే రా చెప్పాను గ్యాస్ వార్తలు రాయడంలో నిన్ను మించిన బోడి నా కొడుకు ఈ భూ ప్రపంచం లో లేడని

Comments are closed.