కేసు తేలిపోయేలా.. ఆ పనులన్నీ చేస్తారేమో!

డాక్యుమెంట్స్ ను టాంపరింగ్ చేసేసి, వాంగ్మూలాలు మార్చేసి.. చంద్రబాబు పరిశుద్ధుడు అని చెప్పడానికి కుట్ర జరగవచ్చునని కూడా పలువురు అనుమానిస్తున్నారు

ఏపీ ఫైబర్ నెట్ ప్రస్తుత ఛైర్మన్ జీవీ రెడ్డి తాజాగా ప్రెస్ మీట్ పెట్టి.. తమ శాఖలోని అనేక వ్యవహారాలను మీడియా వారికి వివరించే ప్రయత్నం చేశారు. ప్రభుత్వంలోని ప్రతి శాఖ వారు చేస్తున్న తీరుగానే.. గత అయిదేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏయే ఘోరాలు జరిగాయో ప్రజలకు చెప్పడానికి ఆయన ఎక్కువ సమయం కేటాయించారు.

ఫైబర్ నెట్ ద్వారా ప్రదర్శించిన వ్యూహం సినిమా కోసం ఆర్జీవీకి అడ్డదారుల్లో రెండు కోట్లు చెల్లించారని కూడా ఆరోపించారు. ఆ విషయాలన్నీ పక్కన పెడితే.. చంద్రబాబు మీద జగన్ సర్కారు హయాంలో నమోదైన ఫైబర్ నెట్ కేసు విషయంలో ఆయన చెప్పిన సంగతులు అనుమానాలు కలిగించేలా ఉన్నాయి.

ఆయన మాటలను గమనిస్తే.. ఈ కేసు నుంచి చంద్రబాబును పూర్తిగా తప్పించడానికి, ఆ శాఖలో ఉన్న రికార్డుల్లో వివరాల ట్యాంపరింగ్ జరుగుతుందేమో అనే అనుమానం కలుగుతోంది.

వివరాల్లోకి వెళితే.. జీవి రెడ్డి చెబుతున్న ప్రకారం.. అప్పట్లో ఎంపీ విజయసాయిరెడ్డి సిఫారసు తో ఫైబర్ నెట్ లో లీగల్ డిపార్టుమెంటులోకి ఒక మహిళకు ఉద్యోగం ఇచ్చారు. చంద్రబాబునాయుడు మీద అప్పట్లో ఫైబర్ నెట్ కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించి కీలక పత్రాలు అన్నీ విజయసాయిరెడ్డి సిఫారసుతో ఉద్యోగంలోకి వచ్చిన మహిళ చేతిలో ఉన్నట్టుగా గుర్తించాం అని జీవీరెడ్డి చెబుతున్నారు. ఆమె చేతిలోకి ఎలా వెళ్లాయో విచారణ జరిపిస్తున్నాం అంటున్నారు.

ఆ కేసు డాక్యుమెంట్స్‌ను టాంపరింగ్ చేశారా? ఏదైనా కీలక సమాచారాన్ని తొలగించారా? అదనంగా ఏమైనా చేర్చారా? వాంగ్మూలాలు ఏమైనా మార్చారా? అనేది పరిశీలిస్తున్నట్టుగా జీవీ రెడ్డి చెబుతున్నారు. ఆ మహిళతో పాటు, ఆమె సోదరికి కూడా కేవలం వాట్సప్ మెసేజీని ఆధారం చేసుకుని ఫైబర్ నెట్ లో ఉద్యోగాలు ఇచ్చారని, అందుకే వారిద్దరినీ ఇప్పుడు విధులనుంచి తొలగించాం అని జీవి రెడ్డి చెబుతున్నారు.

డాక్యుమెంట్స్ టాంపరింగ్ గురించి ఆయన చెబుతున్న మాటలు, వ్యక్తంచేస్తున్న సందేహాలను గమనిస్తే ఇప్పుడు అనుమానం పుడుతోంది. ఆ కీలక పత్రాల్లో ఆధారాలను, సమాచారాన్ని టాంపరింగ్ చేసి మార్చేయడం కోసమే.. ఆ మహిళను ఉద్యోగంనుంచి తొలగించారా? అనే అనుమానం కలుగుతోంది.

ఆమెను బయటకు పంపిన తర్వాత.. డాక్యుమెంట్స్ ను టాంపరింగ్ చేసేసి, వాంగ్మూలాలు మార్చేసి.. చంద్రబాబు నాయుడు పరిశుద్ధుడు అని చెప్పడానికి కుట్ర జరగవచ్చునని కూడా పలువురు అనుమానిస్తున్నారు. ముందు ముందు ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.

17 Replies to “కేసు తేలిపోయేలా.. ఆ పనులన్నీ చేస్తారేమో!”

  1. 5 years adhikaramlo undi ye proofs chupinchalekapoyaru. Ippudu veellu vachi proofs taru maru chetunnarantavu . Emanna sense unda article lo ani netizes asking

  2. 5 years adhikaramlo undi ye proofs chupinchalekapoyaru. Ippudu veellu vachi proofs taru maru chetunnarantavu . Emanna sense unda article lo ani netizes asking

    1. ఎన్ని సాక్ష్యాలున్నా ఏం లాభం… కోర్టులు మనవేగా… 10 నిమిషాల్లో కేసు కొట్టేస్తారు..

  3. పేర్ల వెనక తోక చూసి కులం నిజాయతీ లెక్కేయ్యకూడదు..అదేదో సినిమాలో పుట్టినవెంటనే పెరు పెట్టె య్యడం కన్నా ఆ బిడ్డ కాస్త జ్ఞానం సంపాదించినతరువాత వేసే వేశాలని బట్టి పెరుపెట్టాలి…ఈ రెడ్లలో చాలామంది ఆ తరగతి కిందే జమ కట్టోచ్చు.

Comments are closed.