జగన్ బర్త్ డే… ఫ్లెక్సీలో అల్లు అర్జున్

అల్లు అర్జున్ ఆర్మీ కూడా ఇలాంటి ఫ్లెక్సీలపై సోషల్ మీడియాలో వ్యూహాత్మక మౌనం వహిస్తోంది.

ఎప్పుడైతే అల్లు అర్జున్ పనిగట్టుకొని నంధ్యాల వెళ్లి మరీ తన స్నేహితుడైన వైసీపీ అభ్యర్థికి ప్రచారం చేశాడో, అప్పట్నుంచి అతడు జగన్ పార్టీకి కావాల్సినవాడయ్యాడు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత, బన్నీ అరెస్ట్ అయినప్పుడు కూడా పలువురు వైసీపీ నేతలు అతడికి అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు.

ఇప్పుడు ఏకంగా జగన్ తో కలిపి బన్నీని ఫ్లెక్సీలకు ఎక్కించారు. వైఎస్ జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, నందిగామలో ఫ్లెక్సీ వెలిసింది. దాని ప్రత్యేకత ఏంటంటే, ఒకవైపు జగన్ ఉంటే, మరోవైపు అల్లు అర్జున్ ఫొటో పెట్టారు.

“రాజు బలవంతుడైనప్పుడే శత్రువులంతా ఏకమౌతారు” అంటూ ఓ క్యాప్షన్ కూడా. ఈ ట్యాగ్ లైన్ కు అర్థం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జగన్ బలవంతుడు కాబట్టే.. టీడీపీ, జనసేన, బీజేపీ ఏకమయ్యాయనేది పరోక్ష అర్థం.

ఇలా బన్నీని వైసీపీలో కలిపేసుకుంటున్నారు. అయితే ఇదే ఫస్ట్ టైమ్ కాదు. పుష్ప-2 రిలీజ్ టైమ్ లో కూడా పలు చోట్ల జగన్-బన్నీ ఫ్లెక్సీలు వెలిశాయి. “మాకోసం నువ్వు వచ్చావ్.. నీ కోసం మేం వస్తాం” అంటూ అప్పుడు కూడా క్యాప్షన్లు కనిపించాయి.

బన్నీకి అదనపు తలనొప్పులు..

ఈ అత్యుత్సాహం ఫ్లెక్సీల వల్ల అల్లు అర్జున్ కు అదనపు తలనొప్పులు తప్ప, ఎలాంటి సంతోషం కలిగించవు. ఎందుకంటే, అతడు ఇప్పటికే కోర్టు కేసులతో సతమతమౌతున్నాడు. మరోవైపు అసెంబ్లీ సాక్షింగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన విమర్శలతో ఉక్కిరిబిక్కిరవుతున్నాడు.

ఇలాంటి టైమ్ లో ఈ ఫ్లెక్సీలు అతడికి ఇబ్బందికరమే. ఎందుకంటే, బెయిల్ పై బయటకొచ్చిన తర్వాత మెగా కాంపౌండ్ కు దగ్గరయ్యేట్టు కనిపించాడు బన్నీ. నేరుగా చిరంజీవి ఇంటికెళ్లి ఆయనతో కలిసి భోజనం చేశాడు. తనపై బహిరంగంగా విమర్శలు చేసిన నాగబాబు ఇంటికెళ్లి, ఆయనతో భేటీ అయ్యాడు. పవన్ కల్యాణ్ అపాయింట్ మెంట్ కోసం కూడా ప్రయత్నిస్తున్నట్టు కథనాలొస్తున్నాయి.

ఇలాంటి టైమ్ లో ఈ ఫ్లెక్సీలు కచ్చితంగా బన్నీకి ఇబ్బంది కలిగించేవే. అందుకే అల్లు అర్జున్ ఆర్మీ కూడా ఇలాంటి ఫ్లెక్సీలపై సోషల్ మీడియాలో వ్యూహాత్మక మౌనం వహిస్తోంది.

10 Replies to “జగన్ బర్త్ డే… ఫ్లెక్సీలో అల్లు అర్జున్”

  1. ఇదా అసలు reason 🙏🙏🙏….పొద్దున నుంచి పాపం yentra బాబు ఈ దరిద్రము అల్లు బాబుకు అని తెగ బాధ పడి పోతున్నారు అందరూ…😂😂

  2. పేరుకు సింగల్ సింహం కానీ అటు జూ ఎన్టీఆర్ ఇటు అల్లు అర్జున్ ఇంకో వైపు ఇంకొకరు ఇంత మంది ని లేపాల్సి వస్తుంది ఏమిటో ఈ కర్మ వైకాపా జనాలకి …..

  3. జాగ్రత్త, పెద్ద పెద్ద వాళ్లకే దిక్కు లేదు – ఇంకా కోర్టులు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు, 20 ఏళ్ల తర్వాత కూడా.

Comments are closed.