క్యారెక్టర్ ను బ్యాడ్ చేస్తుంటే బాధగా ఉంది- అల్లు అర్జున్

సంధ్య థియేటర్ ఘటనలో ఎవరి తప్పు లేదని, అది కేవలం ప్రమాదవశాత్తు జరిగిన ఘటన అని, తాను ఎటువంటి తప్పు చేయలేన్నారు.

ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు తనపై చేసిన ఆరోపణలపై అల్లు అర్జున్ మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చారు. సంధ్య థియేటర్ ఘటనలో ఎవరి తప్పు లేదని, అది కేవలం ప్రమాదవశాత్తు జరిగిన ఘటన అని, తాను ఎటువంటి తప్పు చేయలేన్నారు.

మీడియాతో మాట్లాడిన అల్లు అర్జున్, సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఒక దురదృష్టకర ప్రమాదమని, శ్రీతేజ్ ఆరోగ్యంపై గంటగంటకూ తెలుసుకుంటున్నానని తెలిపారు. ఆ బాలుడి ఆరోగ్యం మెరుగుపడుతుండటంతో తాను సంతోషంగా ఉంద‌న్నారు. క్యారెక్టర్ ను బ్యాడ్ చేస్తుంటే బాధగా బాధిస్తోందని, థియేటర్ వద్ద రోడ్ షో చేయలేదని, తాను కోసం ఎదురుచూస్తున్న వేలాది అభిమానుల కోసం మాత్రమే బయటకు వచ్చి అభివాదం చేశానని అన్నారు. 15 రోజులుగా చాలా బాధపడుతున్నా. 3 ఏళ్ల నుంచి కష్టపడి తీసిన‌ సినిమాను ఇప్పటివరకు థియేటర్‌కి వెళ్లి కూడా చూడలేదన్నారు.

కాసేపు సినిమా చూసి తిరిగి వెళ్లిన తనకు తొక్కిసలాటలో రేవతి మరణించిన విషయం మరుసటి రోజే తెలిసిందని, ఆ విషయం తెలుసుకుని ఆస్పత్రికి బయల్దేరినా, కేసు నమోదు కావడంతో పోలీసులు, సన్నిహితులు వెళ్లొద్దని చెప్పడంతో వెళ్లలేదన్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ అభిమానులు మరణిస్తే స్వయంగా వెళ్లి పరామర్శించిన అనుభవం ఉందని, అలాంటి తాను తన అభిమాని చనిపోతే వెళ్లలేదన్న మాట సరికాదన్నారు. పోలీసుల అనుమతి ఇస్తే క్షణంలో ఆ బాలుడిని చూసేందుకు వెళ్లాలని ఉందని, తన తండ్రి కూడా పోలీసుల నుంచి, ప్రభుత్వ నుంచి అనుమతి తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు.

రోడ్ షో చేశామని, అనుమతి లేకుండా వెళ్లామన్న సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తనకు బాధ కలిగించాయన్నారు. తప్పుడు సమాచారం వల్లే తనను తప్పుగా అర్థం చేసుకున్నారని వాపోయారు. ప్రభుత్వంతో ఎటువంటి వివాదం కోరుకోవడం లేదని స్పష్టతనిచ్చారు. మొత్తానికి తాను తప్పు చేయలేదని చెప్పిన అల్లు అర్జున్, తనను తప్పుగా అర్థం చేసుకోవడం బాధకలిగించిందని చెప్పడం చూస్తే, ఈ వివాదం ప్రభుత్వం ఇప్పటికైనా ముగిస్తుందా అనేది వేచి చూడాలి.

11 Replies to “క్యారెక్టర్ ను బ్యాడ్ చేస్తుంటే బాధగా ఉంది- అల్లు అర్జున్”

  1. “తగ్గేదేలా ” క్యారెక్టర్ ఫలితం ఇది..ఇప్పుడు ప్రతి డైలాగ్ వెనుక ఓ రాజకీయ వ్యాఖ్య ఉంటోంది..అదే డైలాగ్ నిన్ను కటకటాల వెనక్కి పంపిందని ఇప్పటికైనా క్లారిటీ వచ్చిందా?

  2. రేవతి కొడుకు గురించి నాకు సానుభూతి ఉంది ఎందుకంటే అతి చిన్న వయసులో అతనికి తల్లి లేకుండా పోయింది. చావాలని ఎవరూ రారు, చంపాలని ఎవరూ చూడలేదు. ప్రమాదవశాత్తు జరిగినదానికి ఎవరూ ఏమి చేయలేరు.

    ఆమె చావు మూర్ఖత్వం కిందికే వస్తుంది, ఎందుకంటే…

    మనం (టిక్కెట్ల రూపంలో) విసిరేసిన డబ్బుతో బతికే హీరోలు/ సినీజనాలు మనకు ఫ్యాన్స్ గా ఉండాలి తప్ప మనం వాళ్లకు కాదు. మనం పెంచి పోషించిన వాళ్ళు మనకోసం ప్రాణాలు ఇవ్వడానికి రెడీగా ఉండాలి, మనం వాళ్ళ కోసం కాదు

    ఈ హీరోలు ఇంత సంపాదించడానికి, ఇంత ఎత్తుకు ఎదగడానికి కారణం కేవలం మనం పెట్టిన డబ్బు, వాళ్ళను తిరస్కరిస్తే ఎంతో మంది వారసుల లాగ కనుమరుగు అయిపోతారు.

  3. 14 రోజులు జైల్లో పెట్టాలని చూశారు.. ఒక్క రోజుకే బయటకు వస్తే కడుపు మండదా

Comments are closed.