రేవంత్ ఆరోపణ.. బన్నీ వివరణ

జరిగింది దురదృష్టకరమైన ఓ యాక్సిడెంట్ అని అందులో ఎవరి తప్పు లేదని.. ఏ డిపార్ట్ మెంట్ ను వేలెత్తి చూపడానికి వీల్లేదని అన్నాడు బన్నీ.

ఈరోజు తెలంగాణ అసెంబ్లీ వేదికగా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. జరిగిన ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆయన, సినీ పరిశ్రమపై, అల్లు అర్జున్ పై (నేరుగా పేరు ప్రస్తావించలేదు) కొన్ని వ్యాఖ్యలు చేశారు.

దానికి స్పందనగా, అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టాడు. తను ఎవ్వరికీ వ్యతిరేకం కాదంటూనే.. ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు (నేరుగా సీఎం పేరు ప్రస్తావించకుండా) సమాధానం ఇచ్చాడు. ఇంతకీ అసెంబ్లీలో రేవంత్ ఏమన్నారు.. దానికి బన్నీ సమాధానమేంటి..? బ్యాక్ టు బ్యాక్ చూద్దాం..

సీఎం రేవంత్ రెడ్డి – 2వ తేదీ థియేటర్ వాళ్లు అప్లికేషన్ పెట్టుకున్నారు. 3వ తేదీన పోలీసులు తిరస్కరించారు. ఒకటే దారి ఉంది కాబట్టి వేలాది మంది వస్తే కంట్రోల్ చేయడం కష్టమని, హీరోహీరోయిన్లను రావొద్దని స్పష్టంగా చెప్పారు. తిరస్కరించిన తర్వాత కూడా హీరో వచ్చాడు.

హీరో అల్లు అర్జున్ – నేను నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా థియేటర్లోకి వెళ్లిపోయాననేది తప్పుడు అభియోగం. థియేటర్ వాళ్లు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతే వెళ్లాను. అక్కడికి వెళ్లి చూస్తే పోలీసులున్నారు. వాళ్లే లైన్ క్లియర్ చేస్తున్నారు. పోలీసులే లైన్ క్లియర్ చేస్తుంటే, పర్మిషన్ ఉందనే అనుకున్నాను. ఒకవేళ అనుమతి లేకపోతే, వాళ్లే చెబుతారు కదా, అప్పుడే నేను వెనక్కు వెళ్లిపోయేవాడ్ని.

సీఎం రేవంత్ రెడ్డి – కారులో వచ్చి తిరిగి వెళ్లిపోతే ఇంత ప్రమాదం జరిగేది కాదేమో. కానీ ఎక్స్-రోడ్ చౌరస్తా కంటే ముందు నుంచే కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేశాడు. దీంతో చుట్టుపక్కలున్న 7-8 సినిమా హాళ్ల నుంచి కూడా జనం అంతా అక్కడికి చేరుకున్నారు.

హీరో అల్లు అర్జున్ – రోడ్ షో చేశానని, ఊరేగింపు చేశానని అంటున్నారు. అవన్నీ తప్పుడు ఆరోపణలు. నేను అలాంటివేం చేయలేదు. ఇక చేయి ఊపడం గురించి ఆరోపిస్తున్నారు. నేను కనిపించి, చేయి ఊపకపోతే జనం కదలరు. వచ్చిన జనం నన్ను చూడాలనుకుంటారు. అలా ఊపమని కొన్నిసార్లు పోలీసులే అడుగుంటారు. ఒక్కసారి చేయి ఊపితే అందరూ వెళ్లిపోతారని చెబుతుంటారు. ఏ సెలబ్రిటీ లేదా లీడర్ అయినా అదే చేస్తారు, నేనూ అదే చేశాను.

సీఎం రేవంత్ రెడ్డి – హీరో థియేటర్ వదిలి వెళ్లలేదు, అక్కడే కూర్చున్నాడు. థియేటర్ నుంచి వెళ్లమని, నేరుగా డీసీపీ వచ్చి హీరోతో చెప్పారు. పరిస్థితి చేయి దాటిపోయింది, అవసరమైతే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. అలా బలవంతంగా హీరోను బయటకు తీసుకొచ్చారు.

హీరో అల్లు అర్జున్ – నేను థియేటర్లోకి వెళ్లిన తర్వాత ఒక్క పోలీస్ కూడా నన్ను కలవలేదు, నాకేం చెప్పలేదు. మేనేజ్ మెంట్ వచ్చి బయట జనం ఎక్కువగా ఉన్నారు వెళ్లిపోమని చెప్పారు. అందుకే నేను వెళ్లిపోయాను.

సీఎం రేవంత్ రెడ్డి – ఓ తల్లి చనిపోయింది, పిల్లాడు చావుబతుకుల మధ్య ఉన్నాడని తెలిసినా కూడా.. బయటకొచ్చిన హీరో వాహనంలో కూర్చొని వెళ్లకుండా, రూఫ్ టాప్ ఓపెన్ చేసి మళ్లీ చేయి ఊపాడు. ఏం మనుషులు వీళ్లు.. వీళ్లకు ఏం చెప్పాలి. పరిస్థితి అదుపు తప్పినప్పుడు రోడ్ షో చేయడం ఏంటి?

హీరో అల్లు అర్జున్ – ఆ మరుసటి రోజు నాకు తెలిసింది. ఓ మహిళ తొక్కిసలాటలో కళ్లు తిరిగి పడిపోయిందంట, ఆ తర్వాత చనిపోయిందంట అని తెలిసింది. ఓ బాబు కూడా ఉన్నాడని తెలిసి షాక్ కు గురయ్యాను. మరుసటి రోజు వరకు నాకు తెలియదు. నిజంగా ఆ రోజే నాకు తెలిసి ఉంటే నేను వెంటనే వెళ్లిపోయేవాడ్ని. నేను కూడా నా పిల్లలు, భార్యతో వచ్చాను. అలా ఎందుకుంటాను. మహిళ చనిపోయిందని తెలిసి కూడా నేను సినిమా చూస్తున్నానని అసత్య ఆరోపణలు చేస్తే చాలా బాధేస్తోంది. వేల మంది నన్ను చూడ్డానికి వచ్చినప్పుడు కారులో నేను దాక్కొని కూర్చోలేను కదా. అంతమంది వచ్చినప్పుడు నేను కారులో అలా కూర్చుంటే గర్వం అనుకుంటారు. నేను చెబితేనే వాళ్లు వెళ్తారు. అందుకే బయటకొచ్చి అలా అన్నాను. వాళ్లను కదలమని కూడా సైగలు చేశాను.

సీఎం రేవంత్ రెడ్డి – చనిపోయిన 11వ రోజు వరకు హీరో, ప్రొడ్యూసర్ ఎవ్వరూ చావుబతుకుల మధ్య ఉన్న పిల్లాడ్ని పరామర్శించలేదు. ఇది ఏ రకమైన మానవత్వం? ఇలాంటి మానవత్వం లేని వాళ్లను విధి నిర్వహణలో భాగంగా పోలీసులు తీసుకెళ్తే, వాళ్లపై కూడా అతడు దురుసుగా ప్రవర్తించాడని నాకు పోలీసులు చెప్పారు.

హీరో అల్లు అర్జున్ – హాస్పిటల్ కు వెళ్దామని బన్నీ వాస్ కు ఫోన్ చేశాను. తను ముందు వెెళ్లి, పరిస్థితి చూసి, హాస్పిటల్ కు రావొద్దని చెప్పాడు. రాత్రి థియేటర్ కు వెళ్లారు ఇష్యూ అయింది. ఇప్పుడు హాస్పిటల్ కు వస్తే గందరగోళం అవుతుంది, వద్దని చెప్పాడు, అందుకే ఆగిపోయాను. పైగా అంత్యక్రియలు పూర్తయిన తర్వాత బాధిత కుటుంబాన్ని నా దగ్గరకు తీసుకొస్తానని చెప్పాడు, అందుకే వెయిట్ చేస్తున్నాను. ఆ తర్వాత వాళ్లు నా మీద కేసు పెట్టారని తెలిసి, వాళ్లను కలవొద్దని నా లీగల్ టీమ్ చెప్పడంతో ఆగిపోయాను. అప్పటికీ నేను మూర్ఖంగా వెళ్తానని చెబితే, నా లీగల్ టీమ్ మరింత గట్టిగా వద్దని వారించింది.

సీఎం రేవంత్ రెడ్డి – మీరు వ్యాపారాలు చేసుకోండి.. సినిమాలు తీసుకోండి.. డబ్బులు చేసుకోండి.. ప్రభుత్వం నుంచి సబ్సిడీలు, ప్రత్యేక అనుమతులు తీసుకుండి.. కానీ ప్రాణాలు తీసే ప్రత్యేక హక్కు ప్రభుత్వం ఇవ్వదు.

హీరో అల్లు అర్జున్ – నేను కేర్ చేయడం లేదంటూ అసత్య ఆరోపణలు చేస్తున్నారు. నా క్యారెక్టర్ పై దెబ్బకొడుతున్నారు. ఇలాంటి టైమ్ లో నాకు చాలా బాధేస్తుంది. నేను ఎన్ని విమర్శలైనా తీసుకుంటాను కానీ ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నాపై ఇలాంటి ఆరోపణలు చేస్తే నిజంగా బాధేస్తుంది. బాధితుల పేరిట ఫిక్స్ డ్ డిపాజిట్ చేద్దామని, మంచి ఫిజియోథెరపిస్ట్ ను పెట్టిద్దామని.. ఇలా రకరకాలుగా ఆలోచిస్తుంటే, నా క్యారెక్టర్ ను దెబ్బతీసేలా ఆరోపణలు చేస్తున్నారు.

జరిగింది దురదృష్టకరమైన ఓ యాక్సిడెంట్ అని అందులో ఎవరి తప్పు లేదని.. ఏ డిపార్ట్ మెంట్ ను వేలెత్తి చూపడానికి వీల్లేదని అన్నాడు బన్నీ. అందరూ తమతమ బాధ్యతలు నిర్వర్తించారని, అదొక యాక్సిడెంట్ మాత్రమేనని అన్నాడు. తను ఏ వ్యక్తికి లేదా ప్రభుత్వానికి లేదా డిపార్ట్ మెంట్ కు వ్యతిరేకంగా మాట్లాడడం లేదని.. కొన్ని అసత్య ఆరోపణలు, కమ్యూనికేషన్ గ్యాప్స్ ను క్లియర్ చేసేందుకు మాత్రమే మీడియా సమావేశం పెట్టానంటూ చెప్పుకొచ్చాడు. మీడియా అడిగిన ఒక్క ప్రశ్నకు కూడా ఆయన సమాధానం ఇవ్వలేదు. తను ఇప్పుడు ఏం మాట్లాడినా లీగల్ గా ఇబ్బంది అవుతుందంటూ ప్రెస్ మీట్ ముగించాడు.

17 Replies to “రేవంత్ ఆరోపణ.. బన్నీ వివరణ”

  1. 15 రోజులు జైల్లో పెట్టాలని చూశారు. వెంటనే వచ్చేసరికి కడుపు మండదా

  2. 14 రోజులు జైల్లో పెట్టాలని చూశారు.. ఒక్క రోజుకే బయటకు వస్తే కడుపు మండదా

  3. నువ్వు వచ్చావు అని పొలీసులు జనం ని క్లేయర్ చెస్తె అది నీకు క్లేయరెస్ ఇచ్చినట్టా?

  4. బన్ని కూడా ఇంత వివరంగా చెప్పలెదు. GA కౌంటర్ లా రాసాడు!!

    .

    1) ధీయెటర్ వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చాకె వెళ్ళాను! —

    ధీయెటర్ వాళ్ళు క్లియరెన్స్ ఇస్తారా? పొలీసులు ఇస్తారా?

    2) పొలీసులె అక్కడ లైన్ క్లియర్ చెస్తున్నారు? —

    నువ్వు వచ్చావు అని పొలీసులు జనం ని క్లేయర్ చెస్తె అది నీకు క్లియరెన్స్ ఇచ్చినట్టా?

    3) నెను కనిపించి చెయి ఊపకపొతె జనం కదలరు —

    అసలు నువ్వు భయటకి కనిపించి చెయ్యి ఊప్పకపొతె నువ్వు వచ్చావు అని ఎవరికి తెలుస్తుంది?

    1. వీడు తెలుగులొ ఒకలా రాస్తె, ఎంగ్లిష్ లొ దానికి విరుద్దం గా రాస్తాడు!

      Allu Arjun’s Press Meet: A Poor Show With Lies

      greatandhra.com/movies/news/allu-arjuns-press-meet-a-poor-show-with-lies-142908

Comments are closed.