సినిమా చూడాలని వుంటే ..

కొన్ని గంటలకు గంటల తరువాత కానీ తనకు తెలియలేదన్న బన్నీ మాటలు విశ్వసనీయమా?

మూడేళ్ల నా కష్టాన్ని థియేటర్ లో చూడాలనుకున్నాను. అందుకే సంధ్య ధియేటర్ కు వెళ్లాను అన్నది హీరో అల్లు అర్జున్ పాయింట్. నిజమే. కానీ సినిమా చూడాలంటే క్రౌడ్ ఎక్కువ వచ్చే సంధ్య థియేటర్ మాత్రమే లేదు కదా. మామూలు టైమ్ లో సినిమా జనాలు అంతా సైలంట్ గా ఎఎంబి లో ఎందుకు చూస్తారు. కావాలంటే ముంబాయిలో మల్టీ ప్లెక్స్ కు వెళ్లొచ్చు. అసలు వస్తున్నట్లు చెప్పకుండా ముసుగు వేసుకుని సంధ్యకే వెళ్లొచ్చు. దీపాలు ఆర్పేసిన తరువాత లోపలికి ఎంటర్ కావచ్చు. ఇలా ఎంత మంది ఎన్ని సార్లు చేయలేదు.

బన్నీ షాపింగ్ కోసం కోఠి లేదా అబిడ్స్ కు వెళ్తున్నారా.. అమీర్ పేటకు వెళ్తున్నారా. నేరుగా దుబాయ్ నే దా వెళ్లేది. అందువల్ల బన్నీ చెబుతున్నది జస్ట్ ఓ సాకు మాత్రమే. మూడేళ్ల తన కష్టాన్ని చూడాలనుకుంటే చాలా మార్గాలు వున్నాయి. ఓ స్క్రీన్ మొత్తం బ్లాక్ చేసి చూడొచ్చు తన స్వంత ఎఎఎ థియేటర్ లో సైలంట్ గా వెళ్లి. హడావుడి ఎందుకు చేయాలి. పర్మిషన్లు అడిగి, తాను ఫలానా థియేటర్లో సినిమా చూస్తానని ముందే లీకులు ఇచ్చి?

ఎవరూ చెప్పలేదా?

జరిగినది ఎంత పెద్ద సంఘటన. ప్రపంచం మొత్తం జరిగిన కొన్ని నిమిషాల్లోనే జరిగిపోయిందే. కానీ బన్నీకి మాత్రం ఎవరూ చెప్పలేదా? తెలియలేదా? అంటే అంత ఐరన్ కర్టెన్ లు మూసి వున్న గదిలో వుండిపోయారా? చేతిలో వున్న ఫోన్ లో ట్విట్టర్ చూడలేదా, ఇన్ స్టా చూడలేదా? కొన్ని గంటలకు గంటల తరువాత కానీ తనకు తెలియలేదన్న బన్నీ మాటలు విశ్వసనీయమా?

ఆసుపత్రికి వెళ్లడానికి లీగల్?

పోనీ మర్నాడు తెలిసింది. వెంటనే వెళ్దాం అంటే అల్లు అర్జున్ సన్నిహితుడు బన్నీ వాస్ వద్దన్నారు. కాస్త కుదురుకున్నాక అయినా వెళ్ల వచ్చు కదా. లీగల్ టీమ్ వద్దని అన్నదా? ఎందుకు వద్దన్నది, ఏ పాయింట్ బేసిస్ మేరకు వద్దన్నది? అది ఎందుకు చెప్పరు? ఎంత సేపూ లీగల్ టీమ్ వద్దన్నది అందువల్ల వెళ్లలేదు అంటారు తప్ప. ఆసుపత్రిలో చావు బతుకులతో కొట్టాడుతున్న వారిని పరామర్శిస్తే కేసు నీరు కారిపోతుందా? ఇంకేమైనా అయిపోతుంది. మరి అలాంటపుడు బన్నీ తరపు వాళ్లు కూడా వెళ్ల కూడదు కదా? పాతిక లక్షల సహాయం ప్రకటించకూడదు కదా?

మీడియాను పిలవడం ఎందుకు?

అసలు బన్నీ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టినట్లు? తాను అనుకున్న పాయింట్లు అన్నీ కాగితం మీద రాసుకుని, రెండు భాషల్లో చెప్పి ముగించారు. మీడియా ప్రశ్నలకు సమాధానం చెప్పే ఆలోచన లేనపుడు మీడియాను పిలిచి వారి సమయం ఎందుకు వృధా చేయడం. రెండు భాషల్లో చెరో వీడియో వదిలితే సరిపోతుంది కదా? మీడియా అంతా బన్నీ ఇంటి దగ్గర మోహరించడం, వేచి వుండడం, ఆలస్యంగా వచ్చిన బన్నీ సారీ చెప్పడం, తను అనుకున్నది చెప్పి చక్కా పోవడం. దేనికోసం ఇదంతా?

తగ్గినట్లేనా?

బన్నీ బాడీ లాంగ్వేజ్, మాటతీరు, డ్రెస్ సెన్స్ ఇవన్నీ చూస్తుంటే, సినిమా విడుదల టైమ్ వరకు జరిగిన ఈవెంట్లలో బన్నీ నడక, స్టేజ్ మీద బన్నీ తప్ప మరెవరు వుండకుండా చేసిన ఏర్పాట్లు, పుష్ప 2 లో నటించిన నటులకు ఎవరికీ దక్కని గౌరవం ఇవన్నీ కంపార్ చేసుకుంటే కాస్త తగ్గినట్లు కనిపిస్తోంది బన్నీ వైఖరి. చూడాలి ముందు ముందు ఎలా వుంటుందో?

28 Replies to “సినిమా చూడాలని వుంటే ..”

  1. అల్లు అర్జున్ మానవత్వం లేకుండా విషయం తెల్సిన తర్వాత కూడ సినిమా చూసాడు. మళ్లీ చేతులు వుపాడు. నువు చెయ్యబట్టి ఒక ఫ్యామిలీ కి కోలుకోలేని నష్టం జరిగింది.

  2. ఇక్కడ ఒక విషయం గమనిస్తే ఎంటైర్ 420 గారి paytm అంతా AA నీ పెద్ద పెద్ద జాకీలు పెట్టీ లేపారు ఈ GA తో సహా కలిపి. ఇప్పుడు సిట్యువేషన్ ఇలా మారిపోయేసరికి పాపం బన్నీ నీ అందరూ వదిలేశారు. ఈ జొకర్ఆంధ్ర తో సహా🤣🤣.

  3. అరెరె గ్రేట్ ఆంద్ర, ఇలా గోడ మీద గోపి లాగ హటాత్తుగా పుష్ప కి వ్యతిరేఖంగా మొదలిపెట్టవు , ఇప్పటిదాకా సపోర్ట్ చేసి.

  4. Orey papam ra oka person ni intala target cheyadam. Allu Arjun chesindi tappe daniki aayana yenni sarlu sorry cheppali ra.political meetings lo yento Mandi chanipoyaru appudu yevaru yenduku matladaledhu.

  5. ఒక తల్లి చనిపోయిన పశ్చాతాపం కనీసం కనిపించ లేదు, అల్లు అర్జున్ లో.

    కనీసం మీడియాలో అయిన అలా నటన కూడా చేయలేక పోయాడు, ఈ నేషనల్ నటుడు.

Comments are closed.