బన్నీకి అపాయింట్ మెంట్ ఇక లేనట్టే?

ఇలాంటి టైమ్ లో బన్నీతో పవన్ కల్యాణ్ సమావేశమైతే, రాజకీయంగా అది మరింత క్లిష్టంగా మారుతుంది. బన్నీకే కాదు, పవన్ కూ తలనొప్పులు తెచ్చిపెడుతుంది.

బెయిల్ పై బయటకొచ్చిన వెంటనే మెగా కాంపౌండ్ లో పర్యటనలు చేపట్టాడు అల్లు అర్జున్. నేరుగా చిరంజీవి ఇంటికెళ్లి తన మేనమామను కలిశాడు, చిరంజీవితో కలిసి భోజనం చేశాడు. ఆ తర్వాత అట్నుంచి అటు నేరుగా నాగబాబు ఇంటికెళ్లాడు. మేనల్లుడ్ని చూసిన వెంటనే నాగబాబు సాదరంగా ఆహ్వానించారు. కౌగిలించుకొని మరీ ఇంట్లోకి తీసుకెళ్లారు.

ఇదే వేడిలో చిన మేనమామ పవన్ కల్యాణ్ ను కూడా కలిసేందుకు అల్లు అర్జున్ ప్రయత్నించారంటూ వార్తలొచ్చాయి. కానీ ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే, అల్లు అర్జున్ కు పవన్ కల్యాణ్ అపాయింట్ మెంట్ కష్టం అవ్వొచ్చు. ఒక విధంగా చూసుకుంటే అసాధ్యమని కూడా చెప్పొచ్చు.

ప్రస్తుతం అల్లు అర్జున్ కు, తెలంగాణ ప్రభుత్వానికి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోంది. ఎవరు ఔనన్నా కాదన్నా ఇది నిజం. అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే, ఇటు పోలీస్ బాస్ లు, అటు కాంగ్రెస్ నేతలు బన్నీపై విరుచుకుపడుతున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

బన్నీ ప్రెస్ మీట్ తో సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన పూర్తిస్థాయిలో రాజకీయ రంగు పులుముకుంది. ఇలాంటి టైమ్ లో బన్నీతో పవన్ కల్యాణ్ సమావేశమైతే, రాజకీయంగా అది మరింత క్లిష్టంగా మారుతుంది. బన్నీకే కాదు, పవన్ కూ తలనొప్పులు తెచ్చిపెడుతుంది.

ఎందుకంటే, పవన్ కల్యాణ్ కేవలం ఓ హీరో మాత్రమే కాదు. మెగా కాంపౌండ్ కుటుంబ సభ్యుడు మాత్రమే కాదు. ఆయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం. ఆ హోదాలో అల్లు అర్జున్ కు అపాయింట్ మెంట్ ఇస్తే, వివాదం మరింత జటిలం అవుతుందనేది రాజకీయ విశ్లేషకుల మాట. కాబట్టి ఇప్పట్లో అల్లు అర్జున్ కు పవన్ కల్యాణ్ అపాయింట్ మెంట్ ఇవ్వకపోవచ్చు.

15 Replies to “బన్నీకి అపాయింట్ మెంట్ ఇక లేనట్టే?”

  1. నీకు రిలేషన్స్ తెలియకపోతే మూసుకొని కూర్చోవచ్చు కదా? సాయి ధరమ్ తేజ్ ఉన్నాడు కదా అతనికి పైన చెప్పిన వారంతా చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు మేనమామలవుతారు, అల్లు అర్జున్ కి కాదు. చిరంజీవి మేనత్త భర్త అంటే మామ, మిగతా వాళ్ళు కూడా మామ అంతే మేనమామలు కాదు

  2. సుకుమార్ / బన్నీ కెరీర్ లో వరస్ట్ మూవీ పుష్ప 2 ,సుకుమార్ మీద ఓ మంచి దర్శకుడు అనే నా అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేసింది పుష్పా2 మూవీ… కాస్తో కూస్తే సదువుకున్న దర్శకుడు… పూర్వాశ్రమంలో పాఠాలు కూడా చెప్పాడు

    డబ్బులుంటే పోలీసుల్ని, పోలీసు వ్యవస్థనే కొనేసే పరిస్థితి ఉంటుందా..! ఎవరో ఒకరో ఇద్దరో అమ్ముడు పోతారు… కానీ…. వాట్ దిస్ నాన్సెన్స్. అసలు ఇండియన్ పొలిటికల్ సిస్టం గురించి..భారత దేశ ఎన్నికల విధానం గురించి నీకు ఏమన్నా అవగాహాన ఉందా…పెళ్లానికి ఫొటో ఇవ్వనంత మాత్రాన… బలిసి కొట్టుకున్నంత డబ్బులున్న ప్రతి వాడు..

    సి.ఎం. ని మార్చేసే వ్యవస్థ ఉంటుందా.?మినిమం… కామన్ సెన్స్ అవసరం లేదా …డబ్బుంటే… ఇండియాలో ఏదైనా సాధ్యమనుకుంటున్నాడా …ఇంతేనా ఒక డైరెక్టర్ కి ఉన్న నాలెడ్జ్ ! అయ్యా అల్లు దయజేసి తెలుగు స్థాయిని పెంచుతున్నాం. తెలుగు భాషలో ఇప్పటి వరకూ రాని సినిమాల్ని తీసాం అనే… సొచ్చు డైలాగులు చెప్పకు అది కూడా ప్రెసుమీత్ పెట్టి .

  3. అల్లు అర్జున్ గారు ఎంక నా యాటిట్యూడ్ మారలే… బాడీ లాంగ్వేజ్ మారలే ..నేను వల్లనే తెలుగు సినిమా పేరు వచ్చినట్టు మేరు ఒక్కరే మంచి సినిమాలు చేస్తున్నట్టు తెలుగు సినిమా క్యతి నువ్వే పెంచుతున్నట్టు ..ఫీల్ అవుతున్నావ్ ఇదంతా నీకు జాతియ్య అవార్డు రావాడం వల్లే గా నాకు మాత్రమే జాతీయ అవార్డు వచ్చింది అనే అహంకారం పోగరు నీలో పెరుకు పోయింది. ఫాస్ట్…ప్రియమణి హీరోయిన్ కి నేకంటే ముందు జాతీయ అవార్డు వచ్చింది హీరో కంటే ముందు ఒక లేడి వచ్చింది ఆమెకంటే గొప్పవాడివా..

Comments are closed.